తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shyness Overcome Tips : ఈ చిట్కాలు పాటిస్తే సిగ్గును తగ్గించుకోవచ్చు, నలుగురిలో ఇట్టే కలవచ్చు

Shyness Overcome Tips : ఈ చిట్కాలు పాటిస్తే సిగ్గును తగ్గించుకోవచ్చు, నలుగురిలో ఇట్టే కలవచ్చు

Anand Sai HT Telugu

03 February 2024, 10:18 IST

    • Shyness Overcome Tips In Telugu : సిగ్గు అనేది దాదాపు చాలా మందికి ఉంటుంది. దీని నుంచి బయటపడలేక.. ఎవరికీ చెప్పుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అయితే కొన్ని చిట్కాలు పాటించి సిగ్గు నుంచి బయటపడొచ్చు.
సిగ్గును వదిలేసేందుకు చిట్కాలు
సిగ్గును వదిలేసేందుకు చిట్కాలు (Unsplash)

సిగ్గును వదిలేసేందుకు చిట్కాలు

ఇంటికి చుట్టాలు వస్తే సిగ్గు. పొద్దున ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సాయంత్రమైనా వచ్చేది లేదు. కిరాణం షాపుకెళ్లి కావాల్సింది అడగాలంటే సిగ్గు.. అందరూ వెళ్లిపోయాక.. ఏం కావాలో మెల్లగా అడుగుతాం. వీధిలో నడవాలంటే సిగ్గు.. అందరూ మనల్ని చూసి.. ఏమని కామెంట్ చేస్తారోనని. ఇలా సిగ్గుతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఆఫీసుల్లో, రోడ్ల మీద.. ఇలా సిగ్గు కారణంగా అబ్బో చెప్పుకోలేని నరకం. కొన్ని చిట్కాలు పాటిస్తే సిగ్గు పడకుండా ఉండొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

సిగ్గు వదిలించుకోవాలి

నిజానికి చాలా మంది సిగ్గు లేకుండా బతుకుతున్నారు అని తిడుతుంటారు. కానీ వాస్తవానికి అదే మంచి పద్ధతి. సిగ్గు లేకుండా బతికితే మీ అంత అదృష్టవంతులు లేరు. సిగ్గు పడుతూ బతికితే మీ అంత దురదృష్టవంతులు ఉండరు. సిగ్గు అనేది మనిషిని నిజంగానే నాశనం చేస్తుంది. అందుకే సిగ్గు లేకుండా.. సిగ్గ పడకుండా బతికేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.

కొంతమంది ప్రతి విషయంలోనూ చిరాకుగా ఉంటారు. ఈ లక్షణం వారి వ్యక్తిత్వం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వారిని సమాజం నుండి దూరం చేస్తుంది. వారు ఎవరో కాదు.. ఎక్కువగా సిగ్గుపడేవారే. సిగ్గును ఎలా వదిలించుకోవాలో ట్రై చేయాలి. అందరూ ఒకచోట చేరి మట్లాడుతున్నప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా.. అని సైలెంట్‌గా ఉంటే.. అది మీ సిగ్గు వల్ల. ఈ గుణమే మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది.

సిగ్గు పడితే ఇతరులతో కలవలేరు

సిగ్గు మిమ్మల్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కలవకుండా, మాట్లాడకుండా ఆపేస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. మీ ఈ సిగ్గును వదిలించుకోవడానికి కొన్ని విషయాలు పాటించాలి. సిగ్గు మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేయడమే కాదు.. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనకుండా చూస్తుంది. ఈ లక్షణం ఉన్న వ్యక్తి ఇతరులతో సంభాషించేటప్పుడు అసురక్షిత అనుభూతి చెందుతాడు. దీని కారణంగా తల తిరగడం, చెమటలు పట్టడం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలను వస్తాయి.

జీవితంలో పైకి వెళ్లరు

సిగ్గు అనేది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు కార్యాలయంలో, వ్యక్తిగత జీవితంలో మీరు అనుభవించే ఉంటారు. ఇది ఆత్మగౌరవాన్ని లేదా ఆత్మవిశ్వాసాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఈ లక్షణం ఉన్న వ్యక్తులు కొత్త స్నేహితులను సంపాదించుకోవడంలో ఇబ్బంది పడతారు. జీవితంలో పైకి వెళ్లలేరు.

అందరితో మాట్లాడండి

ఈ అలవాటు నుంచి బయటపడేందుకు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో క్రమం తప్పకుండా మాట్లాడండి. ఈ విషయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

అవకాశాలు కోల్పోతారు

మీ ప్రతిభను, విజయాన్ని గుర్తించే సమయంలో సిగ్గుపడితే జీవితంలో కొత్త అవకాశాలను కోల్పోతారు. మీ బలాలు ఏమిటో తెలుసుకోండి. వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మిమ్మల్ని ప్రశంసిస్తుంటే.. సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్లిపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. రావాల్సిన అవకాశాలు అక్కడే ఆగిపోతాయి.

ఎవరు ఏం అనుకుంటే మనకేంటి

అందరూ నిన్ను చూస్తున్నారని అనుకోవడం మానేయండి. ఇతరులు మీ గురించి అన్ని విషయాల గురించి పట్టించుకోవద్దు. మీరు కోరుకున్నట్లుగా ఉండండి. ఎవరు ఏం అనుకుంటే మనకేం అని మాట్లాడాలి అనుకున్నది మాట్లాడేయాలి. అప్పుడే మీరు జీవితంలో పైకి వెళ్తారు.

మనకు మనమే శత్రువు

ఎప్పుడైనా ఆలోచించారా.. మన శత్రువు మనమే. మనల్ని మనం సమాజానికి దూరంగా ఉంచుతాం. అలా ఉండటం మానేసి ఇతరులతో కలవండి. ఇది మీకు ఉన్న భయం, సిగ్గును తొలగించడానికి సహాయపడుతుంది. అప్పుడే అందరూ మీకు దగ్గరవుతారు.

సిగ్గును అధిగమించడానికి మొదట వైఫల్యాన్ని అంగీకరించండి. వైఫల్యం అనేది ప్రయాణానికి ముగింపు కాదు. ఓటమి రుచి చూస్తేనే గెలుపు విలువు తెలుస్తుంది. వైఫల్యాన్ని అంగీకరించడం నేర్చుకోవడం అంటే అవమానాన్ని అధిగమించడం. వైఫల్యాన్ని స్వాగతించడం ప్రారంభించండి. విజయం మీకు వస్తుంది. పైన చెప్పిన విషయాలను క్రమం తప్పకుండా అనుసరించడం ద్వారా మీరు మీ సిగ్గును అధిగమించవచ్చు.

తదుపరి వ్యాసం