తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Daddojanam Prasadam Recipe: వరలక్ష్మీ వ్రతం స్పెషల్ టెంపుల్ స్టైల్ దద్దోజనం రెసిపీ

Daddojanam Prasadam Recipe: వరలక్ష్మీ వ్రతం స్పెషల్ టెంపుల్ స్టైల్ దద్దోజనం రెసిపీ

HT Telugu Desk HT Telugu

25 August 2023, 9:30 IST

    • అదేంటో కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా గుడిలో చేసిన స్టైల్లో వంటలకు రుచి రావడం కాస్త కష్టంగానే ఉంటుంది. దానిలో దద్దోజనం కూడా ఒకటి. గుడిలో చేస్తే ఒకలా ఉంటుంది. ఇంట్లో చేస్తే మరోలా ఉంటుంది. ఇంతకీ గుడిలో దద్దోజనం ఏవిధంగా చేస్తారో అనే ఆసక్తి మీలో ఉంటే రెసిపీ ఇక్కడే ఉంది చదివేయండి.
దద్దోజనం ప్రసాదం రెసిపీ
దద్దోజనం ప్రసాదం రెసిపీ (Radhika41, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

దద్దోజనం ప్రసాదం రెసిపీ

పండుగలకు నైవేద్యాలు సమర్పించడం అనేది కాస్త కష్టంతో కూడుకున్న పనే. వంటలు చేయడం, పూజ చేయడం ఇవన్నీ పని భారాన్ని పెంచుతాయి. అయితే అమ్మవారు మెచ్చే, సింపుల్​గా ఇంట్లోనే రెడీ చేసుకోగలిగే టెంపుల్ స్టైల్ దద్దోజనం ఇప్పుడు చేసేయండి. దీనిని చేయడానికి పెద్ద సమయం కూడా పట్టదు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

దద్దోజనం రెసిపీ కావాల్సిన పదార్థాలు

  1. బియ్యం - అర కప్పు
  2. నీళ్లు - ఒకటిన్నర కప్పు
  3. పెరుగు - ఒకటిన్నర కప్పు
  4. పాలు - అరకప్పు మరిగించినవి
  5. తాళింపు కోసం
  6. నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  7. ఆవాలు - అర టీస్పూన్
  8. జీలకర్ర - అర టీస్పూన్
  9. ఇంగువ - చిటికెడు
  10. కరివేపాకు - ఒక రెబ్బ
  11. మినపప్పు - అరటీస్పూన్
  12. శనగపప్పు - అరటీస్పూన్
  13. మిరియాలు - అర టీస్పూన్

దద్దోజనం తయారీ విధానం

  1. ముందుగా బియ్యాన్ని కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. సమయం సరిపోదు అనుకుంటే నానబెట్టడం మానేసి.. బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేయాలి. రెండు విజిల్స్ వచ్చేవరకు మంటను మధ్యస్థంగా ఉంచాలి.
  2. అయిన వెంటనే హీట్ వెళ్లనిచ్చి.. అన్నాన్ని మెత్తగా గరిటతో కలపాలి. అన్నం కాస్త వేడిగా ఉండగానే దానిలో మరిగించిన పాలు వేయాలి. అది చల్లారిన తర్వాత దానిలో సాల్ట్ వేయాలి. అనంతరం దానిలో పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు ఇంకా అవసరం అనుకుంటే మరింత వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయండి. దానిలో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి.. దోరగా వేయించండి. దానిలోనే ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడించి స్టవ్ ఆపేయండి.
  4. అది కాస్త చల్లారిన తర్వాత పెరుగన్నంలో వేసి బాగా కలపండి. అంతే టేస్టీ టేస్టీ టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ.

తదుపరి వ్యాసం