తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి

04 January 2022, 11:34 IST

    • ప్రేమలో విఫలమైతే ఆ బాధను చెప్పలేం. అంతగా వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ప్రేమించిన వారిని మరువలేక, వారితో కలిసి ఉండలేక ఎంతో మంది మనసులోనే బాధను అనుభవిస్తుంటారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో లవ్ బ్రేకప్ అయితే ఆ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. 
ప్రేమలో విఫలమైతే
ప్రేమలో విఫలమైతే (Hindustan Times)

ప్రేమలో విఫలమైతే

ప్రేమ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ భావనను అక్షరాలతో వర్ణించలేం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆ అనుభూతిని పొందుతారు. ప్రేమ కలగడానికి క్షణం సరిపోతుందేమో.. కానీ మరచిపోవడానికి కొన్ని యుగాలు సరిపోవు అని ఓ సినీ కవి చెప్పినట్లు ప్రేమలో విజయవంతమైతే జీవితమంతా ఆనందంగా, ప్రశాంతంగా గడపవచ్చు. అదే ప్రేమలో విఫలమైతే ఆ బాధను చెప్పలేం. అంతగా వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ప్రేమించిన వారిని మరువలేక, వారితో కలిసి ఉండలేక ఎంతో మంది మనసులోనే బాధను అనుభవిస్తుంటారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో లవ్ బ్రేకప్ అయితే ఆ బాధ నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయేందుకు చిట్కాలు

- ప్రేమలో విఫలమైతే ముందు ఆ విషయాన్ని మీరు అంగీకరించాలి. బాధను మరచిపోయేందుకు ఏడవండి, పెద్దగా అరవండి. అంతేకానీ ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. హృదయం ముక్కలైందని జీవితాన్ని బలిపెట్టకూడదు.

- అమితంగా ప్రేమించిన వ్యక్తి మీ నుంచి దూరమైతేనో లేదా మీరే వారిని వదిలించుకుంటేనో ముందు మీరు ఆ నిజాన్ని స్వీకరించండి.

- కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీకు జరిగిన సంఘటనను మర్చిపోయేందుకు డిస్ట్రాక్ట్ అవ్వండి

- అవతలి వ్యక్తికి సంబంధించిన వస్తువులను మీ దగ్గర ఉంచుకోవద్దు. వాటిని తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే అవి పదే పదే ఆ జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.

- మిమ్మల్ని వదిలివెళ్లిపోయారని వారిపై ద్వేషాన్ని పెంచుకోవద్దు. వీలైనంత వరకు వారిని క్షమించండి. అయితే మరోసారి మాత్రం వారిని నమ్మకండి.

- సంతోషంగా గడిపేందుకు మీకంటూ కొంత సమయాన్ని కేటాయించండి. మీ స్నేహితులు, సన్నిహితులు కలిసి పంచుకున్న జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

- జరిగింది ఏదైనా మీ మంచికే అనుకుని ముందుకు సాగండి. అందుకు కృతజ్ఞత భావంతో ఉండండి.

- లవ్ బ్రేక్ అయినంత మాత్రాన ప్రేమను వద్దనుకోవడం తప్పు. కాబట్టి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి.

 

తదుపరి వ్యాసం