తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Cutlet: రుచిగా, ఆరోగ్యంగా ఓట్స్ కట్లెట్..

oats cutlet: రుచిగా, ఆరోగ్యంగా ఓట్స్ కట్లెట్..

08 May 2023, 6:30 IST

  • oats cutlet: ఓట్స్ కట్‌లెట్ ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి. 

ఓట్స్ కట్‌లెట్
ఓట్స్ కట్‌లెట్ (pexels)

ఓట్స్ కట్‌లెట్

ఊరికే ఓట్స్ తినడం రొటీన్ గా అనిపిస్తోందా. అయితే రుచిలో ఏమాత్రం తీసిపోని ఈ ఓట్స్ కట్‌లెట్ ఒకసారి ప్రయత్నించి చూడండి. తక్కువ నూనెతో చేసే ఈ వంటకం అల్పాహారంలోకి, పిల్లల లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది. నేరుగా తినొచ్చు. లేదా రోటీ మధ్యలో పెట్టి ఫ్రాంకీ లాగా కూడా పిల్లలకు ఇవ్వొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

Oats Egg Omelette : ఓట్స్ ఎగ్ ఆమ్లెట్.. మీ అల్పాహారాన్ని ఆరోగ్యకరంగా మార్చగలదు

Tuesday Motivation : పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనది.. కానీ ముందుగా ఈ విషయాలు చెక్ చేసుకోండి

కావాల్సిన పదార్థాలు:

ఓట్స్ - 1 కప్పు

ఉడికించిన బంగాళదంప - 1

పనీర్ తురుము - పావు కప్పు

ఉల్లిపాయ- 1 చిన్నది

సన్నగా తరిగిన పచ్చిమిర్చి- 2

అల్లం వెల్లుల్లి ముద్ద - సగం టేబుల్ స్పూన్

క్యారట్ తురుము - సగం కప్పు

నూనె - 2 టేబుల్ స్పూన్లు

చాట్ మసాలా- 1 టీస్పూన్

ఆమ్ చూర్ పౌడర్ -పావు టేబుల్ స్పూన్

కొత్తిమీర - కొద్దిగా

ఉప్పు- తగినంత

తయారీ విధానం :

step 1: ఒక పెద్ద పాత్రలో ఓట్స్, పనీర్ తురుము, ఉడికించిన బంగాళ దుంప ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి.

step 2: ఇప్పుడు దీన్ని ముద్దలా కలుపుకోవాలి. అవసరమైతేనే నీళ్లు కొద్దిగా వాడండి.

step 3: ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని చేతికి నూనె అద్దుకుని వాటిని ఒత్తండి. వడల్లాగా అయిపోవాలి.

step 4: తరువాత ఒక పెనం పెట్టుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుని అంతటా రాసుకోవాలి. మీడియం మంట మీద గ్యాస్ ఉంచి ఒత్తుకున్న కట్‌లెట్ లను దూరందూరంగా పెట్టుకోవాలి.

step 5: ఒకవైపు కనీసం రెండు నిమిషాలలుంచాక మరోవైపు కొద్దిగా నూనె వేసుకుని కాల్చుకోవాలి. అవి పూర్తిగా రంగు మారి ఉడికేంత వరకు అటూ ఇటు మారుస్తూ కాల్చుకోవాలి. అంతే ఓట్స్ కట్ లెట్ సిద్దం.

తదుపరి వ్యాసం