తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Ways To Consume Protein: ఒక రోజులో శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసా!

Best Ways to Consume Protein: ఒక రోజులో శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసా!

HT Telugu Desk HT Telugu

24 July 2022, 19:10 IST

    • ప్రోటీన్ జీవక్రియను పెంచడంతో పాటు అధిక ఆకలిని తగ్గించడంలో సహాయపడుతాయి. మీ ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. అయితే ఒక రోజులో ఎంత ప్రోటీన్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Protein food
Protein food

Protein food

ప్రోటీన్ శరీరానికి కావాల్సిన అత్యంత కీలకమైన పోషకం. వివిధ జీవక్రియలు సజావుగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిద్రలేమి, సూర్యరశ్మి తగలక పోవడం, గాడ్జెట్‌ల అధిక వినియోగం వల్ల శరీరంలోని ప్రోటీన్‌ల పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రోటీన్ జీవక్రియను పెంచడంతో పాటు అధిక ఆకలిని తగ్గంచడంలో సహాయపడుతుంది. రోజువారి డైట్‌లో ప్రొటీన్లను తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. శరీరంలో ప్రొటీన్ల పరిమాణం పెరగడం వల్ల అధిక ఆకలి తగ్గుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ప్రోటీన్‌లు కండరాలు, శరీర కణజాలాల పెరుగుదల, నిర్వహణకు, మరమ్మత్తులో కూడా సహాయపడుతుంది. అయితే రోజుకి ఎంత ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

రోజుకు శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరం

రోజువారిగా ఒక వ్యక్తికి.. కిలోగ్రాము శరీర బరువుకు ఒక గ్రాము ప్రోటీన్ అవసరమవుతుంది. అయితే ఇది ఆ వ్యక్తి వ్యక్తిగత శరీర అవసరాలకు అనుగుణంగా మారవచ్చు. డైటీషియన్ల ప్రకారం, కిలోగ్రాముకు 1.5 గ్రాములు లేదా 2 గ్రాముల వరకు ఉంటుంది. గర్భం, పాలించే తల్లులకు అధిక ప్రోటీన్ కంటెంట్ అవసరం అవుతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలాల కంటే జంతు ప్రోటీన్ మూలాలు పరిమాణం నాణ్యతగా, మెరుగ్గా ఉంటాయి. మాంసం, గుడ్లు, పాలు నాణ్యమైన ప్రొటీన్‌ ఆహారంగా పరిగణించబడతుంది.

ప్రోటీన్ అధికంగా లభించే ఆహారం:

పప్పులు, బీన్స్, బఠానీలు, వేరుశెనగ, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌లు, హాజెల్‌నట్‌లు, పెకాన్‌లతో పాటు విత్తనాలను అల్పాహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటిన్స్ అందుతాయి. ప్రోటిన్స్ చర్మం మెరవడంలో కూడా సహయపడుతాయి. గుమ్మడికాయ, చియా, అవిసె, నువ్వులు, పొద్దుతిరుగుడు, వంటి విత్తనాల్లో కూడా అధికంగా ప్రోటిన్స్ ఉంటాయి. మిల్లెట్స్ కూడా ప్రోటీన్స్‌కు గొప్ప మూలం. రోజువారి డైట్‌లో ప్రొటీన్‌తో కూడిన సలాడ్‌ను తినడం వల్ల ప్రోటిన్స్‌తో పాటు శరీరానికి కావాల్సిన ఫైబర్స్ అందుతాయి. మెులకెత్తిన విత్తనాలలో కూడా ప్రొటీన్స్ ఉంటాయి. పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో కూడా ప్రోటీన్‌లో పుష్కలంగా ఉంటాయి.

తదుపరి వ్యాసం