తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall Reasons : రోజులో ఎంత జుట్టు రాలితే నార్మల్.. ఎక్కువైతే ఏం చేయాలి?

Hair Fall Reasons : రోజులో ఎంత జుట్టు రాలితే నార్మల్.. ఎక్కువైతే ఏం చేయాలి?

HT Telugu Desk HT Telugu

04 September 2023, 9:30 IST

    • Hair Fall : ప్రతిరోజూ జుట్టు రాలడం సహజం. అయితే అసహజంగా జుట్టు రాలిపోతుంటే, రోజురోజుకూ హెయిర్ ఫాల్ పెరిగిపోతుంటే సహజంగానే టెన్షన్ వస్తుంది కదా? అయితే ఎంత జుట్టు రాలితే కంగారు పడాలి.
జుట్టు రాలడం
జుట్టు రాలడం

జుట్టు రాలడం

జుట్టు రాలడం(Hair Loss) అనేది ఈ కాలంలో సాధారణమైపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీంతో కంగారపడిపోతున్నారు. సగటు వ్యక్తి తలపై 1-1.2 లక్షల వెంట్రుకలు ఉంటాయి. దాదాపు 90 శాతం జుట్టు పెరుగుదల దశలో అనాజెన్ దశ అంటారు. ఎక్సోజెన్ దశలో రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సాధారణ ప్రక్రియ.

ట్రెండింగ్ వార్తలు

Glowing Skin : మెరిసే చర్మం కావాలంటే రోజుకు రెండుసార్లు కొబ్బరి నీటిని అప్లై చేయండి

Chanakya Niti Telugu : భార్య దగ్గర చేసే ఈ 6 తప్పులు బంధాన్ని పాడు చేస్తాయి

Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024: ఎలాంటి మహిమలూ, మ్యాజిక్కులూ తెలియని సూపర్ హీరో అమ్మ, ఆమె ప్రేమే బిడ్డకు రక్ష

రోజుకి 100 వెంట్రుకలు రాలడం ఫర్వాలేదు. కానీ కొందరికి రోజుకి 100 వెంట్రుకలు రాలిపోతూ వాటి సంఖ్య పెరిగిపోతుంటే అది కచ్చితంగా మంచిది కాదు. జుట్టు రాలడం(Hair Loss) అనేది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడానికి ఒకే కారణమంటూ ఉండదు. ఒకే చికిత్స లేదు. తల దువ్వినప్పుడు విపరీతంగా జుట్టు రాలడం, తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలడం, నిద్రపోయేటప్పుడు దిండుపై ఎక్కువ వెంట్రుకలు ఉండటం లాంటివి చూడొచ్చు.

జుట్టు రాలడం రోజురోజుకూ పెరిగిపోతుంటే దానికి రకరకాల కారణాలున్నాయి. మనిషి తనను తాను ఎక్కువగా సమస్యలు, చింతలకు గురిచేసి ఒత్తిడి ఫీలవుతాడు. దీంతో జుట్టు రాలే సమస్య(Hair Fall Problem) ఎక్కువగా కనిపిస్తుంది. స్టైల్ కోసం జుట్టును హీట్ చేయడం కూడా మంచిది కాదు. బ్యూటీ పార్లర్లలోనే కాదు ఇంట్లో కూడా దీన్ని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. సాధారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కూడా జుట్టు రాలిపోవచ్చు. జుట్టును గట్టిగా కట్టుకోవడం జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. చుండ్రు, తల గోకడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. కెమికల్ హెయిర్ కలర్ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలవచ్చు. ఏదైనా ఇతర మందులు ఎక్కువ కాలం తీసుకుంటే, దాని రసాయనం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అధిక జుట్టు రాలడం అనేది జన్యుపరమైన సమస్య కూడా కావచ్చు. థైరాయిడ్(Thyroid) సమస్య జుట్టు రాలిపోయేలా చేస్తుంది.

జుట్టు రాలడం సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, అధిక జుట్టు రాలడం మంచిది కాదు. మీ చేతులతో జుట్టు పట్టుకుని లాగండి. అలాంటప్పుడు చేతిపై పదికిపైగా వెంట్రుకలు వచ్చినట్లయితే వైద్యులను సంప్రదించాలి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఒకరోజు హెయిర్ ఫాల్ ఎక్కువై, మరుసటి రోజు జుట్టు రాలడం తగ్గితే బలహీనమైన జుట్టు చేతికి వచ్చినట్లే అనుకోవచ్చు. వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం లేదు.

ముందుగా మీ ఒత్తిడితో కూడిన జీవనశైలిని మార్చుకోండి. మీ జుట్టు సంరక్షణకు కొంత సమయం కేటాయించండి. కొబ్బరి నూనె(Coconut Oil) వంటి సహజ నూనెను ఉపయోగించి తలను బాగా మసాజ్ చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి. ఫైబర్, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పండ్ల రసం, కూరగాయల సలాడ్ తినండి. ఐరన్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. మీ జుట్టును దుమ్ము, ధూళికి బహిర్గతం చేయవద్దు. వీలైనంత వరకు బయటికి వెళ్లేటప్పుడు మీ జుట్టును గుడ్డతో కప్పుకోండి. ధ్యానం, యోగా వంటి అభిరుచులు మీ ఒత్తిడికి లోనైన మనస్సును కూడా పరిష్కరించగలవు. జుట్టు రాలడం సమస్యలను కూడా నయం చేయగలవు. మీరు మీ జుట్టు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక జుట్టు రాలితే.. వైద్యుడిని సంప్రదించండి.

తదుపరి వ్యాసం