తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness Test | మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారు? ఇలా తెలుసుకోండి!

Fitness Test | మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారు? ఇలా తెలుసుకోండి!

Hari Prasad S HT Telugu

21 February 2022, 8:17 IST

    • Fitness Test.. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఓ వ్యక్తి ఫిట్‌గా ఉండటం అన్నది చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికనే అనలేదు. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే మనమేదైనా పని చేయగలుగుతాం. అయితే మనం ఎంత ఫిట్‌గా ఉన్నాం? అసలు ఫిట్‌గా ఉన్నామని మనకు మనం ఎలా తెలుసుకోవాలి?
మీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ మీరే చేసుకోండి
మీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ మీరే చేసుకోండి (Pexels)

మీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ మీరే చేసుకోండి

రోజూ ఉదయాన్నే లేస్తున్నాం. తింటున్నాం. ఆ రోజు చేయాల్సిన పనులు చేస్తున్నాం. రాత్రి పడుకుంటున్నాం. చాలా కాలంగా జబ్బులేవీ రాలేదు. అంతమాత్రాన మీరు ఫిట్‌గా ఉన్నట్లేనా? మీకు మీరు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఎలా పెట్టుకోవాలి? ఇందులో పాస్‌ మార్కులు ఎంత? అన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

హార్ట్‌ రేట్‌ చూసుకోండి..

<p>హార్ట్ రేట్ చూసుకోండి</p>

పూర్తి విశ్రాంతిగా ఉన్న సమయంలో ఒకసారి మీ హార్ట్‌ రేట్‌ చూసుకోండి. మీ చూపుడు వేలు, మధ్య వేలిని మెడ పక్కన, దవడ కింది భాగంలో లేదా చేతి మణికట్టుపై ఉంచితే మీ హార్ట్‌ రేట్‌ తెలుస్తుంది. చేతిలో స్టాప్‌ వాచ్‌ పట్టుకొని నిమిషం పాటు హార్ట్‌ రేట్‌ లెక్కించి చూడండి. విశ్రాంతిగా ఉన్న సమయంలో మీ హార్ట్‌ రేట్‌ 60 నుంచి 100 మధ్యలో ఉంటే మీరు ఫిట్‌గా ఉన్నట్లే. ఇది 100 దాటితే మీలో ఏదో సమస్య ఉన్నట్లే. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

10 నిమిషాల నడక..

ఇప్పుడు పది నిమిషాల పాటు వేగంగా నడవండి. ఆ తర్వాత మరోసారి మీ పల్స్‌ను చెక్‌ చేయండి. అది కచ్చితంగా 98 నుంచి 146 మధ్య ఉందో లేదో చూసుకోండి. ఈ రేంజ్‌లో ఉంటే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. విశ్రాంతిలో ఉన్నప్పుడు హార్ట్‌ రేట్‌తో మీ ఆరోగ్యాన్ని అంచనా వేసినట్లే.. కాసేపు నడక, వ్యాయామం తర్వాత వచ్చే పల్స్‌ రేట్‌ కూడా మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారో చెబుతుంది. ఇది 98 కంటే తక్కువున్నా, 146 కన్నా ఎక్కువున్నా.. మీరు ఫిట్‌గా లేనట్లే.

పుషప్స్‌ ఎన్ని చేయగలరు?

<p>పుషప్స్ ద్వారా కూడా ఎంత ఫిట్ గా ఉన్నారో తెలుసుకోవచ్చు</p>

ఇక మీ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో మూడోది.. పుషప్స్‌. మధ్యలో గ్యాప్‌ ఇవ్వకుండా మీరు ఎన్ని పుషప్స్‌ చేయగలరు అన్నదే ఈ టెస్ట్‌. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేసేవాళ్లు మోకాళ్లు కింద పెట్టకుండా పుషప్స్‌ చేస్తారు. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే.. మీ మోకాళ్లను భూమికి తాకేలా ఉంచి పుషప్స్‌ చేయండి. మీ కండరాల బలం, మీ ఒంట్లో శక్తిని అంచనా వేయడానికి పుషప్స్‌ మంచి ఎక్సర్‌సైజ్‌. ఈ పుషప్స్‌ సంఖ్య మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది.

మహిళలైతే..

25 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 20 పుషప్స్‌

35 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 19 పుషప్స్‌

45 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 14 పుషప్స్‌

55 ఏళ్లు ఆపైన ఉన్నవాళ్లయితే కనీసం 10 పుషప్స్‌

పురుషులైతే..

25 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 28 పుషప్స్‌

35 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 21 పుషప్స్‌

45 ఏళ్లు ఉన్నవాళ్లయితే కనీసం 16 పుషప్స్‌

55 ఏళ్లు ఆపైన ఉన్నవాళ్లయితే కనీసం 12 పుషప్స్‌

ఒకవేళ పైన చెప్పిన రేంజ్‌లో మీరు పుషప్స్‌ చేయలేకపోతే.. మీ కండరాల బలంపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చేయగలిగితే.. మీరు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లే.

సిటప్స్‌ ఎన్ని చేయగలరు?

<p>ఒక నిమిషంలో మీరు ఎన్ని సిటప్స్ చేయగలరు?</p>

పుషప్స్‌లాగే సిటప్స్‌ కూడా మీ ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తుంది. 60 సెకన్లలో ఎన్ని సిటప్స్‌ చేయగలరన్న దానిని బట్టి మీ పొట్ట భాగంలోని కండరాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పొచ్చు.

మహిళలైతే..

25 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 39 సిటప్స్‌

35 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 30 సిటప్స్‌

45 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 25 సిటప్స్‌

55 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 21 సిటప్స్‌

పురుషులైతే..

25 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 44 సిటప్స్‌

35 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 40 సిటప్స్‌

45 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 35 సిటప్స్‌

55 ఏళ్లు ఉన్నవాళ్లు అయితే 30 సిటప్స్‌

నడుము చుట్టుకొలత..

<p>నడుము చుట్టుకొలత చూసుకుంటూ ఉండండి</p>

నడుము చుట్టుకొలత మీ ఫిట్‌నెస్‌కు అసలు పరీక్ష. ఒకవేళ మీ తుంటి చుట్టుకొలత కంటే నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నదంటే మీరు అధిక బరువు ఉన్నట్లే. దీని కారణంగా గుండె జబ్బులు, టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మహిళలైతే నడుము చుట్టుకొలత 35 అంగుళాల కంటే ఎక్కువ, పురుషులైతే 40 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. మీ తుంటి ఎముకలకు కాస్త పైన దుస్తులు కొలిచే టేపుతో మీ నడుము చుట్టుకొలత కొలవచ్చు.

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ద్వారా..

ఇక బాడీ మాస్‌ ఇండెక్స్‌ లేదా బీఎంఐ ద్వారా కూడా మీ బరువు, ఒంట్లో కొవ్వు శాతం సరిగ్గా ఉందా లేదా అన్నది చూడొచ్చు. ఈ బీఎంఐని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌. ముందు మీ బరువు చూసుకోండి. తర్వాత మీ హైట్‌ను మీటర్లలో తెలుసుకొని దానిని రెట్టింపు చేయండి. ఇప్పుడు బరువును దీనితో భాగించండి. ఉదాహరణకు మీ బరువు 68 కేజీలు అనుకుందాం. మీ హైట్‌ 1.75 మీటర్లు అనుకుందాం. దీనిని రెట్టింపు చేస్తే 3.5 వస్తుంది. ఇప్పుడు బరువు (68 కేజీలు)ను ఈ 3.5తో భాగిస్తే 19.2 వస్తుంది. ఇదే బాడీ మాస్‌ ఇండెక్స్‌.

బీఎంఐ 18.5 కంటే తక్కువ వస్తే మీరు బరువు తక్కువగా ఉన్నట్లు. అదే 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే మీ బరువు సాధారణంగా ఉన్నట్లు అర్థం. అదే 25 నుంచి 29.9 మధ్య ఉంటే అధిక బరువు, 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంతో బాధపడుతున్నట్లు లెక్క.

తదుపరి వ్యాసం