తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కళ్ళు మసకగా ఉన్నాయా..? అయితే ఇలాంటి ఆహారాలను తీసుకోండి!

కళ్ళు మసకగా ఉన్నాయా..? అయితే ఇలాంటి ఆహారాలను తీసుకోండి!

HT Telugu Desk HT Telugu

30 July 2022, 20:49 IST

    • సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. అన్ని ఇంద్రియాలలో కల్లా అతి ముఖ్యమైనది కళ్ళు అంటారు. మరి అలాంటి కళ్ళ భద్రంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
dry eyes
dry eyes

dry eyes

పొడి కన్ను చాలా మందిని దీర్ఘకాలికంగా వేధించే సమస్య. కళ్ళల్లో తగినంత నీరు లేకపోవడం కారణంగా కన్నీళ్లు ఉత్పత్తి అవ్వదు. పొడి కళ్ళల్లో ఉండే ముఖ్య లక్షణాలలో చికాకు, మంట, ఉండటం, ఎక్కువ సమయం పాటు స్క్రీన్‌ని చూడటం కష్టంగా ఉంటుంది. నేత్ర వైద్య నిపుణుల ప్రకారం, కళ్ళు ఆరోగ్యంగా ఉండేలంటే తగినంత పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు వివిధ వ్యాదులను అరికట్టాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

చేపలు

పొడి కళ్లు తగ్గాలంటే చేపలు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది కంటిలో, ముఖ్యంగా కన్నీటి నాళాలలో మంటను తగ్గిస్తుంది. సాల్మన్, హాలిబట్, హెర్రింగ్, ట్యూనా మొదలైనవి అత్యధిక పోషకాలు చేపలో ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కోసం గుల్లలు వంటి మొలస్క్‌లను కూడా ఎంచుకోవచ్చు

ఆకు కూరాలు

ఆకు కూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి తోడ్పడే పోషకం. విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్, ఇది వృద్ధాప్యం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంటి సంబంధిత సమస్యలు, దృష్టి నష్టాన్ని నివారించే ఫోలేట్ కూడా ఇందులో ఉంటుంది. ఉత్తమ విటమిన్ సి, ఫోలేట్ అధికంగా ఉండే కూరగాయలు కాలే, కొల్లార్డ్స్, బచ్చలికూర.

గుమ్మడికాయ గింజలు

చియా గింజలు, ఫ్లాక్స్ సీడ్ వంటి విత్తనాలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల కలిగి ఉండే మంచి మూలకాలు. చేప నూనె, ఇతర చేపల ఆధారిత ఒమేగా-3 సప్లిమెంట్లకు ప్రత్యామ్నాయంగా తరచుగా ఉపయోగించవచ్చు. శాకాహారులకు, చేపలకు గొప్ప ప్రత్యామ్నాయం. ఆరోగ్యకరమైన కళ్ళు, మెరుగైన ఆరోగ్యం కోసం, మీరు మీ ఆహారంలో తగినంత ప్రోటీన్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండాలి.

బీన్స్

బీన్స్ అనేక ముఖ్యమైన పోషకాలను ఉంటాయి. చక్కటి ఆరోగ్యం వీటిని తినండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లలో పుష్కలంగా ఉంటాయి . ఇవి మాంసానికి గొప్ప ప్రత్యామ్నాయంగా ఉంటాయి. బీన్స్‌లో ఫోలేట్, జింక్ ఉంటాయి, ఇది మెలనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. మెలనిన్ కళ్ళను దెబ్బతినకుండా కాపాడుతుంది.

నీరు

మన కంటిని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. పేలవమైన హైడ్రేషన్ కళ్ళు పొడిబారడానికి కారణం కావచ్చు. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల ఆరోగ్యకరమైన కన్నీళ్లను ఉత్పత్తి అవుతాయి, ఇది కళ్ళు పొడిబారకుండా నిరోధిస్తాయి హైడ్రేటెడ్‌గా ఉండటం మీ ఆరోగ్యానికి కూడా మంచిది, కాబట్టి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగాలి!

తదుపరి వ్యాసం