తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indigestion- Remedies। ఏది తిన్నా సరిగ్గా జీర్ణం అవడం లేదా? ఈ చిట్కాలు ప్రయత్నించండి!

Indigestion- Remedies। ఏది తిన్నా సరిగ్గా జీర్ణం అవడం లేదా? ఈ చిట్కాలు ప్రయత్నించండి!

HT Telugu Desk HT Telugu

03 August 2023, 15:55 IST

    • Home Remedies for Indigestion: తిన్న తర్వాత కడుపులో గడబిడగా, అసౌకర్యంగా ఉంటుందా? ఇక్కడ కొన్ని నివారణ మార్గాలను చూడండి.
Home Remedies for Indigestion
Home Remedies for Indigestion (istock)

Home Remedies for Indigestion

Home Remedies for Indigestion: కడుపులో గడబిడగా, అసౌకర్యంగా ఉంటుందా? ఇందుకు కారణం మీ ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. చాలా మందికి తిన్న తర్వాత జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ఈ జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా లేకపోవడం కూడా జీర్ణక్రియ సరిగా జరగకపోవడానికి కారణం అవుతుంది. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో మంట మొదలైన సమస్యలు ఉంటాయి. మీకు గ్యాస్ సమస్య చాలా ఎక్కువగా ఉంటే ఇక్కడ ఒక చిట్కాను తెలియజేస్తున్నాము. ఇది అల్లంతో చేసే ఒక సులభమైన పానీయం. ప్రతిరోజూ ఈ పానీయం తాగడం మీ గ్యాస్ సమస్య తీరుతుంది, మీ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో ఈ పానీయం తాగుతున్నప్పుడు వేయించిన ఆహారం లేదా మసాలా ఆహారాన్ని తినకుండా ఉండటం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన పానీయం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

Ginger Lemon Drink - రెసిపీ కార్డ్

  • 1 అంగుళం ముక్క అల్లం
  • 1/4 నిమ్మకాయ ముక్క
  • 1 స్పూన్ ఫెన్నెల్
  • 1 ఏలకు

ఎలా తయారు చేయాలి?

ఒక గ్లాసు నీటిలో సోపు, నిమ్మకాయ ముక్క, ఏలకులు, అల్లం వేయండి. ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఆపై చల్లబరిచి గోరు వెచ్చగా తాగాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

ప్రయోజనాలు

ఈ ప్రత్యేక పానీయంలోని అల్లం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మరోవైపు, ఫెన్నెల్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆమ్ల ప్రభావం ఆహారంలో ఉన్న నూనెను, కొవ్వును జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం సమస్య దరిచేరదు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

భోజనం తర్వాత- అజీర్తికి చూర్ణం.. రెసిపీ

భోజనం తర్వాత ఆహారం జీర్ణం కావడానికి మీకు మీరుగా చూర్ణం తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.

పొయి మీద పాన్ వేడి చేసి, అది వేడయ్యాక 4-5 నల్ల యాలకులు, రెండు చెంచాల వాము, రెండు మూడు యాలకులు వేసి దోరగా వేయించాలి. అనంతరం వీటిని పక్కనపెట్టుకోండి.

ఇప్పుడు అదే పాన్‌లో అర చెంచా నెయ్యి వేడి చేసి అందులో రెండు చెంచాల మెంతులను వేసి వేయించాలి.

ఇప్పుడు అన్నింటిని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి, ఇందులోనే ఇంగువ, రుచికోసం కొంచెం ఉప్పు వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి.

మీ అజీర్తికి సహాయపడే చూర్ణం రెడీ. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఈ చూర్ణంను గాజు సీసాలోకి నిల్వచేసుకోవాలి.

ఈ అజీర్తి చూర్ణంను అర చెంచా మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో లేదా పాలలో కలుపుకొని భోజనం తర్వాత సేవించాలి. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

తదుపరి వ్యాసం