తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పెయిన్ కిల్లర్స్ వద్దు.. ఒళ్ళు నొప్పులు బాధిస్తే ఈ చిట్కాలు పాటించి చూడండి!

పెయిన్ కిల్లర్స్ వద్దు.. ఒళ్ళు నొప్పులు బాధిస్తే ఈ చిట్కాలు పాటించి చూడండి!

22 December 2021, 15:20 IST

    • ఒళ్లు నొప్పులు బాధిస్తున్నప్పుడు సాధారణంగా చాలా మంది పెయిన్ రిలీఫ్ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. మరికొంత మంది నొప్పులను భరించలేని వారు కౌంటర్ మెడిసిన్, పెయిన్ కిల్లర్ డ్రగ్స్ వాడతారు. అయితే ఇలా ఒళ్ళు నొప్పులు బాధించిన ప్రతీసారి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం మంచిది కాదు.
ఒళ్ళు నొప్పులు
ఒళ్ళు నొప్పులు

ఒళ్ళు నొప్పులు

చాలా మందిని వేధించే ఒక సమస్య ఒళ్ళు నొప్పులు (Body Pains). ముఖ్యంగా చలి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవు.  ఒళ్లు నొప్పులు బాధిస్తున్నప్పుడు సాధారణంగా చాలా మంది పెయిన్ రిలీఫ్ మందులతో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. మరికొంత మంది నొప్పులను భరించలేని వారు కౌంటర్ మెడిసిన్, పెయిన్ కిల్లర్ డ్రగ్స్ వాడతారు. అయితే ఒళ్ళు నొప్పులు బాధించిన ప్రతీసారి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం మంచిది కాదు. వాటివల్ల సైడ్ అఫెక్ట్స్ ఉంటాయి, అవి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Optical Illusion: కేవలం డిటెక్టివ్‌లు మాత్రమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కుని ఉన్న టై ను కనిపెట్టగలరు, ప్రయత్నించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

శరీర నొప్పుల నుండి తాత్కలిక ఉపశమనం పొందడం కన్నా వాటిని శాశ్వతంగా వదిలించుకునే విషయంపై దృష్టి పెట్టాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంటి చిట్కాలతోనే ఒళ్లు నొప్పులను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి నొప్పులకైనా హోం రెమెడీస్ చాలా అద్భుతంగా పని చేస్తాయి. కింద కొన్ని చిట్కాలను అందించాం, బాడీ పెయిన్స్ ఇబ్బంది పెట్టినపుడు ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి.

1. అల్లంతో అద్భుతాలు

అనేక అద్భుతమైన ఔషధ గుణాలను కలిగిన అల్లం తీసుకోవడం వల్ల శరీర నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అల్లం యాంటీ ఇన్‌ప్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  నొప్పి నుండి ఉపశమనం పొందడానికి అల్లంను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.  కొన్ని పచ్చి అల్లం ముక్కలను రోకలిలో రుబ్బి లేదా దంచి, ఆ మిశ్రమాన్ని ఒక గుడ్డలో కట్టాలి. ఆ గుడ్డను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచండి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న భాగంలో పట్టించాలి. ఒళ్ళు నొప్పులకు ఇది చాలా ప్రభావవంతమైన ఇంటి చిట్కా.

2. పసుపుతో ఉపశమనం

పసుపులో కూడా అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీర నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు పసుపును చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. పసుపును పాలలో కలుపుకుని తాగవచ్చు లేదా నొప్పి ఉన్న భాగంలో పసుపు పేస్టును రాసి ఉపశమనం పొందవచ్చు. 

పసుపు పేస్ట్‌ కోసం పసుపు పొడి, ఉప్పు, నిమ్మరసం సమాన మొత్తంలో కలిపి పేస్ట్‌ లాగా తయారు చేసుకోవాలి. దానిని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి.

3. దాల్చిన చెక్క ఉపయోగించండి

దాల్చిన చెక్క ఒక ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఒళ్లు నొప్పులే కాక మరెన్నో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయకారిగా ఉంటుంది. దాల్చినచెక్కలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగా ఇది ఆర్థరైటిస్, బాడీ పెయిన్, కీళ్ల నొప్పులకు, వాటి దృఢత్వానికి సహజ నివారణగా ఉంటుంది. మీరు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ దాల్చిన చెక్క, తేనె కలపి ఆ మిశ్రమాన్ని తింటూ ఉండండి, ఫలితం మీకే తెలుస్తుంది.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ 

ఆపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  మీరు చలికాలంలో బాడీ పెయిన్‌తో బాధపడుతుంటే ఖచ్చితంగా ఆపిల్ సైడర్ వెనిగర్ వాడండి. దీని కోసం సగం బకెట్ నీటిని వేడి చేసి,  అందులో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి.  ఇప్పుడు ఈ నీటిలో ఒక గుడ్డను ముంచి, ఆ గుడ్డతో మీ శరీరమంతా తడపాలి.  ఇది మిమ్మల్ని బాడీ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం