తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Thandai Recipe : హోలీ స్పెషల్.. తండాయి తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా

Holi Thandai Recipe : హోలీ స్పెషల్.. తండాయి తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా

Anand Sai HT Telugu

24 March 2024, 14:30 IST

    • Thandai Recipe : హోలీ పండుగలో తండాయి అత్యంత ముఖ్యమైన పానీయం. హోలీ పండుగ సమయంలో ఈ పానీయం తాగడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పానీయం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చాలా మంచి రుచి.
తండాయి రెసిపీ
తండాయి రెసిపీ (Unsplash)

తండాయి రెసిపీ

హోలీ పండుగ భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ సమయంలో కొన్ని చోట్ల వివిధ రకాల ఆచారాలు ఉంటాయి. అయితే హోలీ సమయంలో తండాయి చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. హోలీకి ముందు తండాయి పానీయం తయారుచేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ డ్రింక్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. హోలీ రోజున దీన్ని ఆస్వాదించండి. తండాయి ఎలా చేయాలో తెలుసుకుందాం..

ఒకటిన్నర లీటర్ల పాలు, 20-25 బాదం పప్పులు, 10-15 జీడిపప్పులు, 10-15 పిస్తాపప్పులు, ఒకటిన్నర చెంచా గసగసాలు, ఒకటిన్నర చెంచా సోంపు, యాలకులు 10, 8-10 మిరియాలు, గులాబీ రేకులు కొన్ని, చక్కెర 6 చెంచాలు (తియ్యగా కావాలంటే మరిన్ని జోడించవచ్చు), చిటికెడు కుంకుమపువ్వు, ఐస్ క్యూబ్స్

ఒక గిన్నెలో బాదం, జీడిపప్పు, పిస్తా వేసి నీళ్లు పోసి కనీసం బాగా నానబెట్టాలి. గసగసాలను విడిగా నానబెట్టండి. ఇప్పుడు బాదంపప్పు తొక్క తీసి, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాలను బ్లెండర్‌లో వేయాలి. గసగసాల నీళ్లను వడకట్టి, బ్లెండర్‌లో గసగసాలు వేసి, ఆపై సోంపు, యాలకులు, లవంగాలు, గులాబీ రేకులు, కుంకుమపువ్వు వేసి బ్లెండ్ చేయాలి.

కొంచెం పాలు వేసి బాగా కలపాలి. తర్వాత ఒకటిన్నర లీటరు పాలను మరిగించాలి. దానికి పంచదార వేసి, తర్వాత పేస్టును వేయాలి. తీపికి తగినట్లుగా పంచదార కలపండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పాలను చల్లారనివ్వాలి. తర్వాత 4 గంటలపాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇప్పుడు గ్లాసులో ఒక చెంచా గుల్కంద వేసి, తయారు చేసిన తండాయి వేసి కలపాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, డ్రై రోజ్ రేకులు వేసి సర్వ్ చేయాలి.

మీరు దీన్ని చేసేటప్పుడు పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా జోడించవచ్చు. మీరు హోలీకి ముందు రోజు దీన్ని తయారు చేయాలి. గాలి చొరబడని బాటిల్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ పానీయం హోలీ పండుగ స్ఫూర్తిని పెంచే పానీయం. ఈ పానీయం చాలా రుచికరమైనది. కొంత మంది ఇందులో గంజాయి లాంటి పదార్థాలను కలుపుతారు. ఇది చాలా చెడ్డ పద్ధతి. ఈ డ్రింక్ బయట తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. ఇంట్లో ఈ డ్రింక్ తయారు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హోలీ పండుగ సమయంలో దీని గురించి జాగ్రత్తగా ఉండండి.

ఈ పానీయం పురాతన కాలం నుండి హోలీ రోజున తయారు చేస్తూ వస్తున్నారు. దానిని సంప్రదాయంగా సేవిస్తారు. గర్భిణులు, పిల్లలు తప్ప అందరూ దీన్ని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది హోలీ పండుగ వేడుకల్లో ఎంజాయ్ చేసేందుకు శక్తిని నింపుతుంది. అజీర్తి సమస్య ఉండదు. హోలీ రోజున వివిధ రకాల స్నాక్స్ తింటారు, కానీ దీనిని తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. వేసవి చల్లగా ఉంటుంది. ఈ పానీయం శరీరాన్ని వేడి నుండి నిరోధించడంలో చాలా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

హోలీ పండుగ వచ్చేది వేసవి సమయంలో కాబట్టి.. వివిధ రకాల సమస్యలు శరీరంలో ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు తండాయి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి ఇలాంటి పానీయం తీసుకుంటున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. శరీరానికి మెడిసిన్‌లో పని చేస్తుంది. అయితే అతిగా మాత్రం తాగకూడదు. మితంగానే తీసుకోవాలి. గర్భిణులు, పిల్లలు దీనిని తాగకపోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం