తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweet Paan Benefits : అబ్బా.. స్వీట్ పాన్ తింటే ఈ ప్రయోజనాలు ఉన్నాయా?

Sweet Paan Benefits : అబ్బా.. స్వీట్ పాన్ తింటే ఈ ప్రయోజనాలు ఉన్నాయా?

Anand Sai HT Telugu

13 August 2023, 11:52 IST

    • Meetha Paan : పూర్వం నుండి భోజనం తర్వాత తమలపాకు పెట్టే ఆచారం ఉంది. తిన్న ఆహారం బాగా జీర్ణమవాలని మన పెద్దలు తమలపాకులు తినేవారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెబుతారు. అయితే స్విట్ పాన్ తింటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
స్వీట్ పాన్
స్వీట్ పాన్ (unsplash)

స్వీట్ పాన్

పాన్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో స్వీట్ పాన్(Sweet Paan), స్పైసీ పాన్, కొన్ని ప్రదేశాలలో సంబంధిత పట్టణం పేరు ఆధారంగా కూడా పాన్ చాలా ప్రసిద్ధి చెందాయి. తమలపాకులు, కాయలతో పాటు సున్నం, పొగాకు తినడం చాలా మందికి అలవాటు. కానీ పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదు. సున్నం కూడా తినొద్దని చెబుతారు. సున్నం, పొగాకు లేకుండా స్వీట్ పాన్ తినవచ్చు. మరి ఈ పాన్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

భోజనం తర్వాత పాన్ తినడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఉబ్బిన కడుపు, తీవ్రమైన మలబద్ధకం(Constipation) సమస్యలు ఉన్నవారు కూడా ఈ పాన్ తినవచ్చు. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది.

తమలపాకుల్లో రిబోఫ్లావిన్, కాల్షియం, విటమిన్ సి(Vitamin C), కెరోటిన్‌లు పుష్కలంగా ఉంటాయి. స్టిల్ రోజ్ రేకులు, లవంగాలు, వాల్‌నట్‌ పాన్‌లో కూడా వివిధ పోషకాలు ఉంటాయి. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకు జీర్ణక్రియకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. మీకు కడుపు నొప్పి వంటి అనేక సమస్యలు ఉంటే, భోజనం తర్వాత పాన్ తినడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా పాన్ తింటే.. లాలాజల రసం ఏర్పడటానికి కారణమవుతుంది.

తలనొప్పిగా(Headche) ఉన్నప్పుడు తమలపాకులను నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే పాన్ తినేటప్పుడు, గులాబీ రేకులు, తురిమిన కొబ్బరి కూడా కూలింగ్ ఏజెంట్‌గా పని చేస్తాయి. మీ తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

స్వీట్ పాన్‌లో గుల్కాన్ కంటెంట్ ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు తక్కువ గుల్కాన్ ఉన్న పాన్ తినడం మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సాధారణంగా స్వీట్లు తినాలనే కోరిక ఉంటుంది. బదులుగా పాన్ తినడం ద్వారా మీరు తీపి తినాలేనే మీ కోరికలను తీర్చుకోవచ్చు. ఒక్కోసారి పాన్ తింటే ఏమీ జరగదు. కానీ ఎక్కువగా తినొద్దు.

శరీరంలో కొవ్వు(Cholesterol) తగ్గడం అనేది చాలా మందికి ఒక సవాలు. తమలపాకులతోనే పాన్ చేస్తారు కాబట్టి.. వాటి రసాయన కూర్పు కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే పాన్ తినడం వల్ల మన జీవక్రియ మెరుగుపడుతుంది. కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

పాన్ తినడం మన నోటి ఆరోగ్యానికి(Mouth Health) చాలా మంచిది. తమలపాకుల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటి పరిశుభ్రతను కాపాడతాయి. మీరు నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలనుకుంటే పాన్‌లో గుల్కాన్, కొబ్బరి పొడి మొత్తాన్ని తగ్గించండి.

గమనిక : పాన్ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఎప్పుడో ఒకసారి పాన్ తింటే ఎలాంటి హాని ఉండదు. అదే పనిగా ఎక్కువగా కూడా తినొద్దు.

తదుపరి వ్యాసం