తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast: మక్కపిండితో ఉప్మా.. ఆరోగ్యకరమైన అల్పాహారం

breakfast: మక్కపిండితో ఉప్మా.. ఆరోగ్యకరమైన అల్పాహారం

HT Telugu Desk HT Telugu

15 May 2023, 6:30 IST

  • breakfast: మక్కపిండితో ఉప్మా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. 

మక్కపిండి ఉప్మా
మక్కపిండి ఉప్మా

మక్కపిండి ఉప్మా

చాలా రకాల ఉప్మాలు ప్రయత్నించి ఉంటారు. కానీ ఒకసారి మక్క పిండితో ఉప్మా తయారు చేసి చూడండి. మక్క పిండి అంటే కార్న్ ఫ్లోర్ కాదు. ఎండు మక్కల్ని పిండిగా పట్టించి చేసుకోవాలి. లేదంటే మంచి రుచి ఉండదు. మీరే సొంతంగా పట్టించిన మక్కపిండిలో ఎలాంటి కల్తీ లేకుండా పోషకాలుంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు మక్క పిండి

సగం కప్పు నీళ్లు

4 వెల్లుల్లి తరుగు

1 టీస్పూన్ ఆవాలు

1 టీస్పూన్ జీలకర్ర

1 ఉల్లిపాయ తరుగు

3 ఎండుమిర్చి

1 రెబ్బ కరివేపాకు

కొద్దిగా కొత్తిమీర

2 టేబుల్ స్పూన్ల నూనె

సగం స్పూన్ ధనియాల పొడి

తగినంత ఉప్పు

తయారీ విధానం:

  1. ముందుగా కడాయిలో నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కాసేపయ్యాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి.
  2. అవి వేగాక ఉప్పు, ధనియాల పొడి వేసుకోండి. దీంట్లో సగం కప్పు నీళ్లు పోసుకోండి.
  3. నీళ్లు మరుగుతున్నప్పుడు దాంట్లో కొద్ది కొద్దగా మక్కపిండి కూడా వేసుకుంటూ కలుపుకోవాలి.
  4. గట్టిగా ముద్దలా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంటమీద 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే.. మక్కపిండి ఉప్మా సిద్దం.

తదుపరి వ్యాసం