తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anti Inflammatory Drink | కడుపు ఉబ్బరాన్ని తగ్గించి.. నిత్య యవ్వనంగా ఉంచుతుంది

Anti Inflammatory Drink | కడుపు ఉబ్బరాన్ని తగ్గించి.. నిత్య యవ్వనంగా ఉంచుతుంది

17 March 2022, 9:04 IST

    • తినే ఆహారం వల్ల కానీ.. ఆరోగ్యపు అలవాట్ల వల్ల కానీ.. కొందరికి ఉదయం లేచాక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ కడుపు ఉబ్బరంతో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చేయడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీనిని తగ్గించుకునేందుకు పరిష్కారం మన ఇంటి గదిలోనే ఉందండోయ్.. ఒక్క నిమిషంలో దీనిని రెడీ చేసుకుని కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి దాని తయారీ గురించి తెలుసుకుందామా?
కడుపు ఉబ్బరాన్ని తగ్గించే డ్రింక్
కడుపు ఉబ్బరాన్ని తగ్గించే డ్రింక్

కడుపు ఉబ్బరాన్ని తగ్గించే డ్రింక్

Healthy Papaya Drink | కడుపు ఉబ్బరంతో ఏ పనిపైనా ఏకాగ్రత పెట్టలేము. దీనిని ఇట్టే తగ్గించుకునేందుకు మా దగ్గర ఓ ఉపాయం ఉంది. ఇది చిటికలో మీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఏ కషాయమో చెప్తాము అనుకుంటున్నారేమో.. కాదండోయ్.. రుచికరమైన హెల్తీ డ్రింక్​నే మీ ముందుకు తీసుకువచ్చాము. దీనిని తయారు చేసుకోవడానికి పెద్ద సమయం కూడా పట్టదు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఈ డ్రింక్ మొత్తం పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్​తో నిండి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అంతే కాదండోయ్ దీనిని తాగడం వల్ల మీరు యవ్వనంగా కూడా కనిపిస్తారు. బరువును అదుపులో ఉంచేందుకు కూడా ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. కావాల్సిన పదార్థాలు ఉంటే ఒక్క నిమిషంలో మీరు దీనిని తయారుచేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

* బొప్పాయి- 50 గ్రాములు (తొక్క తీసి.. ముక్కలు కోసి పెట్టుకోవాలి)

* నీళ్లు- 1 కప్పు

* మిరియాలు- 4 లేదా 5

* పసుపు- చిటికెడు

* ఉప్పు- తగినంత

* జీలకర్రపొడి- కొద్దిగా

* చియా సీడ్స్- కొన్ని

తయారీ విధానం

మిక్సిలో బొప్పాయి, నీళ్లు, పసుపు, మిరియాలు వేసి గ్రైండ్ చేయాలి. ఒక గ్లాసులో ఉప్పు, జీలకర్రపొడి వేసి.. దానిలో బొప్పాయి మిశ్రమాన్ని వేయాలి. పైన చియా సీడ్స్ వేసుకుంటే చాలు. అంతే సింపుల్ హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయినట్టే.

కానీ ఈ డ్రింక్​ను కొందరు తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. గర్భిణీలు, అలెర్జీలు ఉన్నవారు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, హైపోగ్లైకోమా ఉన్నవారు, హృదయ సమస్యలు ఉన్నవారు ఈ డ్రింక్​ను తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు. మిగిలిన వారు హ్యాపీగా ఈ డ్రింక్​ను తమ డైట్​లో కలిపి తీసుకోవచ్చు.

తదుపరి వ్యాసం