తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rainbow Diet। రంగురంగుల ఆహారాలు తింటే.. ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం!

Rainbow Diet। రంగురంగుల ఆహారాలు తింటే.. ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం!

HT Telugu Desk HT Telugu

11 August 2023, 8:48 IST

    • Rainbow Diet: మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రెయిన్‌బో డైట్ పాటించడం చాలా అవసరం. వివిధ రంగుల శాకాహార ఆహారాలు మెదడు పనితీరును, మానసిక స్థితి నియంత్రణకు తోడ్పడే ఫైటోకెమికల్‌లను కలిగి ఉంటాయి
Rainbow Diet
Rainbow Diet (istock)

Rainbow Diet

Rainbow Diet: మనకు శక్తి కావాలంటే ఆహారం అవసరం, మనకు ఆరోగ్యం కూడా కావాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. మనం తినే ఆహారం వివిధ రకాల పోషకాలతో సమతుల్యంగా ఉన్నప్పుడే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతాం. పోషకాహార నిపుణుల ప్రకారం, మనం తినే ఆహారంలో అన్ని రకాల రంగులు ఉండాలి. రెయిన్‌బో డైట్‌ను అనుసరించాలని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటాయని మనకు తెలుసు. అలాగే రెయిన్‌బో డైట్ అంటే ఎరుపు, పసుపు, ఊదా, ఆకుపచ్చ, నారింజ వంటి వివిధ రంగుల్లో పండ్లు, కూరగాయలను కలిగి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

ఈ డైట్ ప్రధాన ఉద్దేశ్యం మీరు తినే ఆహారంలో పిండి పదార్థాలు, గ్లూటెన్, కొవ్వు లేదా మాంసాన్ని తగ్గించడం. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు మీ సిస్టమ్‌పై భారం మోపుతాయి, మీకు అనేక అనారోగ్యాలను కలిగిస్తాయి. కానీ, ఈ రెయిన్‌బో డైట్‌లో నిర్దిష్ట సూక్ష్మపోషకాలతో కూడిన పండ్లు, కూరగాయలు ఉండటం మూలానా ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ అణువులను అందిస్తాయి. ఈ ఆహారంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. తద్వారా ఇది మానసిక శ్రేయస్సుతో సహా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ చెఫ్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ఉమ మాట్లాడుతూ.. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం రెయిన్‌బో డైట్ పాటించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. వివిధ రంగుల శాకాహార ఆహారాలు మెదడు పనితీరును, మానసిక స్థితి నియంత్రణకు తోడ్పడే ఫైటోకెమికల్‌లను కలిగి ఉంటాయి. వీటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆమె చెప్పారు. ఈ మేరకు, రెయిన్‌బో డైట్ ప్రకారం ఎలాంటి ఆహారాలు తినాలో డాక్టర్ ఉమ సూచించారు. అవి ఇక్కడ తెలుసుకుందాం.

1. వివిధ రంగుల కూరగాయలు, పండ్లు

ఎల్లప్పుడూ వివిధ రంగుల కూరగాయలు, పండ్లు తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఈ ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి, అభిజ్ఞా పనితీరును పెంచుతాయి.

2. ఆకు కూరలు

ఆకుపచ్చని ఆకుకూరల్లో ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటుంది, ఈ పోషకం న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి, మానసిక స్థితి స్థిరత్వానికి ముఖ్యమైనది:

3. బెర్రీలు

వివిధ రకాల బెర్రీ పండ్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మానసిక ఆందోళనలను తగ్గించి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి.

4. ఆరెంజ్, పసుపు ఆహారాలు

చిలగడదుంపలు, క్యారెట్లు, వివిధ రంగుల క్యాప్సికమ్ మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవాలి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ సి ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి, రోగనిరోధక పనితీరుకు ఉపయోగపడతాయి.

5. పర్పుల్ ఆహారాలు

ద్రాక్ష, బ్లాక్‌బెర్రీలు, రేగు పండ్లు వంటి ఊదారంగు గల పండ్లను తినండి. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్న ఆంథోసైనిన్‌లను కలిగి ఉంటాయి.

6. తృణధాన్యాలు

క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ వంటి రంగురంగుల తృణధాన్యాలను ఎంచుకోండి. ఈ ధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి. మెరుగైన మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరుకి సహాయపడతాయి.

7. గింజలు, విత్తనాలు

బాదం, వాల్‌నట్‌లు, సబ్జా గింజలు, అవిసె గింజలు వంటి వివిధ రకాల గింజలు, విత్తనాలను అల్పాహారంగా తీసుకోండి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందిస్తాయి.

8. లీన్ ప్రోటీన్లు

చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు , టోఫు వంటి లీన్ ప్రోటీన్ మూలాలను ఎంచుకోండి. ఈ ఆహారాలు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి.

9. మూలికలు, సుగంధ ద్రవ్యాలు

పసుపు, అల్లం , రోజ్మేరీ వంటి మూలికలు, సుగంధాలను ఆహారంలో చేర్చండి. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ, అభిజ్ఞా పనితీరును పెంచే లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

తదుపరి వ్యాసం