తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Wishes 2023 : మీ బంధు, మిత్రులకు ఇలా న్యూ ఇయర్ విషెష్ చెప్పేయండి

New Year Wishes 2023 : మీ బంధు, మిత్రులకు ఇలా న్యూ ఇయర్ విషెష్ చెప్పేయండి

30 December 2022, 16:01 IST

    • Happy New Year 2023 Wishes : 2022 సంవత్సరం దాదాపు ముగిసిపోయింది. మరో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. జనవరి 1, 2023ని నూతన ఉత్తేజంతో ప్రారంభించడానికి ఇప్పటికే మీరు సిద్ధమై ఉంటారు. అయితే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ విషెష్ చెప్పడానికి ఇక్కడ కొన్ని సందేశాలు ఉన్నాయి. 
న్యూ ఇయర్ విషెష్
న్యూ ఇయర్ విషెష్

న్యూ ఇయర్ విషెష్

New Year Wishes 2023 : 2022కు బాయ్ చెప్తూ.. 2023ను ఆహ్వానించేందుకు ఇప్పటికే అందరూ సిద్ధమైపోయారు. పార్టీలు, విహారయాత్రలను ప్లాన్ చేసుకునే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో మీ సన్నిహితులు, బంధువులు, స్నేహితులు హాజరు కాలేకపోవచ్చు. అలాంటి వారికి సోషల్ మీడియా వేదికగా మీరు న్యూ ఇయర్ విషెష్ చెప్పండి. మీరు ప్రేమించేవారికి.. మీ సన్నిహితులకు మీ ప్రేమ, ఆశిస్సులను ఈ సందేశాల రూపంలో పంపండి.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

* ఈ కొత్త సంవత్సరం మనలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాము. భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* కొత్త సంవత్సరం పుస్తకంలోని తాజా పేజీ లాంటిది. కాబట్టి నా మిత్రమా కలం తీసుకో.. మీ కోసం ఒక అద్భుతమైన కథను, గోల్ సెట్ చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!

* గత బాధలను మరచి ఆనందంతో, సంతోషంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. విష్ యు ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్!

* ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆశలు, విజయం, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!

* నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆనందం, విజయం, శ్రేయస్సుతో అందిస్తాడు.

* కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం, ఆరోగ్యం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* మీరు మీ గతంలోని బాధలు, కష్టాలను మీ వెనుకే ఉంచి.. ఆనందం, ఆశావాద దృక్పథంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

* ఈ కొత్త సంవత్సరంలో మీరు ప్రార్థించినవన్నీ మీకు నెరవేరాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు.

* మీరు ఏడాది పొడవునా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023!

* ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆనందం, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలు, అనేక కొత్త స్ఫూర్తిని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ సంవత్సరం పూర్తిగా ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.

* పాతదానికి వీడ్కోలు పలకండి. కొత్త ఆశలు, కలలు, ఆశయంతో ముందుకు సాగండి. మీకు సంతోషం నిండిన నూతన సంవత్సర శుభాకాంక్షలు!

టాపిక్

తదుపరి వ్యాసం