తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall After Pregnancy : డెలివరీ తర్వాత జుట్టు రాలుతుందా? ఇదిగో చిట్కాలు

Hair Fall After Pregnancy : డెలివరీ తర్వాత జుట్టు రాలుతుందా? ఇదిగో చిట్కాలు

HT Telugu Desk HT Telugu

01 October 2023, 16:40 IST

    • Hair Fall After Delivery : ఈ కాలంలో జుట్టు సమస్యలు చాలా సాధారణం. అయితే జుట్టు రాలడం ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మహిళలు డెలివరీ తర్వాత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. మీకోసం కొన్ని చిట్కాలు..
జుట్టు రాలడం
జుట్టు రాలడం (unsplash)

జుట్టు రాలడం

డెలివరీ తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అనేక మానసిక, శారీరక ఇబ్బందుల్లో జుట్టు రాలే సమస్య(Hair fall) ఒకటి. డెలివరీ అయిన మహిళ.. ఒక రోజులో దాదాపు 400 వెంట్రుకలు కోల్పోతుందని అంచనా. అయితే సాధారణ మహిళలో ఈ సంఖ్య 80-100 ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రమే కొన్ని రోజుల వరకూ ఈ జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక హార్మోన్ల కారణం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

గర్భం ప్రారంభంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలలో నిరంతర పెరుగుదల కారణంగా జుట్టు పెరుగుదల(Hair Growth) ప్రక్రియ కొనసాగుతుంది. దీని వల్ల స్త్రీల జుట్టు మునుపటి కంటే మందంగా, మెరుస్తూ ఉంటుంది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతుంది. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అయితే క్రమంగా ఈ సమస్య కూడా నయమవుతుంది. మీరు కొన్ని ఆయుర్వేద నివారణలతో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

హెర్బల్ ఉత్పత్తులు జుట్టుకు మంచి పోషణనిస్తాయి. దీని ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. హెర్బల్ హెయిర్ మాస్క్ జుట్టుకు మేలు చేస్తుంది. ఉసిరి, శీకాకాయ, మెంతి(Fenugreek) వంటి మూలికలను ఇందులో కలపడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

బిడ్డ పుట్టిన తర్వాత మహిళల్లో జుట్టు రాలే సమస్య కొన్ని రోజుల తర్వాత నయమవుతుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. డెలివరీ తర్వాత మహిళలు సాధారణ రికవరీలో పౌష్టికాహారం సహాయపడుతుంది. పెరిగిన జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

మీ ఆహారం అసమతుల్యతతో ఉంటే సప్లిమెంట్లు ఉపయోగకరంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తుందని నిరూపించలేదు, కానీ మొత్తం ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలు ఇస్తున్నట్లయితే, మీ ప్రినేటల్ విటమిన్‌లను కొనసాగించాలని సిఫార్సు చేస్తారు వైద్యులు.

డెలివరీ తర్వాత మహిళలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. అధిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటి విభిన్న విశ్రాంతి కార్యకలాపాలను ప్రయత్నించండి. తక్కువ ఒత్తిడిని అనుభవించడం మీకు జుట్టు రాలకుండా చేస్తుంది. తరచుగా వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించండి.

తదుపరి వ్యాసం