తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Coffee : కూరగాయలతో గ్రీన్ కాఫీ.. ఎలా తయారుచేయాలి? ప్రయోజనాలు ఏంటి?

Green Coffee : కూరగాయలతో గ్రీన్ కాఫీ.. ఎలా తయారుచేయాలి? ప్రయోజనాలు ఏంటి?

Anand Sai HT Telugu

07 October 2023, 5:00 IST

    • Broccoli Coffee Making : ఒక కప్పు కాఫీ తాగితే చాలు చాలా మందికి మనసు హాయిగా ఉంటుంది. కాఫీతోపాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటే బాగుంటుంది కదా. అందుకే గ్రీన్ కాఫీ తాగండి.
గ్రీన్ కాఫీ
గ్రీన్ కాఫీ

గ్రీన్ కాఫీ

How To Make Green Coffee : గ్రీన్ టీ గురించి చాలా మందికి తెలుసు. బరువు తగ్గేందుకు(Weight Loss) ఇది తాగుతారు. అయితే ఎప్పుడైనా గ్రీన్ కాఫీ గురించి విన్నారా? కొంతమంది మాత్రమే విని ఉంటారు. దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీన్ని ఎలా తయారు చేస్తారనే కదా మీ అనుమానం. ఏం లేదు.. బ్రోకలీతో గ్రీన్ కాఫీ(Broccoli Green Coffee)ని తయారు చేయాలి. ఊబకాయాన్ని నియంత్రించడంలో ఇది ప్రభావంతంగా పనిచేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ(Green Tea) తాగుతుంటారు. గ్రీన్ కాఫీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ గ్రీన్ కాఫీని ప్రత్యేకంగా బ్రోకలీ నుంచి తయారుచేస్తారు. ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభావవంతంగా ఉంటుంది. అధిక బరువు మీ శరీర సౌందర్యాన్ని పాడు చేస్తుంది. అందుకే బరువు తగ్గేందుకు రోజూ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.

బరువు తగ్గాలనుకుంటే గ్రీన్ టీకి బదులుగా గ్రీన్ కాఫీ(Green Coffee For Weight Loss) తీసుకోండి. ఇది ప్రత్యేకంగా కూరగాయల నుండి తయారు చేస్తారు. గ్రీన్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు. శరీరానికి చాలా శక్తిని కూడా అందిస్తుంది. ఈ కాఫీలోని ఔషధ గుణాలు మీ బరువును తగ్గించి నియంత్రణలో ఉంచుతాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మంచి మొత్తంలో ఫైబర్ కూడా దొరుకుతుంది.

ఈ కాఫీని ఆరోగ్యవంతమైన కూరగాయ బ్రోకలీతో తయారు చేస్తారు. బ్రోకోలీ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది శరీరానికి చాలా శక్తిని కూడా ఇస్తుంది. బ్రోకోలీ కాఫీ బరువు తగ్గిస్తుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. బ్రోకోలీలో బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.

బ్రోకలీ కాఫీ ఎలా తయారు చేయాలి?

ముందుగా బ్రోకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత ఎండలో బాగా ఆరబెట్టండి.

బాగా ఆరిన తర్వాత మొత్తం పొడి చేయాలి.

పాలను వేడి చేసి అందులో బ్రోకలీ పౌడర్ వేసి తాగాలి.

కావాలనుకుంటే బ్రోకలీ పౌడర్ కూడా ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

గ్రీన్ కాఫీ చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. రక్తపోటును పెంచే కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. మార్కెట్లో గ్రీన్ కాఫీ గింజలు కూడా దొరుకుతాయి. ఇందులో అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

తదుపరి వ్యాసం