తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cockroaches: ఇంట్లోని బొద్దింకలను పంచదారతో ఇలా తరిమేయండి

Cockroaches: ఇంట్లోని బొద్దింకలను పంచదారతో ఇలా తరిమేయండి

Haritha Chappa HT Telugu

14 December 2023, 8:00 IST

    • Cockroaches: ఇంట్లో బొద్దింకలు గుంపులుగా చేరి ఇబ్బంది పెడుతున్నాయా? జాగ్రత్త వాటి వల్ల అనేక రోగాలు సోకే ప్రమాదం ఉంది.
బొద్దంకలు వదిలించుకోండిలా
బొద్దంకలు వదిలించుకోండిలా (pixabay)

బొద్దంకలు వదిలించుకోండిలా

Cockroaches: ఇంట్లో మూలలు కనిపిస్తే చాలు బొద్దింకలు పిల్లలను పెట్టి తమ సంతతిని పెంచేస్తాయి. ఇరుకైన ఇళ్లలో బొద్దింకలు సులువుగా తమ సంఖ్యను పెంచేసుకుంటాయి. ముఖ్యంగా వంటగదిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. డ్రెయిన్ పైపుల ద్వారా ప్రయాణిస్తూ వచ్చేస్తాయి. ఇవి ఎన్నో రోగాలను తమతో పాటు మోసుకొస్తాయి. బొద్దింకల వల్ల ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఇంట్లో నుంచి వదిలించుకోవాల్సిన అవసరం ఎక్కువ. కొరియర్ బాక్సులు, ప్యాకేజింగ్ వస్తువులు ఎక్కువగా ఉంటే వాటిలో బొద్దింకలు నివసించడానికి ఇష్టపడతాయి. కాబట్టి అలాంటి బాక్సులు ఏమైనా ఉంటే తొలగించేయాలి. గడ్డివాముల్లో కూడా ఇవి గూళ్లు నిర్మించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో అనవసరమైన వస్తువులు, డబ్బాలు, బాక్సులు వంటివి ఉంచకండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

బొద్దింకలు ఇలా వదిలించుకోండి

ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే బొద్దింకలు చేరవు. నీలిరంగు బల్బులు పెడితే బొద్దింకలు ఉండలేవు. మిగిలిపోయిన ఆహారం కోసం ఇవి అధికంగా వస్తాయి. కాబట్టి రాత్రిపూట మిగిలిపోయిన ఆహారాన్ని బయట పెట్టకండి. ఇలా పెట్టడం వల్లే అవి ఆహారం కోసం వచ్చి పిల్లలను పెట్టి తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఇంట్లోకి గాలి వెలుతురు అధికంగా వస్తే ఇవి ఉండలేవు. కాబట్టి కిటికీలు, తలుపులు వంటివి రోజులో కాసేపైనా తీసి ఉంచండి. ఇల్లంతా వెలుతురు వచ్చేలా చూడండి. ఇరుకైన ప్రదేశాలలోనే బొద్దింకలు ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి అలాంటి ఇరుకైన ప్రాంతాలలో బొద్దింకలు చేరకుండా శుభ్రపరచండి. లెమన్‌గ్రాస్ నూనె, సిట్రస్, పిప్పర్ మెంట్ నూనెల వాసన బొద్ధింకలకు నచ్చవు. ఆ నూనెలతో దీపాలను వెలిగించడం ద్వారా లేదా నూనెను స్ప్రే చేయడం ద్వారా బొద్ధింకలు అక్కడ చేరకుండా అడ్డుకోవచ్చు.

పంచదారతో ఇలా...

పంచదారతో కూడా బొద్దింకలు రాకుండా చేయొచ్చు. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల వెనిగర్, మూడు స్పూన్ల చక్కెర, కొన్ని రకాల పువ్వులు వేసి ఉంచండి. రెండు నుంచి మూడు రోజులు పాటు ఆ నీళ్లను అలానే వదిలేయండి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు అందులో పెరుగుతాయి. తర్వాత దాన్ని వడకట్టి ఆ నీళ్లను ఒక స్ప్రే బాటిల్‌లో వేయండి. బొద్దింకలు ఉన్నచోట ఈ నీళ్లను స్ప్రే చేస్తూ ఉండండి. కచ్చితంగా బొద్ధింకలు ఆ ప్రాంతాన్ని వీడి వెళ్ళిపోతాయి.

వేపాకులు కూడా బొద్దింకలకు నచ్చవు. నీళ్లలో వేప నూనెను వేసి ఇంటిని క్లీన్ చేయండి. లేదా స్ప్రే బాటిల్‌లో నీళ్లు, వేప నూనె వేసి ఆ నీళ్లను బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల అవి పారిపోయే అవకాశం ఎక్కువ.

బిర్యానీ ఆకులతో కూడా బొద్దింకలను పారిపోయేలా చేయవచ్చు. అవి అధికంగా తిరిగే చోట బిర్యానీ ఆకులను వేయండి. ఆ వాసనకు బొద్దింకలు అటువైపుగా రావు. అలాగే అమ్మోనియాతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం వల్ల కూడా బొద్ధింకలు రాకుండా ఉంటాయి. వాటి వాసన బొద్దింకలు భరించలేవు. కాబట్టి ఈ ట్రిక్ ను కూడా ప్రయత్నించవచ్చు.

బొద్దింకలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి E. కొలి అనే బాక్టీరియాను మోసుకొని తిరుగుతాయి. దీనివల్ల పిల్లలకు, పెద్దలకు ఎన్నో రకాల రోగాలు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లోబొద్దింకలు ఉంటే వెంటనే వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయండి.

తదుపరి వ్యాసం