తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Beauty Care Routine। ముఖంపై ముడతలు పోయి, యవ్వనపు నిగారింపు రావాలంటే, ఇలా చేయండి!

DIY Beauty Care Routine। ముఖంపై ముడతలు పోయి, యవ్వనపు నిగారింపు రావాలంటే, ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

15 August 2023, 15:59 IST

    • DIY Beauty Care Routine: ఇంట్లో తయారుచేసిన స్కిన్‌కేర్ మాస్క్‌ల నుండి స్క్రబ్‌లు, లిప్ బామ్‌లు, సహా యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు మీ ముఖం, శరీరం, పెదవులు, పాదాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ఇక్కడ అలాంటి కొన్ని పరిష్కారాలను మీకు తెలియజేస్తున్నాం
DIY Beauty Care Routine:
DIY Beauty Care Routine: (istock)

DIY Beauty Care Routine:

DIY Beauty Care Routine: అందమైన, యవ్వనపు చర్మం పొందడానికి అనేక సరళమైన విధానాలు ఉన్నాయి. మీరు ఇంట్లో ఉండే పదార్థాలతో మీ చర్మ సంరక్షణ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన స్కిన్‌కేర్ మాస్క్‌ల నుండి స్క్రబ్‌లు, లిప్ బామ్‌లు, సహా యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు మీ ముఖం, శరీరం, పెదవులు, పాదాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపుతాయి, మీ అందాన్ని మెరుపరుస్తాయి. ఇక్కడ అలాంటి కొన్ని పరిష్కారాలను మీకు తెలియజేస్తున్నాం. వీటిని మీకు మీరుగా చేసుకొని సులభంగా తయారు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

Chanakya Niti Telugu : భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి

Fruits for Dinner: డిన్నర్లో కేవలం పండ్లనే తినడం మంచి పద్ధతేనా? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

DIY Anti- Ageing Coco Face Mask- యాంటీ ఏజింగ్ కోకో ఫేస్ మాస్క్

ఈ యాంటీఆక్సిడెంట్-ప్యాక్డ్ కోకో మాస్క్ మీ ముఖంలో క్షీణించిన తేమను తిరిగి నింపుతుంది, చర్మం పునరుజ్జీవనం పొంది, ముడతలు తొలగిపోతాయి, మళ్లీ మీ చర్మం యవ్వనపు కాంతిని సంతరించుకుంటుంది. ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలో కింద చూడండి.

రెసిపీ: ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోర్ క్రీం, 1 టేబుల్ స్పూన్ తేనె, ఒక గుడ్డు తెల్లసొన కలపండి. ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి వర్తించండి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇందులో సోర్ క్రీం అనేది పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ఒక రూపం, ఇది చర్మాన్ని శుభ్రపరిచి, హైడ్రేట్ చేస్తుంది, తేనె ఒక హ్యూమెక్టెంట్, ఇది చర్మంలోని హైడ్రేషన్‌ను పెంచుతుంది, గుడ్డులోని తెల్లసొనలోని ప్రోటీన్ చర్మాన్ని బిగుతుగా , దృఢంగా చేస్తుంది.

DIY Body Scrub- డిటాక్సిఫైయింగ్ రైస్ జింజర్ బాడీ స్క్రబ్

కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇది మీ చర్మాన్ని హైడ్రేటింగ్ చేస్తుంది. అల్లం మంటను తగ్గిస్తుంది, చర్మాన్ని నిర్విషీకరణ చేస్తుంది. బియ్యపు గింజలు సహజ ఎక్స్‌ఫోలియంట్‌గా పని చేస్తాయి.

రెసిపీ: అరకప్పు బియ్యంను ముతగా రుబ్బుకోవాలి. దీనికి ½ కప్పు కొబ్బరి పాలు, ¼ కప్పు బ్రౌన్ షుగర్, 1½ టేబుల్ స్పూన్ అల్లం తురుముని కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ చేతులు, కాళ్లు ఇతర శరీర భాగాలకు వృత్తాకారంగా రుద్దుతూ ఉపయోగించండి. కొన్ని నిమిషాల తర్వాత, కడిగేసుకోండి. ఈ స్క్రబ్ మొత్తం శరీరాన్ని మెరిసేలా చేస్తుంది.

DIY Coconut Nail Hydrator- కొబ్బరి నూనె క్యూటికల్ హైడ్రేటర్

కొబ్బరి నూనె క్యూటికల్ హైడ్రేటర్ అనేది గోళ్లకు జీవం పోసుంది. పొడిగా, పెళుసుగా మారిన క్యూటికల్స్‌కు అదనపు పోషణను అందిస్తుంది. దీనికోసం మీకు ఎలాంటి పదార్థాలు అవసరం లేదు, కేవలం కొబ్బరి నూనె చాలు. ఇది మీ గోళ్లకు దీర్ఘకాల తేమను అందిస్తుంది. ప్రతి వేలి కొనపై కొద్దిగా నూనె రుద్దండి, ఆపై నూనె జారిపోకుండా ఒక ప్లాస్టిక్ ర్యాప్‌తో చుట్టండి. కొంత సమయం పాటు ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన మీ గోళ్లు అందంగా మెరుస్తాయి.

ఎక్స్‌ఫోలియేటింగ్ బేకింగ్ సోడా ఫుట్ సోక్

పగిలిన మడమలను నివారించి, మృదువైన పాదాలను పొందాలనుకుంటే బేకింగ్ సోడా, నీరు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిలో మీ పాదాలను కొద్దిసేపు నానబెట్టాలి.

రెసిపీ: ఒక నిస్సారమైన టబ్‌లో గోరువెచ్చని నీరు తీసుకోండి, అందులో అర కప్పు బేకింగ్ సోడా వేసి, బాగా కలపండి. ఆపై ఈ నీటిలో మీ, పాదాలను సుమారు 30 నిమిషాలు నానబెట్టండి. అనంతరం పాదాలను కడుక్కొని గుడ్డతో తుడిచి, ఫుట్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. అనంతరం సాక్సులు వేసుకోండి.

తదుపరి వ్యాసం