తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Pain Relief Balm। ఆయుర్వేద నొప్పి నివారణ బామ్.. మీకు మీరుగా తయారు చేసుకోండిలా!

DIY Pain Relief Balm। ఆయుర్వేద నొప్పి నివారణ బామ్.. మీకు మీరుగా తయారు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

12 August 2023, 18:36 IST

    • DIY Pain Relief Balm: కొన్ని సహజమైన పదార్థాలను ఉపయోగించి మీకు మీరుగా ఒక నొప్పి నివారణ లేహ్యంను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ కింద తెలుసుకోండి.
DIY Pain Relief Balm
DIY Pain Relief Balm (istock)

DIY Pain Relief Balm

DIY Pain Relief Balm: మనకు తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి ఉన్నప్పుడు వెంటనే మనం చేసే పని ఏదైనా నొప్పి నివారణ బామ్ ఉపయోగిస్తాం. నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ రాయడం లేదా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోవడం చేస్తాము. నొప్పి ప్రభావం ఉన్న ప్రాంతంలో నొప్పి నివారణ బామ్‌లు అప్లై చేయడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. మార్కెట్లో మనకు చాలా రకాల పెయిన్ రిలీఫ్ బామ్‌లు ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఈ బామ్‌లు రాయడం వలన చర్మానికి అలెర్జీని కలిగిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

Rice For Long Time : బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండేందుకు చిట్కాలు

అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న పెయిన్ రిలీఫ్ బామ్‌లు ఖరీదు ఎక్కువ, అందులో ఉండే పదార్థ పరిమాణం తక్కువగా ఉంటుంది, త్వరగా ఖాళీ అవుతుంది. కాబట్టి, అప్పటికప్పుడు మీ వద్ద ఎలాంటి నొప్పి నివారణ బామ్ అందుబాటులో లేకుంటే.. మీ చర్మానికి ఎలాంటి అలర్జీలు కలిగించని బామ్‌ను మీరు కోరుకుంటే.. కొన్ని సహజమైన పదార్థాలను ఉపయోగించి మీకు మీరుగా ఒక నొప్పి నివారణ లేహ్యంను తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ కింద తెలుసుకోండి.

DIY Coconut- Honey Balm

కావలసినవి:

  • 4 టీస్పూన్లు సహజ బీస్ వాక్స్
  • 4 టీస్పూన్లు కొబ్బరినూనె
  • 5 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్
  • 5 చుక్కల పుదీనా నూనె
  • 5 చుక్కలు ఫ్రాంకిన్సెన్స్ ఆయిల్
  • 5 చుక్కల లావెండర్ ఆయిల్

తయారీ విధానం

  1. ముందుగా ఒక గాజు గిన్నెలో బీస్ వాక్స్, కొబ్బరి నూనె వేసి మైక్రోవేవ్‌లో/ గ్యాస్ స్టవ్ మీద వేడి చేయండి.
  2. వేడికి కరిగిన మిశ్రమానికి పైన పేర్కొన్న అన్ని నూనెలను బాగా కలపండి
  3. ఆపై ఈ మిశ్రమాన్ని ఒక గాజు కూజాకు బదిలీ చేయండి, మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి.
  4. చల్లబడ్డాక గడ్డ కడుతుంది, మీ కొబ్బరినూనె పెయిన్ కిల్లర్ బామ్ రెడీ.

ఈ బామ్ ఉపయోగించే ముందు మీ చర్మంపై త్వరిత పాచ్ పరీక్ష చేసుకోండి, బాగుందనిపిస్తే ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీకు తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు ఈ బామ్‌లో నుంచి చిన్న మొత్తాన్ని తీసుకొని, మీకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రుద్దండి.

తదుపరి వ్యాసం