తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Irctc Flight Booking: Irctc బంపరాఫర్.. రూ. 100కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశం!

IRCTC Flight Booking: IRCTC బంపరాఫర్.. రూ. 100కే ఫ్లైట్ టికెట్ పొందే అవకాశం!

HT Telugu Desk HT Telugu

17 July 2022, 18:34 IST

    • తక్కువ ధరలో విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే IRCTC బంపరాఫర్ ప్రకటించింది.  ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ.100కే టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు రూ. 50 లక్షల బీమా ప్రయోజనం కూడా పొందవచ్చు
IRCTC Flight Booking
IRCTC Flight Booking

IRCTC Flight Booking

IRCTC ఫ్లైట్ బుకింగ్: మీరు వెకేషన్ ప్లాన్ చేస్తుంటే, ఈ గుడ్ న్యూస్ మీకోసమే. సుదూర పర్యటక ప్రాంతాలకు వెళ్ళాలంటే విమాన ప్రయాణం తప్పసరి, ఇందుకోసం ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఆర్థిక భారమని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం IRCTC బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌తో తక్కువ ఖర్చులోనే విమాన ప్రయాణం చేయవచ్చు. IRCTC నుండి విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేవారికి ప్రస్తుతం మంచి ఆఫర్ అందుబాటులో ఉంది . కేవలం రూ.100కే టికెట్ బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు రూ. 50 లక్షల బీమా ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్ వివరంగా తెలుసుకుందాం...

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

ఈ విధంగా ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు

IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC ఎయిర్ యాప్ (IRCTC Air App) ద్వారా విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకునే వారికి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. IRCTC ఎయిర్ వెబ్‌సైట్ ప్రకారంగా, మీరు SBI కార్డ్ ప్రీమియర్ ( SBI Card Premier) ద్వారా టిక్కెట్‌ ధర చెల్లిస్తే రూ. 100కే విమాన టికెట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. అలాగే 5% విలువను కూడా తిరిగి పొందవచ్చు. ఇది కాకుండా, మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌తో విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే, 7% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ జూలై 30 వరకు అందుబాటులో ఉంటుంది.

అదనంగా ఈ ప్రయోజనాలు లభిస్తాయి

IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుకింగ్‌ ధరపై కేవలం 59 కన్వీనియన్స్ ఫీజు మాత్రమే ఉంటుంది

IRCTC ద్వారా మీ టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే, మీరు 50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమాను కూడా పొందవచ్చు.

IRCTC అనేక ఇతర ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంది.

IRCTC ప్రత్యేక సెక్యూరిటి ఛార్జీలపై కూడా తగ్గింపులను అందిస్తుంది.

LTC అనేది టిక్కెట్ బుకింగ్ కోసం ప్రత్యేక ప్రభుత్వ సర్టిఫైడ్ కంపెనీ. దీని ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

విమాన టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి

టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు ముందుగా https://www.air.irctc.co.in/ ని సందర్శించండి .

తర్వాత మీ IDతో లాగిన్ అవ్వండి.

ఆ తర్వాత డిపార్చర్, అరైవల్ ఫీల్డ్‌లను పూరించండి.

దీని తర్వాత, ఆఫర్‌లను చెక్ చేసిన తర్వాత, చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఆ తర్వాత మీ విమానాన్ని బుక్ చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం