తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Checkups For Men। మగవారు ఈ ఐదు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి!

Health Checkups for Men। మగవారు ఈ ఐదు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి!

HT Telugu Desk HT Telugu

12 July 2023, 11:25 IST

    • Health Checkups for Men: మగవారు కచ్చితంగా చేయించుకోవలసిన కీలక ఆరోగ్య పరీక్షలు కొన్ని ఉన్నాయి, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి. 
Health Checkups for Men
Health Checkups for Men (istock)

Health Checkups for Men

Health Checkups for Men: చాలా మంది మగవారు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. తమకు ఉన్న అనారోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోరు. ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు కుటుంబపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లను, మరోవైపు వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటూ మానసికంగా కుంగిపోతారు. ఇలా శారీరకంగా, మానసికంగా అలసిపోయి అనేక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటారు. కానీ, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహిస్తే భవిష్యత్తులో అవి తీవ్రమైన అనర్థాలకు దారితీయవచ్చు. అందుకే మగవారి శ్రేయస్సు కోసం, ఏవైనా వ్యాధులను ముందస్తుగానే నిర్ధారించుకోవడానికి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవల్సిన అవసరం ఉంది. ఏ ఆరోగ్య సమస్యనైనా ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. వేగంగా కోలుకొని ప్రమాదం నుంచి బయటపడగలరు.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

మగవారు కచ్చితంగా పరిగణించవలసిన కీలక ఆరోగ్య పరీక్షలు కొన్ని ఉన్నాయి, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి. పురుషుల ఆరోగ్యానికి అవి ఎందుకు ముఖ్యమైనవో ఈ ఆర్టికల్‌లో వివరించడం జరిగింది.

బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్

అధిక రక్తపోటు అనేది హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. హైపర్ టెన్షన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్, లక్షణాలు తరచుగా బయటపడవు. కాబట్టి పురుషులు తమ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవడం అవసరం. రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా, మీరు హైపర్‌టెన్షన్-సంబంధిత వ్యాధులను గుర్తించవచ్చు. జీవనశైలిలో మార్పులు, మందులు తీసుకుంటూ తగిన చర్యలు తీసుకోవచ్చు. రక్తపోటును కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి తనిఖీ చేయాలి.

కొలెస్ట్రాల్ - బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్ , ఇతర హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. పురుషులు తమ శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు, అందులో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంత ఉన్నాయి, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్‌తో సహా వారి లిపిడ్ స్థాయిలను అంచనా వేయడానికి కొలెస్ట్రాల్- బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలు మీ హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడానికి జీవనశైలి మార్పులు లేదా మందులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.

ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్

పురుషులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. పురుషులు, ముఖ్యంగా 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, డాక్టర్ ను సంప్రదించి ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చర్చించడం చాలా ముఖ్యం. ఈ స్క్రీనింగ్‌లో సాధారణంగా ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) రక్త పరీక్ష, డిజిటల్ మల పరీక్ష (DRE) ఉంటుంది. ఈ పరీక్షలు ప్రోస్టేట్ గ్రంధిలో ఏవైనా అసాధారణతలను గుర్తించడంలో సహాయపడతాయి, ఇది క్యాన్సర్ ఉనికిని సూచిస్తుంది. రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది, విజయవంతమైన శస్త్రచికిత్సకు అవకాశాలను పెంచుతుంది.

కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్

కొన్నిసార్లు మలంలో రక్తం వస్తున్నట్లు గమనిస్తే అది కొలొరెక్టల్ క్యాన్సర్ కు ఒక సంకేతం కావచ్చు. పురుషులకు ఇదొక తీవ్రమైన ఆరోగ్య సమస్య. యాభై ఏళ్లు పైబడిన వయస్సు ఉన్న పురుషులకు అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ రకమైన క్యాన్సర్ ఎదుర్కొని ఉంటే వారు కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సిఫార్సు చేయడమైనది. సాధారణ స్క్రీనింగ్ పద్ధతులలో కొలొనోస్కోపీ ఉన్నాయి, ఇది ఏదైనా అసాధారణతలు లేదా ముందస్తు పాలిప్స్ కోసం మొత్తం పెద్దప్రేగును పరిశీలిస్తుంది లేదా మలంలో రక్త పరీక్ష (FOBT) లేదా స్టూల్ DNA పరీక్ష వంటి నాన్-ఇన్వాసివ్ పరీక్షలు కూడా ఉన్నాయి. ప్రాణాంతకమయ్యే ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడంలో, నివారించడంలో రెగ్యులర్ కొలొరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

శారీరక పరీక్ష

శారీరక పరీక్ష అనేది పురుషులు, స్త్రీలు అనే బేధం లేకుండా ప్రతి మనిషికి అవసరమయే ప్రాథమిక ఆరోగ్య పరీక్ష. ఇది శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య సమస్యలను అంచనా వేసే ఒక సమగ్రమైన పరీక్ష, ఇందులో భాగంగా మీ పూర్తి ఆరోగ్య చరిత్రను సమీక్షిస్తారు. హృదయ ఆరోగ్యం, ఊపిరితిత్తుల పనితీరు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు సహా మొత్తంగా మీ ఫిట్‌నెస్‌ స్థాయిలను అంచనా వేస్తారు.

తదుపరి వ్యాసం