తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wheat Kheer Recipe : గోధుమరవ్వతో ఖీర్ చేయండి.. నైవేద్యంగా పెట్టేయండి..

Wheat Kheer Recipe : గోధుమరవ్వతో ఖీర్ చేయండి.. నైవేద్యంగా పెట్టేయండి..

14 January 2023, 6:00 IST

    • Wheat Kheer Recipe : పండుగల సమయంలో చేసే స్వీట్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పైగా వాటిని చేసి.. దేవుడికి నైవేద్యంగా పెట్టి.. తర్వాత తింటే వాటి రుచిలో ఏదో తెలియని మార్పు ఉంటుంది. అది మనకి నచ్చుతుంది కూడా. అయితే ఈ భోగి పండుగకి.. తక్కువ సమయంలో చేయగలిగే స్వీట్ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమరవ్వ ఖీర్
గోధుమరవ్వ ఖీర్

గోధుమరవ్వ ఖీర్

Wheat Kheer Recipe : గోధుమరవ్వతో మనం ఉప్మా చేసుకుంటాము. అయితే ఈసారి మనం ఖీర్ చేసుకోబోతున్నాము. ఇది కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు. పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఖీర్ అనేది దేశవ్యాప్తంగా వివిధ పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో తయారు చేసుకుంటారు. సంక్రాంతి అనేది ఎలాగో పెద్ద పండుగే. దానిలో మొదటిరోజు అయిన భోగికి మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా.. దేవుడికి ఈజీగా తయారు చేసుకోగలిగే స్వీట్ చేయాలన్నా.. మీరు గోధుమరవ్వ ఖీర్ చేయొచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

కావాల్సిన పదార్థాలు

* గోధుమరవ్వ - 150 గ్రాములు

* నెయ్యి - 50 గ్రాములు

* ఎండుద్రాక్ష - 50 గ్రాములు

* ఏలకులు - 2

* బెల్లం - 50 ml

* జీడిపప్పు - 100 గ్రాములు

*పాలు - 500 ml

గోధుమరవ్వ ఖీర్ తయారీ విధానం

ఒక మందపాటి అడుగు నాన్ స్టిక్ పాన్​లో నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో గోధుమ రవ్వ వేసి.. సువాసన వచ్చే వరకు వేయించాలి. దానిలో పచ్చి యాలకుల పొడి, జీడిపప్పు వేసి బాగా కలపాలి. దానిలో బెల్లం వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించాలి. అనంతరం ఒక కప్పు నీటిని వేసి.. దానిని కదిలిస్తూ ఉండండి. 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మంటలను తగ్గించి.. పాలు వేసి బాగా కలిసే వరకు కలపండి. అనంతరం స్టవ్ ఆపేసి.. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నీష్ చేసుకోండి.

తదుపరి వ్యాసం