తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eris Covid19 Variant। వేగంగా విస్తరిస్తున్న ఎరిస్ అనే కొత్త వేరియంట్, మరో కోవిడ్ వేవ్ తప్పదా?

Eris Covid19 Variant। వేగంగా విస్తరిస్తున్న ఎరిస్ అనే కొత్త వేరియంట్, మరో కోవిడ్ వేవ్ తప్పదా?

HT Telugu Desk HT Telugu

08 August 2023, 12:15 IST

    • Eris Covid19 Variant: ఎరిస్ లేదా EG 5.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఎరిస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
Eris Covid19 Variant
Eris Covid19 Variant (istock)

Eris Covid19 Variant

Eris Covid19 Variant: కోవిడ్ వైరస్‌కు అసలు అంతం అనేది లేకపోవచ్చు, ఈ మహమ్మారి వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తుంది. కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి, అయితే Eris అనేది ఇప్పుడు ఇన్ఫెక్షన్ కలిగిస్తున కొత్త కోవిడ్19 వేరియంట్.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఎరిస్ లేదా EG 5.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా వేగంగా విస్తరిస్తోంది. అక్కడ నమోదవుతున్న ప్రతీ ఏడు కోవిడ్ కేసులలో ఒకటి ఎరిస్ వేరియంట్‌కు సంబంధించినది అని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఈ కరోనావైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు UKతో పాటు యూరప్ లోని మరికొన్ని దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో దాని ఉనికిని ప్రారంభించింది. మరొక కోవిడ్ వేవ్ విజృంభించే అవకాశం ఉండొచ్చని వివిధ హెల్త్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ పర్యవేక్షణలో ఉన్న వేరియంట్‌ల జాబితాలో ఎరిస్‌ను చేర్చింది. కోవిడ్ వేరియంట్ ఎరిస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

ఎరిస్ కోవిడ్ వేరియంట్ లక్షణాలు

జో హెల్త్ అధ్యయనం ప్రకారం, కొత్త కోవిడ్ వేరియంట్ ఎరిస్ సోకిన వ్యక్తి ఎలాంటి లక్షణాలు కనవరుస్తాడో నివేదించింది, జో హెల్త్ రిపోర్ట్ ప్రకారం ఎరిస్ కరోనా లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

  • గొంతు నొప్పి
  • ముక్కు కారటం, శ్లేష్మంతో ముక్కు మూసుకుపోవడం
  • జ్వరం
  • తుమ్ములు
  • పొడి దగ్గు
  • తలనొప్పి
  • తడి దగ్గు
  • బొంగురు స్వరం
  • కండరాల నొప్పి
  • వాసన కోల్పోవడం

ఈ లక్షణాలలో కొన్ని ప్రధాన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ లాగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం, జ్వరం వంటివి ఈ కొత్త వేరియంట్ ప్రధాన లక్షణాలు కావు అని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఈ పెరుగుదలకు మూల కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, క్షీణిస్తున్న రోగనిరోధక శక్తి మొదలైనవి కరోనా రావడానికి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

కోవిడ్ వేరియంట్ ఎరిస్ నివారణ:

ఈ కొత్త కోవిడ్ వేరియంట్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం.

కోవిడ్ సాధారణంగా ఫ్లూ-వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది కాబట్టి. అలాంటి లక్షణాలు మీకు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా, వెంటనే రోగనిర్ధారణ చేసుకోండి, మీ నుండి ఇతరులకు సోకకుండా వ్యాప్తిని అరికట్టండి.

తదుపరి వ్యాసం