తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dry Skin | మీ చర్మం పొడిగా ఉన్నా సరే.. ఈ నూనెలు మాత్రం వాడకండి

Dry Skin | మీ చర్మం పొడిగా ఉన్నా సరే.. ఈ నూనెలు మాత్రం వాడకండి

Vijaya Madhuri HT Telugu

01 March 2022, 18:39 IST

    • మీ చర్మం పొడిగా లేదా పొరలుగా ఊడిపోతున్నాదంటే దానికి కచ్చితంగా మాయిశ్చరైజేషన్ అవసరమని అర్థం. పొడి చర్మంతో ఇబ్బందిపడేవారు దానిని తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే చర్మం నిర్జీవంగాను, దురద పెడుతూ, నిగారింపు కోల్పోయి ఉంటుంది. కానీ నూనెతో మాత్రం కాదు. అంతే కానీ మీ చర్మాన్ని నూనెతో కప్పి ఉంచాలని అర్థంకాదు.
పొడి చర్మం సమస్యలు
పొడి చర్మం సమస్యలు

పొడి చర్మం సమస్యలు

Skin Care | పొడి చర్మం ఉన్నవారు మొదటిగా ఆలోచించేది నూనె గురించి. ఎందుకంటే వారి ప్రకారం పొడిచర్మంపై నూనెను పూయడమే. కానీ ఇది అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. చర్మంపై నూనెనురాస్తే.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. చర్మానికి ఆక్సిజన్ అందించదు. పైగా నూనెలు జిడ్డుగా ఉండడం వల్ల దానిపై దుమ్ము పేరుకుంటుంది. అంతిమంగా ముందుకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కోనవలసి ఉంటుంది. అయితే కచ్చితంగా దూరంగా ఉండాల్సిన నూనెల గురించి కూడా తెలిపారు. అవి ఏ నూనెలు.. ఎందుకు వాటిని చర్మానికి రాసుకోకూడదో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

1.కొబ్బరి నూనె

కొబ్బరి నూనె. ఇది గది ఉష్ణోగ్రత వద్ద ఘనమయ్యే స్వభావం కలిగి ఉంటుంది. దాదాపు 90 శాతం సంతృప్త కొవ్వుతో నిండి ఉంటుంది. అయితే అన్ని సంతృప్త కొవ్వులు సమానంగా ఉండవని కొందరు నమ్ముతారు. కొబ్బరి నూనెలో మీడియం చైన్​ ఫ్యాటీ యాసిడ్​లు అధికంగా ఉంటాయి. దీనిని నిల్వ ఉన్న కొవ్వుగా మార్చడం శరీరానికి కష్టం. ఇది హానికరమైన యూవీ కిరణాల నుంచి మిమ్మల్ని రక్షించడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఇది చర్మాన్ని పొడిగా మారుస్తుంది.

కొబ్బరి నూనెను చర్మానికి ఉపయోగించడం వల్ల ప్రతికూల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటిలో విరేచనాలు, మొటిమలు రావడం, ప్రేగు సంబంధిత బాధలు, అలర్జీలు కూడా ఉన్నాయని చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ నివేదిత దాదు తెలిపారు.

2. ఆల్మండ్ ఆయిల్

ఆల్మండ్ ఆయిల్. ఇది చర్మాన్ని హైడేట్ చేసి మంచిగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది. కానీ చర్మానికి అవరోధ పనితీరును మెరుగుపరిచే అధిక స్థాయి కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ డి, విటమిన్​ ఈ కూడా ఉన్నది. అంటే ఇది యాంటీ ఇన్​ఫ్లమేటరీ, చర్మాన్ని శాంతపరిచే పదార్థంగా పనిచేస్తుంది. కానీ ఇది చాలా దుష్ప్రాభావాలను కలిగి ఉంటుంది. ఇది చర్మరంధ్రాలను మూసుకుపోయేలా చేసి.. పొడి చర్మాన్ని మరింత దిగజారుస్తుంది. ఇది మొటిమలకు కూడా దారి తీస్తుంది. ఈ నూనె దురద, చర్మం కమిలడం వంటి దుష్ప్రాభావాలను కలిగి ఉంటుంది.

3. ఆలివ్​ ఆయిల్

ఆలివ్​ ఆయిల్​ అన్ని మొక్కల నూనెలల్లో, వెన్నలో ఉన్న కొవ్వు ఆమ్లాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియా, ఈస్ట్​లు పెరగడానికి చాలా మంచి ఆహార వనరు. మొటిమల బారినపడే చర్మానికి ఆలివ్​ ఆయిల్​ అనువైనదికాదు. చాలా పొడి చర్మం ఉన్నవారికి కూడా ఇది మంచి ఎంపిక కాదు. ఆలివ్​ ఆయిల్​లో ఉండే ఒలిక్ యాసిడ్​ పొడి చర్మం విషయంలో చేరి సహజ మాయిశ్చరైజింగ్ సామర్థ్యాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మొటిమలు, చర్మ దద్దర్లు కల్పించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారిలో తీవ్రమైన అలెర్జీలను ఇచ్చే అవకాశముంది. పైగా ఇది చర్మం ఒక్క సహజ తేమ సమార్థ్యాలను విచ్ఛిన్నం చేస్తుందని డాక్టర్ దాదు తెలిపారు.

కాబట్టి అమ్మాయిలు... డ్రై స్కిన్​కు ఎప్పుడూ ఆయిల్​ మసాజ్ అవసరం లేదు. సమస్యకు పరిష్కారం దొరకకపోతే చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించండి. హానిచేసే ప్రయోగాల నుంచి చర్మాన్ని రక్షించుకోండి.

తదుపరి వ్యాసం