తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Wishes : హ్యాపీ దీపావళి.. సింపుల్‍గా ఇలా విషెస్ చెప్పేయండి..

Diwali Wishes : హ్యాపీ దీపావళి.. సింపుల్‍గా ఇలా విషెస్ చెప్పేయండి..

Anand Sai HT Telugu

11 November 2023, 15:30 IST

    • Deepavali Greetings : భారతదేశంలో అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి. చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకెళ్లే పండుగ ఇది. ఈ దీపాల పండుగకు మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పండి.
హ్యాపీ దీపావళి
హ్యాపీ దీపావళి

హ్యాపీ దీపావళి

Diwali Greetings : దీపావళి వెలుగులు నింపి, వేడుకల వాతావరణాన్ని పెంచే అతిపెద్ద పండుగ. ఈ పండుగ ప్రత్యేక ఆచారాలను కలిగి ఉంటుంది. ప్రాంతాల వారీగా ఈ పండుగ జరుపుకోవడంలో కాస్త తేడా ఉంటుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల సందర్భంగా వివిధ ఆచార వ్యవహారాలు నిర్వహిస్తారు. దీపావళికి ఇల్లు మొత్తం శుభ్రం చేసి అలంకరిస్తారు. ఈ ఏడాది నవంబర్ 12 దీపావళి ఉంది. లక్ష్మీదేవి పూజతో పాటు వివిధ దేవతలను కూడా పూజిస్తారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండగ ఇది.

ట్రెండింగ్ వార్తలు

Flaxseeds Gel : చర్మంపై ముడతలను తగ్గించే మ్యాజిక్ జెల్.. ఇలా ఉపయోగించండి

Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం

Chanakya Niti Telugu : భార్య తన భర్త దగ్గర దాచే రహస్యాలు.. ఎప్పుడూ చెప్పదు!

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

దీపావళి అంటేనే వెలుగులు నింపే పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అందరి జీవితాల్లో వెలుగు నిండాలని సూచించేదే దీపావళి. ఈ పండగ అంటేనే సరాదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల మెరుపులు, కుటుంబం అంతా కలిసి జరిపే వేడుకలు. ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా చెప్పండి.

లక్ష్మీదేవీ అమ్మవారి దీవెనలు మనతో ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు Happy Diwali

దీపపు వెలుగులో చీకట్లు తొలగినట్లే, మనలోని కోపాన్ని పోగొట్టి, అహంకారాన్ని పోగొట్టి, ప్రేమ వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు

కష్టాలు పోవాలని, జీవితం బంగారం కావాలని, ఏడాది పొడవునా దీపావళి వేడుకలు ఉండాలని, దీపావళి శుభాకాంక్షలు.

దీపం వెలిగించినట్లే.. ప్రేమ ద్వారా ప్రేమ వ్యాపిస్తుంది.. ద్వేషం, కోపం ఈ పండుగతో నశించనివ్వండి.. ప్రేమ పెరగనివ్వండి, దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి, వెలుగుల పండుగ, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సంపదలను ప్రసాదించుగాక.. Happy Diwali 2023

అజ్ఞానం, అంధకారం తొలగి.. ద్వేషం, అసూయ తొలగి.. ఆనందంతో గడపాలి.. Happy Deepavali 2023

కష్టాలు చీకటిలా కరిగిపోవాలి, దీపకాంతిలా సుఖం రావాలి, జీవితం ఆనందమయం కావాలి.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

దీపావళి, వెలుగుల పండుగ.. జీవితంలో కొత్త వెలుగులు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు

కోట్లాది దీపాలతో మీ జీవితాన్ని అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదతో ఎల్లప్పుడూ ప్రకాశింపజేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

మీ కలలన్నీ నెరవేరాలని, వెలుగుల పండుగలో మీ జీవిత మార్గంలోని అడ్డంకులు తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అందరికీ Happy Deepavali

బాధలను కరిగించి ఉజ్వల భవిష్యత్తుకు జన్మనిచ్చేలా దీపావళి పండుగను ఇంటింటా దీపాలతో జరుపుకొందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

మీ కుటుంబంలోని ఇబ్బందులు ఈ దీపాల పండుగ వెలుగుల్లో కనుమరుగు అవ్వాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు..

దీపావళికి వెలిగించే దీపాలు.. మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు..

సిరిసంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali 2023

తదుపరి వ్యాసం