తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Prevention: షుగర్ రాకుండా, వచ్చినా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 6 చిట్కాలు పాటించాల్సిందే

Diabetes prevention: షుగర్ రాకుండా, వచ్చినా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 6 చిట్కాలు పాటించాల్సిందే

HT Telugu Desk HT Telugu

16 November 2023, 16:05 IST

    • Diabetes prevention: షుగర్ రాకూడదని కోరుకున్నా, ఒకవేళ ఇప్పటికే డయాబెటిస్ వచ్చి ఉన్నా మీరు తప్పకుండా పాటించాల్సిన 6 చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ చూడండి.
షుగర్ రాకుండా ఉండేందుకు చిట్కాలు
షుగర్ రాకుండా ఉండేందుకు చిట్కాలు (Freepik)

షుగర్ రాకుండా ఉండేందుకు చిట్కాలు

డయాబెటిస్ ఉన్నప్పుడు షుగర్ తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ఒక సవాలే. మీ ఆహారాన్ని రుచిగా మార్చుకోవడానికి కెచప్ లేదా జామ్ లేదా మసాలా లేదా ఇంకేదైనా జత చేయాలనుకోవడం కూడా మిమ్మల్ని భయపెడుతుంది. ఎక్కడ మీ సమస్య మరింత తీవ్రమవుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. అందుకే మీరు చక్కెర, ఊబకాయం ప్రమాదాన్ని పెంచే ఆహారాలకు తగిన ప్రత్యామ్నాయాలను కనుగొనాలి.

ట్రెండింగ్ వార్తలు

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

సాల్ట్ సత్యాగ్రహ.. రక్తపోటు నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన మైక్రో ల్యాబ్స్

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

మొదట మీకు టీ కాఫీ తాగే అలవాటు ఉంటే షుగర్ లెస్ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. తీపి తినాలన్న మీ కోరికను పండ్లతో భర్తీ చేసుకోవచ్చు. మీ భోజనంలో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా మీ ఆహారాన్ని సర్దుబాటు చేయడం వలన మీ తీపి కోరికలను తగ్గించుకోవచ్చు.

‘ప్రధాన వంటకాలు, రుచికరమైన పదార్ధాలు, డెజర్ట్‌లతో సహా అనేక రకాల ఆహార పదార్థాలలో చక్కెర ఎక్కువగానే ఉంటుంది. పెద్దలు ప్రతిరోజూ తినగలిగే చక్కెర సిఫార్సు మొత్తంలో గరిష్టంగా 30 గ్రాములు ఉండాలి. పిల్లలు 24 గ్రాముల వరకు తినవచ్చు. సిఫార్సు చేయబడిన యూనిట్ల కంటే ఎక్కువ చక్కెరను వినియోగిస్తే స్థూలకాయం ఏర్పడుతుంది. మధుమేహం వచ్చే అవకాశాలను పెంచుతుంది..’ అని కాంకర్ డయాబెటిస్ సెంటర్‌లోని ప్రివెంటివ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దక్షత పాధ్యే చెప్పారు.

ఈ దిశగా మీకు సహాయపడటానికి డాక్టర్ పాధ్యే కొన్ని ఆచరణాత్మక చిట్కాలను పంచుకున్నారు.

1. ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోండి

సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి ప్రాసెస్ చేయబడిన పానీయాలను నివారించండి. వాటికి బదులుగా ఫ్రూట్ స్మూతీస్, హెర్బల్ టీలు, తాజా పండ్ల రసాలు, కూరగాయలతో చేసిన సూప్స్ ఎంచుకోండి. స్కిమ్ మిల్క్, సన్నని మజ్జిగ, సత్తు డ్రింక్, అలోవెరా షాట్స్, కొబ్బరి నీరు ఎంచుకోండి.

2. మసాలా పరిమితం చేయండి

మీ వంటలలో మసాలా దినుసులు జోడించడం రుచిని మెరుగుపరచడానికి గొప్ప మార్గం. అయినప్పటికీ కెచప్, సాస్‌, ఊరగాయలు, వెనిగర్‌, మసాలాలు మొదలైనవి కృత్రిమ రుచి కోసం అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర వంటి అనారోగ్యకరమైన పదార్ధాలను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని వాడకూడదు లేదా పరిమితం చేయాలి.

3. డెజర్ట్‌లను తొలగించండి

అన్ని డెజర్ట్‌లు చక్కెరతోనే తయారవుతాయి. పోషక విలువలు ఏవీ ఉండవు. ఇవి రక్తంలో చక్కెరను పెంచడానికి కారణమవుతాయి. మీరు 70 శాతం కోకో డార్క్ చాక్లెట్, క్రీమ్‌తో బేక్డ్ ఫ్రూట్, దాల్చినచెక్క, జాజికాయ మొదలైన మసాలా దినుసులతో చేసినవి, పెరుగు వంటి వాటితో చేసిన తక్కువ చక్కెర డెజర్ట్‌లను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.

4. లేబుల్‌ చదవండి

ప్రాసెస్ చేసిన క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్‌లో అదనపు చక్కెర ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఫుడ్ లేబుల్‌లను తనిఖీ చేయాలి. సుక్రోజ్, మాల్టోస్, డెక్స్‌ట్రోస్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, లాక్టోస్ మొదలైన చక్కెర లేదా చక్కెర పర్యాయపదాలను కలిగి ఉండే ఉత్పత్తులను నివారించడం చాలా ఉత్తమం.

5. ప్రోటీన్ పెంచండి

అధిక ప్రోటీన్, ఫైబర్ ఆహారం ఆకలిని తగ్గిస్తుంది. తిన్నంత మేరకు సంతృప్తిని ఇస్తుంది. అధిక చక్కెర ఆహారం ఆకలి, బరువు పెరుగడంతో ముడిపడి ఉంటుంది. లీన్ మీట్, గుడ్లు, పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అత్యుత్తమ మార్గం.

6. కొనడమే వద్దు

మీరు తినే, త్రాగే విషయాల గురించి మీరు కొనడం దగ్గరి నుంచే స్ట్రిక్ట్‌గా ఉండండి. ఒకసారి అవి మీ ఫ్రిజ్‌లో చేరితే వాటిని మీరు తప్పక వినియోగిస్తారు.సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకే ఇంట్లో ఉండే ప్యాంట్రీ, ఫ్రిజ్‌లో చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను నిల్వ ఉంచడాన్ని పరిమితం చేయండి. మీ ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి మిల్లెట్, ఆరోగ్యకరమైన స్నాక్స్‌ నిల్వ చేయండి.

తదుపరి వ్యాసం