తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes In Summer: వేసవిలో షుగర్ ఇలా అదుపులో ఉంచుకోండి

Diabetes in summer: వేసవిలో షుగర్ ఇలా అదుపులో ఉంచుకోండి

HT Telugu Desk HT Telugu

20 March 2023, 16:19 IST

  • Diabetes in summer: వేసవిలో షుగర్ (డయాబెటిస్) అదుపులో ఉండేందుకు నిపుణులు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి.

Staying active and avoiding heat is the key to manage diabetes in summer season
Staying active and avoiding heat is the key to manage diabetes in summer season (Freepik)

Staying active and avoiding heat is the key to manage diabetes in summer season

డయాబెటిస్ ఉన్న వారికి ప్రతి సీజన్‌లోనూ ప్రత్యేకమైన సవాళ్లు ఎదురవుతాయి. వీరు సంక్లిష్టత లేని జీవితాన్ని గడపడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా అవసరం. చలికాలంలో కదలిక లేని జీవన శైలి అలవాట్లు డయాబెటిస్‌ను అదుపులో ఉంచలేవు. వేసవిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసటకు, ఎండదెబ్బకు గురవుతారు. ఈ వ్యాధి రక్తనాళాలు, నరాలను దెబ్బతీయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది చెమట గ్రంథులను ప్రభావితం చేస్తుంది. అధిక చక్కెర స్థాయిల వల్ల ఎక్కువగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు వారి శరీరంలోని నీటిని త్వరగా కోల్పోతారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరం వేసవిలో కూడా ఇన్సులిన్‌ను విభిన్నంగా ఉపయోగిస్తుంది. ఇక టైప్ 1 డయాబెటిస్ రోగులు సరైన ఇన్సులిన్ మోతాదును నిర్ణయించడానికి వారి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తరచుగా పర్యవేక్షించవలసి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

డయాబెటిస్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయదు. శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్‌ను తయారు చేసే ప్యాంక్రియాస్‌లోని ఐలెట్ కణాలపై దాడి చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ తక్కువ స్థాయిలో ఇన్సులిన్‌ను చేస్తుంది. అలాగే శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించదు.

‘డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ఉక్కిరిబిక్కిరి చేసే ఒక సాధారణ జీవక్రియ సమస్య. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. మధుమేహం ఉన్నవారికి తరచుగా ఆకలి వేస్తుంది. దప్పికగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని ప్రీత్ ఫిట్‌నెస్ క్లాస్ వ్యవస్థాపకుడు డైటీషియన్ హర్‌ప్రీత్ చెప్పారు.

మధుమేహాన్ని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవడానికి మీరు వేసవికి ముందే తప్పనిసరిగా చేయవలసిన 5 జీవనశైలి మార్పులను హర్‌ప్రీత్ సూచించారు.

1. శారీరకంగా చురుకుగా ఉండండి

వేసవి కాలంలో మధుమేహాన్ని నియంత్రించడంలో చురుకుగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతల బారి నుంచి కాపాడుకోవడం కీలకం. ఉదయం, సాయంత్రం వేళల్లో 30 నిమిషాల నడకను ప్రయత్నించవచ్చు. బాగా ఎండ ఉన్న సమయంలో బయటికి రాకుండా ఉండాలి. మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం తీసుకున్న 1-3 గంటల తర్వాత నడవడం మేలు.

2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి

అధిక ఫైబర్ ఆహారం డయాబెటిస్ ఉన్నవారికి గణనీయమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తాయి. ఇటువంటి ఆహారాలు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో మీకు సహాయపడుతుంది. అదే సమయంలో రక్తపోటు, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో వోట్స్, బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్ బ్రెడ్, తృణధాన్యాలు, పండ్లు, విత్తనాలు, గింజలు, గుమ్మడికాయ, క్యారెట్, టొమాటో వంటి కూరగాయలు ఉన్నాయి.

3. జ్యూస్‌కు బదులు పండ్లు

వేసవి కాలం అంటే తాజా పండ్ల రసాలు, స్మూతీస్, ఇతర రిఫ్రెష్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. కానీ జ్యూస్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉండకపోవడం, చక్కెర కంటెంట్ అధికంగా ఉండటం వల్ల గ్లూకోజ్ స్థాయిలు చాలా త్వరగా పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. మీకు వేసవిలో పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే, మితంగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లతో వాటిని ఇంట్లో తయారు చేసుకోండి. పండ్ల రసాల కంటే తాజా పండ్లు తినడం మంచిది.

4. హైడ్రేటెడ్ గా ఉండండి

అధిక రక్త చక్కెర స్థాయిల వల్ల మీ మూత్రపిండాలు అదనపు చక్కెరను వదిలించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శరీరం నుండి అదనపు చక్కెరను తొలగించడంలో సహాయపడటానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని తయారు చేయాలి. నీరు బాగా తాగితే అది మీ రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల వేసవిలో నీరు, తేమనిచ్చే ఆహారాలు పుష్కలంగా ఉండేలా చూసుకోండి.

5. మీ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించండి

టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలంటే మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం రెగ్యులర్‌గా బ్లడ్ షుగర్ స్థాయి తెలుసుకోవాలి. ఆహారం, వ్యాయామం, ఔషధాలు ఎలా బ్లడ్ షుగర్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో పరిశీలించాలి.

టాపిక్

తదుపరి వ్యాసం