తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Guava Leaf Tea : జామ ఆకుల టీ గురించి తెలుసా? రోజూ తీసుకుంటే చాలా మంచిదట..

Guava Leaf Tea : జామ ఆకుల టీ గురించి తెలుసా? రోజూ తీసుకుంటే చాలా మంచిదట..

03 September 2022, 10:56 IST

    • Guava Leaf Tea : జామకాయలే కాదు.. జామ ఆకులతో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు నిపుణులు. అందుకే రోజూ ఉదయం జామకాయ టీ తాగాలంటున్నారు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే.. మీరు దీనిని అస్సలు వదిలిపెట్టరు అంటున్నారు. 
జామ ఆకుల టీ
జామ ఆకుల టీ

జామ ఆకుల టీ

Guava Leaf Tea : పుష్కలమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా జామకాయను సూపర్ ఫ్రూట్‌గా అభివర్ణించారు. జామ 80% నీటిని కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, గుండె-ఆరోగ్యకరమైన పోషకాలతో సహా.. ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

అంతేకాకుండా జామ ఆకులతో కూడా అన్ని ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వాటిని టీలో చేర్చుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామ ఆకుల నుంచి తయారైన టీలో ఫ్లేవనాయిడ్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మీ కడుపు, పేగు పరిస్థితులు, వాపు, అధిక రక్తంలో చక్కెర స్థాయిలు, మధుమేహం, గాయాలకు మంచిది. అయితే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోడానికై

జామ, జామ ఆకులు రెండూ విటమిన్ సితో సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇవి బహుళ ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను రాకుండా చేస్తాయి. అంతేకాకుండా దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఏదైనా ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేసేటప్పుడు శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రకాశవంతం చేయడానికి..

జామ ఆకులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, సమ్మేళనాలు మృదువుగా ఉండే చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ టీ యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మొటిమల నుంచి కాపాడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

బరువు తగ్గడంలో సహకరిస్తాయి

జామ ఆకుల టీ వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శూన్య కేలరీలను కలిగి ఉంటుంది. మీ స్వీట్స్ కోరికలను తగ్గించి.. ఆకలిని అరికడుతుంది. ఇవన్నీ మీ శరీరం నుంచి అదనపు పౌండ్లను తొలగించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

లైకోపీన్ అనేది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. జామ ఆకులలో ఈ యాంటీఆక్సిడెంట్ గొప్ప పరిమాణంలో ఉంటుంది. ఇది విధ్వంసక కణాల నుంచి ఫ్రీ రాడికల్స్‌ను రక్షిస్తుంది. కాబట్టి క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుంది.

అధిక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

జామ ఆకులలో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. అయితే పండు మొత్తం ఫైబర్​తో నిండి ఉంటుంది. ఈ రెండూ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఫైబర్ జీర్ణక్రియపై ఒక ట్యాబ్ ఉంచుతుంది. ఇది నేరుగా రక్తప్రవాహంలో కలిసిపోకుండా నిర్ధారిస్తుంది.

ముఖ్యమైన ఫలితాలకై మీరు జామ ఆకు టీని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. సురక్షితమైన, మంచి శ్రేయస్సు కోసం దాని వినియోగాన్ని అతిగా తీసుకోకుండా చూసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం