తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffeeless Coffee | కాఫీ లేని కాఫీ గురించి మీకు తెలుసా? అది ఎలా ఉంటుందంటే?!

Coffeeless Coffee | కాఫీ లేని కాఫీ గురించి మీకు తెలుసా? అది ఎలా ఉంటుందంటే?!

HT Telugu Desk HT Telugu

11 July 2022, 11:58 IST

    • పులిహోరలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? కాఫీలో కాఫీ ఉంటుందా? ఉండదు! అవును..  కాఫీ లేని కాఫీ కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Coffee
Coffee (Pixabay)

Coffee

కాఫీ చాలా మందికి ఫేవరెంట్ డ్రింక్. రోజూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగనిదే వారు ఏ పని మొదలుపెట్టరు. అయితే ఈ కాఫీలో కూడా చాలా రకాలు, ఫ్లేవర్లు ఉంటాయి. కొందరికి ఫిల్టర్ కాఫీ ఇష్టం, మరికొందరికి క్యాపచ్చినో ఇష్టం అలాగే బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ మధ్య బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా తాగుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా కాఫీ లేని కాఫీ కూడా వస్తుందండోయ్. కాఫీలేని కాఫీనా అదెలా సాధ్యం అనుకుంటున్నారా? మాంసం లేకుండా మాంసం, వెజిటేరియన్ గుడ్లు ఎలా అయితే కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారో ఇది కూడా అంతే.

పాలు లేకుండానే పాలు ఎలా అయితే మనకు అందుబాటులో ఉన్నాయో అలాగే 'కాఫీ లెస్ కాఫీ' తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిని మాలిక్యులర్ కాఫీ అని పిలుస్తారు. ఈ కాఫీని కాఫీ గింజలను ఉపయోగించి కాకుండా పొద్దుతిరుగుడు గింజల పొట్టు, పుచ్చకాయల గింజలను ఉపయోగించి తయారు చేస్తారు. నిజమైన కాఫీ-ఫ్లేవర్డ్ కాఫీని సృష్టించడానికి ఇది ఒక ప్రత్యేకమైన రసాయన ప్రక్రియకు లోనవుతుంది. ఈ రసాయన ప్రక్రియ అనంతరం ఉత్పత్తి అయిన కాఫీ పొడిని కలిపితే అది సాధారణ కాఫీలాగే తయారవుతుంది. అంతేకాదు ఇందులో కూడా గణనీయమైన మొత్తంలో కెఫిన్ ఉంటుంది.

కాఫీ లేని కాఫీతో కలిగే ప్రయోజనం ఏమిటి?

కాఫీ లేని కాఫీ చేయడానికి మూడు కారణాలున్నాయి. మొదటి, అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, కాఫీలోని చేదు గింజలను వదిలించుకోవడం. రెండవది, ఈ కొత్త 'కాఫీ లెస్ కాఫీ' తాగడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. చివరి కారణం 'సుస్థిరత' ఎందుకంటే వాతావరణ మార్పులకు సాధారణ కాఫీ గడ్డ కట్టడం, కరిగిపోవడం జరుగుతుంది. ఈ కాఫీ లేని కాఫీతో అలాంటి సమస్యలు ఉండవు.

అంతేకాదు, ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో కాఫీ వినియోగం జరుగుతుంది. అనేక ఇతర రెసిపీల్లో కూడా కాఫీని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ కాఫీ రహిత కాఫీ అందుబాటులోకి వస్తే సాధారణ కాఫీ వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు. అంటే భవిష్యత్తులో కాఫీకి కొరత ఉండదు.

టాపిక్

తదుపరి వ్యాసం