తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Brain Day 2022 : ఈ ఒక్కగేమ్ చాలు.. మీ మెదడు ఆరోగ్యంగా ఉండడానికి..

World Brain Day 2022 : ఈ ఒక్కగేమ్ చాలు.. మీ మెదడు ఆరోగ్యంగా ఉండడానికి..

22 July 2022, 12:03 IST

    • World Brain Day : శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమైనవే. దానిలో మెదడు మరీ ముఖ్యం. ఎందుకంటే అన్ని భాగాలకు సంకేతాలు పంపేది ఈ మెదడే కాబట్టి. మీ మెదడు సరిగా లేకుండా.. మీ జీవనశైలే మారిపోతుంది. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని విస్మరించడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అనేక రుగ్మతలకు, నరాల సంబంధిత సమస్యలకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే  ఒక్క గేమ్​తో మీ మెదుడుకు మంచి ఆరోగ్యం ఇవ్వొచ్చు అంటున్నారు. ఇంతకీ ఏమిటా గేమ్. దానివల్ల ప్రయోజనాలు ఏమిటి ?
ప్రపంచ బ్రెయిన్ డే 2022
ప్రపంచ బ్రెయిన్ డే 2022

ప్రపంచ బ్రెయిన్ డే 2022

World Brain Day 2022 : మీ మెదడుకు సరైన ఆటను ఎంచుకోవడం ద్వారా దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని పనులు, ఆటలు మిమ్మల్ని నిస్తేజంగా మార్చలేవు కానీ.. సరైన ఆట మీ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచ మెదడు దినోత్సవం 2022 సందర్భంగా ఆ గేమ్ మీ మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఒక గేమ్ గురించి తెలుసుకుందాం. ఇది మీ ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీవితంలోని ప్రతి కష్ట సమయంలోనూ మీ సామర్థ్యాన్ని మీకు గుర్తిచేస్తుంది. ఇంతకీ ఏమిటా గేమ్ అనుకుంటున్నారా? అదే చెస్.

ట్రెండింగ్ వార్తలు

Heart Attack: వేడి వాతావరణంలో గుండెపోటు వచ్చే అవకాశం రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు

Stickers On Fruits : పండ్లపై స్టిక్కర్లు ఎందుకు పెడతారు? వీటి అర్థమేంటి?

Gongura Curry: గోంగూర వంకాయ కర్రీ ఇలా వండారంటే ఒక్క ముద్ద కూడా మిగలదు

Best Hair Oils : ఈ 6 నూనెల్లో జుట్టుకు ఏదైనా రెండు చుక్కలు వేయండి.. తర్వాత ఫలితం చూడండి

తెలివితేటలతో, వ్యూహంపై చక్కని పట్టుతో ముడిపడి ఉన్నందున చదరంగం అత్యుత్తమ మానసిక క్రీడలలో ఒకటిగా పేరొందింది. మీరు చదరంగం ప్రేమికులైతే.. మీ మెదడు ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు ఇప్పటికే అనేక ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన గేమ్‌కు దూరంగా ఉండేవారికి.. ఇది ఎందుకు గొప్ప బ్రెయిన్ గేమ్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెస్​ ఆడటం వల్ల మీ మెదడు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెరుగైన ఏకాగ్రత

అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ADHD) అనేది 21వ శతాబ్దపు అంటువ్యాధి. ఇది పిల్లలను, పెద్దలను పట్టుకుంది. వారి పనిపై వారు దృష్టి పెట్టడం కష్టంగా మారేలా చేసింది. దీని ఫలితంగా ఉత్పాదకత బాగా తగ్గుతుంది. పరధ్యానంగా ఉండేలా చేస్తుంది. మీరు కూడా ఇలాంటి పరధ్యానంగా ఉంటూ.. పనిపై శ్రద్ధ చూపించలేకపోతున్నారా? అయితే మీరు చెస్ ఆడటం నేర్చుకోండి.

చెకర్డ్ గేమ్ విపరీతమైన శ్రద్ధను కోరుతుంది. ఇది లేకపోతే మీరు ఓడిపోవడం ఖాయం. అందుకే చదరంగం మీ మనస్సును ఏకాగ్రతతో ఉంచడానికి శిక్షణనిస్తుంది. ఒక పని పట్ల ఈ అధిక శ్రద్ధ ఎక్కువ విజయాన్ని సాధించడంతో పాటు.. తక్కువ సమయంలో మెరుగైన పనితీరును కలిగిస్తుంది.

2. జ్ఞాపకశక్తి

అవును. మీరు సరిగ్గానే విన్నారు. చదరంగం అల్జీమర్స్ వ్యాధిని దూరంగా ఉంచడంతోపాటు మీ జ్ఞాపకశక్తి కణాలపై పని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఆటలోని అనేక మలుపులు, ప్రత్యర్థిపై గెలవడానికి వేసే ఎత్తుగడలు, వ్యూహాలను తెలుసుకునేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇవన్నీ మెరుగైన జ్ఞాపకశక్తిని పెంపొందేలా చేస్తాయి. ఇతర పనులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. తద్వారా మీరు జీవితంలోని ప్రతి విషయంలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఇది డిమెన్షియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మీ డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తుంది.

3. మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది

చదరంగం వారి ఆలోచన, సమస్య-పరిష్కార నైపుణ్యాలను అన్ని వయసుల వారిలో మెరుగుపరుస్తుంది. చిన్న వయసులోనే దీనిని అభ్యసిస్తే.. చాలా మంచిది. విద్యలో రాణిస్తారు. ఏదేమైనప్పటికీ పెద్దలు కూడా.. చదరంగం ఆడటం ద్వారా కాలక్రమేణా మెరుగైన ఆలోచన, సమస్య-పరిష్కార నైపుణ్యాల ప్రయోజనాన్ని పొందుతారు.

చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు మీ మెదడు ఆరోగ్యానికి మించి విస్తరించాయి. ఇది మీ వయస్సు ఏమైనప్పటికీ, ప్రపంచానికి స్పష్టంగా కనిపించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మీకు సహాయపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం