తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chanakya Niti Telugu। తల్లిదండ్రులు ఈ తప్పులు చేశారో, వారి పిల్లలే వారిని అసహ్యించుకుంటారు!

Chanakya Niti Telugu। తల్లిదండ్రులు ఈ తప్పులు చేశారో, వారి పిల్లలే వారిని అసహ్యించుకుంటారు!

HT Telugu Desk HT Telugu

02 August 2023, 7:07 IST

    • Chanakya Niti Telugu: పేరేంట్స్ చేసే ఆ తప్పుల కారణంగా పిల్లలు పెద్దయ్యాక తమను కనిపెంచిన తల్లిదండ్రులనే విధ్వేషిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు, మరి ఆ తప్పులు ఏంటి?
Chanakya Niti Telugu:
Chanakya Niti Telugu: (Unsplash)

Chanakya Niti Telugu:

Chanakya Niti Telugu: తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు, ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లల ఎదుగుదలే వారికి గొప్ప ఆనందాన్నిచ్చే విషయం. తమ పిల్లలు జీవితంలో సాధించే విజయాలను తమ విజయాలుగా వారు మురిసిపోతారు, వారు జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగినపుడు అంతకుమించిన ఆనందం ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఆచార్య చాణక్యుడు కూడా తన నీతిశాస్త్రంలో ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొన్ని సందర్భాల్లో పిల్లల పట్ల వారి తల్లిదందడ్రుల తీరును కూడా చాణక్యుడు తప్పుబట్టాడు.

చాణక్యుడి ప్రకారం, తల్లిదండ్రులు తమ సొంత పిల్లలకే భవిష్యత్తులో శత్రువులుగా మారవచ్చు. అందుకు తల్లిదండ్రులు చేసే రెండు క్లిష్టమైన తప్పులు ఆ పరిస్థితులకు దారితీస్తాయి. పేరేంట్స్ చేసే ఆ తప్పుల కారణంగా పిల్లలు పెద్దయ్యాక తమను కనిపెంచిన తల్లిదండ్రులనే విధ్వేషిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు, మరి ఆ తప్పులు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల చదువును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు

తమ పిల్లల చదువును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు తమకు తెలియకుండానే తన పిల్లలకు విరోధులుగా వ్యవహరిస్తారని చాణక్యుడు ఉద్ఘాటించాడు. పిల్లల్ని కన్న తర్వాత వారికి విద్యాబుద్ధులను నేర్పించడం, పిల్లలు సరైన సన్మార్గంలో నడిచేలా వారికి సరైన మార్గనిర్ధేశనం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలా చేయగలిగినప్పుడే ఆ పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు, వారి భవిష్యత్తు బాగుంటుంది. కానీ, చదువుకోని పిల్లలు ఎప్పటికీ జీవితంలో ఉన్నత స్థానం పొందలేడు. ఒకవేళ ఎదిగినా ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వారికి సమాజంలో మంచి గౌరవం, గుర్తిపు ఉండవు. కాబట్టి, తమ పరిస్థితికి కారణమైన అలాంటీఇ తల్లిదండ్రులను పిల్లలు తమ శత్రువులుగా భావిస్తారు. విద్య అనేది నేటి ప్రపంచంలో విజయానికి మూలస్తంభం, ఇది వ్యక్తులను మేధోపరంగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి విద్యకు ఉన్న అత్యంత ప్రాముఖ్యతను గుర్తించి, తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాస ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చాణక్యుడు సూచించాడు.

అతిగా గారాబం చేయడం

తమ పిల్లలను ముద్దు చేయడం, గారాబంగా పెంచుకోవడం ప్రతి తల్లిదండ్రులు చేసేదే. కానీ అది హద్దుల్లో ఉండాలని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. తమ పిల్లలను అతి గారాబం చేసే తల్లిదండ్రులు వారు ఏ తప్పు చేసినా క్షమించేస్తారు. కానీ, పిల్లలకు మొదటి ఉపాధ్యాయులుగా, తల్లిదండ్రులే ఉంటారు, తమ పిల్లలను ధర్మమార్గం వైపు నడిపించడంలో కీలక పాత్ర కూడా వారిదే. కానీ పిల్లలు తప్పు చేసినా వారి తప్పును తెలియజేయకపోతే, దానికి తోడు ఆ తప్పును ప్రశంసిస్తే వారు పెద్దయ్యాక అధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. వరుసగా తప్పులు చేస్తూ సమాజంలో చెడ్డ పేరును తెచ్చుకుంటారు. అది తర్వాత వారి జీవితంలో ఎన్నో పరిణామాలకు దారితీయవచ్చు. దీంతో ఒక నిర్ధిష్ట సమయంలో తల్లిదండ్రులు తమని సరిగ్గా పెంచలేదని వారి పిల్లలు భావిస్తారు. ఆ తర్వాత వారిని శత్రువులుగా చూడటం మొదలు పెడతారు. " అతి అమృతం కూడా విషమే” అన్న సామెతను చాణక్యుడు తెలిపాడు. కాబట్టి పిల్లలను సరిగ్గా పెంచాలని, వారి పెంపకంలో మంచిచెడుల సమతుల్యతను జాగ్రత్తగా చూసుకోవాలని చాణక్యుడు హితవు పలికాడు.

తదుపరి వ్యాసం