తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జుట్టు సంరక్షణలో మీరు వినేవి అపోహలేనా? నిపుణుల మాట ఇదీ

జుట్టు సంరక్షణలో మీరు వినేవి అపోహలేనా? నిపుణుల మాట ఇదీ

04 June 2023, 15:00 IST

  • జుట్టు సంరక్షణలో మీరు వినేవి అపోహలేనా? నిపుణుల మాట ఇక్కడ తెలుసుకోండి.

హెయిర్ కేర్ అపోహలు, చిట్కాలు
హెయిర్ కేర్ అపోహలు, చిట్కాలు (Unsplash)

హెయిర్ కేర్ అపోహలు, చిట్కాలు

జుట్టు సంరక్షణ గురించి మనం తరచుగా అనేక సలహాలు వింటాం. అయితే అవన్నీ నమ్మాల్సిన పనిలేదు. వీటి చుట్టూ ఉన్న అపోహలు మనల్ని గందరగోళంలో పడేస్తాయి. ఏది అనుసరించాలో అర్థం కాదు. అందువల్ల నిపుణుల సలహాలు తీసుకోవడమే మేలు చేస్తుంది.

మైసన్ డీ ఔరైన్ జనలర్ మేనేజర్ ఛార్లెస్ హారిసన్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలను పంచుకున్నారు. ఆధార సహిత అంశాలను వివరించారు.

జుట్టు పెరుగుదల రహస్యాలు

జుట్టు పెరుగుదల రహస్యాల గురించిన నిజాల్లో తెలుసుకోవల్సినది ఒకటి ఉంది. తరచూ హెయిర్ కట్ చేయించడం వల్ల వేగంగా పెరుగుతుందనుకోవడంలో నిజం లేదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో ఇది తోడ్పడుతుంది. చివర్ల పగుళ్లు లేకుండా నివారించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు కీలకమైనది మూలాలే. అందువల్ల మాడు (స్కాల్ప్) ఆరోగ్యంగా ఉండాలి. తగిన పోషణ అందివ్వాలి. అప్పుడే జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

2. జుట్టు రంగు కాపాడుకోవడం:

జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి. జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి. అప్పుడే మీ జుట్టు రంగుకు దీర్ఘాయుష్షు లభిస్తుంది.

3. హెయిర్ బొటాక్స్ గురించిన వాస్తవాలు

హెయిర్ బొటాక్స్ (కుదుళ్లలో కెరటిన్ నింపడం ద్వారా చేసే డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్) ఇటీవల చాలా పాపులారిటీ పొందింది. అయితే ఇది కేవలం తాత్కాలిక ఫలితాలనేనని గుర్తించడం ముఖ్యం. కావల్సిన ఫలితాల కోసం నిత్యం టచప్స్ అవసరం అవుతాయి.

4. డీప్ కండిషనింగ్ మాస్కుల గురించి:

డీప్ కండిషనింగ్ మాస్క్‌లు పొడి, పాడైన జుట్టు కోసం తరచూ వాడుతారు. అయితే రోజువారీగా కాకుండా వారానికోసారి మాత్రమే వీటిని వాడాలి. మాస్క్ ద్వారా వచ్చే పోషణ అందడానికి తగినంత సమయం ఇవ్వాలి. తగినంత తేమ ఉండే మాస్క్ వాడడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి.

5. లీవ్ ఇన్ సీరమ్ గురించి

ఇటీవలి కాలంలో లీవ్-ఇన్ సీరమ్ వాడకడం పెరిగిపోయింది. ఇవి జుట్టుకు షైనింగ్‌తో పాటు రక్షణ ఇస్తాయి. వీటిని సరిగ్గా వాడితే జిడ్డులా అనిపించదు. కొద్దిమొత్తంలో మీ జుట్టు చివరలకు అప్లై చేయాలి. జుట్టు కుదుళ్లను వదిలేయాలి.

6. సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడం:

సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మానికి హానికరమని మనకు అందరికీ తెలుసు. అయితే జుట్టుకు కూడా యూవీ కిరణాల నుంచి రక్షణ అవసరం. లేదంటే జుట్టు పొడిబారుతుంది. ఫేడ్ అవుతుంది. అందువల్ల అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ ఇచ్చే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలి.

టాపిక్

తదుపరి వ్యాసం