తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Biryani Leaves : ఇంట్లో ఈ 2 ఆకులు కాల్చండి.. 10 నిమిషాల తర్వాత మ్యాజిక్ చూడండి

Biryani Leaves : ఇంట్లో ఈ 2 ఆకులు కాల్చండి.. 10 నిమిషాల తర్వాత మ్యాజిక్ చూడండి

Anand Sai HT Telugu

28 January 2024, 16:30 IST

    • Bay Leaf Health Benefits : బిర్యానీ ఆకులను ఆహారంలో వాసన, రుచిని పెంచడానికి ఉపయోగిస్తాం. ఇందులో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని కాల్చడం ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు (Unsplash)

బిర్యానీ ఆకులు

భారతీయ బిర్యానీ.. బే ఆకులు లేకుండా చూడలేం. ఇటువంటి బిర్యానీ ఆకులను ఆహారంలో వాసన, రుచిని పెంచడానికి ఉపయోగించవచ్చు. ఇందులో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ బిర్యానీ ఆకును ఆహారంలో మాత్రమే కాకుండా, ఇంట్లో ప్రసరించే గాలిని శుద్ధి చేసేందుకు కూడా వాడుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు..

ట్రెండింగ్ వార్తలు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

బిర్యానీ ఆకును కాల్చిన తర్వాత దాని నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఇంట్లో 1-2 బిర్యానీ ఆకులను కాల్చితే, ఇంట్లో గాలి శుభ్రంగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. బిర్యానీ ఆకులలో యూజినాల్, మైర్సీన్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. బిర్యానీ ఆకులను కాల్చిన తర్వాత, దాని వాసన మెదడు నరాలను రిలాక్స్ చేస్తుంది. ఆందోళన తగ్గిస్తుంది. బిర్యానీ ఆకుల తేలికపాటి పొగ అలెర్జీ బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముక్కు, గొంతులో మంటను తగ్గిస్తుంది.

ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం దొరుకుతుంది. బిర్యానీ ఆకుల్లో లినాలూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించగలదు. మీరు కొంత ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపిస్తే మీ పడకగదిలో 2 బిర్యానీ ఆకులను కాల్చండి. దాని పొగను 10 నిమిషాలు పీల్చుకోండి. మీరు మునుపటి కంటే మంచి మార్పును చూస్తారు. బిర్యానీ ఆకులను కాల్చి ముక్కు దగ్గరగా పెట్టకూడదు. పొగను నేరుగా కావాలని కూడా పీల్చకూడదని గుర్తుంచుకోవాలి.

మీ ఇంట్లో దుర్వాసన వస్తుంటే బిర్యానీ ఆకులు ఎంతగానో సహకరిస్తాయి. దుకాణాల్లో విక్రయించే ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్‌లను కొని వాడే బదులు బిర్యానీ ఆకులను వాడటం మంచిదే. స్టోర్లలో అనేక రకాల ఎయిర్ ఫ్రెషనర్లు రసాయనాలు, కృత్రిమ సువాసనలతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఇది పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. సహజసిద్ధమైన బిర్యానీ ఆకులను ఇంట్లోనే కాల్చితే.. దాని వాసన ఇంటిని శుద్ధి చేస్తుంది. మంచి మూడ్‌ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది.

బిర్యానీ ఆకులను కాల్చే విధానం

ముందుగా ఒక పాత్రలో బాగా ఎండిన 2-3 బిర్యానీ ఆకులను తీసుకోండి. ఇంట్లోని కిటికీ, ద్వారం మూసి బిర్యానీ ఆకుల్లో నిప్పుపెట్టి గదిని మూసేసి బయటకు రావాలి. 10 నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి శ్వాస పీల్చుకోవాలి. ఇలా 5-7 సార్లు ఆ గదిలోకి వెళ్లండి. మీరు మీ శరీరంలో మార్పును అనుభవిస్తారు. కాల్చుతూ అక్కడే ఉండకూడదు. కాసేపటి తర్వాతనే రావాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.

తదుపరి వ్యాసం