తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bsnl బ్రాడ్‌బ్యాండ్: నెలకు 4tb డేటా, 300mbps వేగం.. మొదటి నెల 90% వరకు తగ్గింపు!

BSNL బ్రాడ్‌బ్యాండ్: నెలకు 4TB డేటా, 300Mbps వేగం.. మొదటి నెల 90% వరకు తగ్గింపు!

HT Telugu Desk HT Telugu

24 June 2022, 15:21 IST

    • BSNL ఆకర్షిణియమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫ్లాన్స్ ఇతర నెట్‌వర్క్ కంపెనీల కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తోంది. సూపర్ స్వీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌ కోసం ఎదురు చూసేవారికి, BSNL అందిస్తున్న గ్రెట్ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుకుందాం
BSNL బ్రాడ్‌బ్యాండ్
BSNL బ్రాడ్‌బ్యాండ్

BSNL బ్రాడ్‌బ్యాండ్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో (ISPలు) ఒకటి. భారత్ ఫైబర్ బ్రాండ్ ద్వారా, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కూడా తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఆకర్షిణియమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కలిగి ఉంది, ఈ ఫ్లాన్స్ ఇతర నెట్‌వర్క్ కంపెనీల కంటే ఎక్కువ ప్రయోజనాలతో వస్తాయి. సూపర్ స్వీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌ కోసం ఎదురు చూసేవారికి, BSNL అందిస్తున్న గ్రెట్ ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుకుందాం. వాటిలో డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

4TB డేటా 300Mbps వేగంతో BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో, వినియోగదారులు 300 Mbps వేగం పొందుతారు. డౌన్‌లోడ్ అప్‌లోడ్ రెండింటికీ ఇంటర్నెట్ వేగం సుష్టంగా ఉంటుంది. ప్లాన్ ధర రూ. 1,499 (ప్రస్తుతం పన్నుతో సహా లేదు)గా ఉంది. దీనితో పాటు, వినియోగదారులు ప్రతి నెలా 4TB FUP డేటాను పొందుతారు. ఇది ఇతర నెట్‌వర్స్‌ల నుండి పొందే డేటా కంటే చాలా ఎక్కువ. ఇది కాకుండా ఈ ప్లాన్‌లో డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. Disney + Hotstar ప్రీమియం ధర ఏడాదికి రూ. 1,499 కాగా.. కానీ ఈ, ప్లాన్‌లో, సబ్‌స్క్రిప్షన్‌ పూర్తిగా ఉచితంగా పొందుతారు.

ఇది మాత్రమే కాదు, కాల్స్ చేయడానికి ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఉచిత ఫిక్స్‌డ్ లైన్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. కానీ టెలిఫోన్ డివైజ్‌లను మాత్రం కస్టమర్ కొనుగోలు చేయాలి. వినియోగదారులకు మొదటి నెల బిల్లుపై రూ.500 వరకు అంటే 90% తగ్గింపును అందిస్తుంది.

BSNL ఇతర 300Mbps ప్లాన్‌లు

BSNL ఇతర 300Mbps స్పీడ్‌తో కలిగిన ప్లాన్‌లను కూడా అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్‌లు ఎలాంటి OTT ప్రయోజనాలను ఉండవు. వాటి నెలవారీ ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ FUP డేటాను అందించడం కారణంగా ఇది అధిక ధరతో ఉంటుంది . రూ. 2499, రూ. 4499 ప్లాన్‌లతో, వినియోగదారులు 5TB, 6.5TB నెలవారీ డేటాను పొందుతారు. పెద్దయెత్తున ఇంటర్నెట్‌ వినియోగించే పెద్ద సంస్థలు లేదా లైబ్రరీలకు ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉంటుంది. ఈ ఖరీదైన ప్లాన్‌లో FUP డేటాను వినియోగించిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్‌ వేగంగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం