తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Internet Explorer Retirement | గుడ్ బై `ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్`

internet explorer retirement | గుడ్ బై `ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్`

14 June 2022, 19:49 IST

నెటిజ‌న్ల‌ను వెబ్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన తొలి బ్రౌజ‌ర్ `ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్` రేప‌టి నుంచి, అంటే జూన్ 15, 2022 నుంచి క‌నుమ‌రుగు కానుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన ఈ బ్రౌజ‌ర్ తో వెట‌ర‌న్ నెటిజ‌న్ల‌కు ఎన్నో మ‌రుపురాని జ్ఞాప‌కాలున్నాయి. ముఖ్యంగా 1990ల్లో ఇదే వెబ్ ప్ర‌పంచానికి ఉన్న ఏకైక విండో. సో, రేప‌టి నుంచి ఈ `ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్` రిటైర్ కానుంద‌నే వార్త వారిని గ‌తంలోకి తీసుకువెళ్లింది. ఈ వార్త‌పై ఇప్ప‌టికే మీమ్‌లు వెల్లువెత్తాయి. కొన్ని భావోద్వేగంతో, మ‌రికొన్ని స‌ర‌దాగా ఉన్నాయి. `ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్` ఇంట‌ర్నెట్ సేవ‌లు దాదాపు 27 ఏళ్లు కొన‌సాగడం విశేషం.