తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Fried Rice : స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి?

Corn Fried Rice : స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి?

HT Telugu Desk HT Telugu

10 April 2023, 6:30 IST

    • Breakfast Recipes : మీరు ఫ్రైడ్ రైస్‌ను ఇష్టపడితే, మీరు అనేక రుచులలో దీన్ని ఆస్వాదించవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల రుచుల్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి తెలుసుకోండి.
స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్
స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్

స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్

రోజూ ఒకేలాగా తింటే.. బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్టులోకి కొత్తగా ట్రై చేయండి. ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్ తయారు చేసుకుని తినండి. అందుకే.. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోండి. అలాగే పోషకాలు, ఫైబర్ రిచ్ ఫుడ్ నోరూరిస్తుంది. స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Meaning of Moles: మీ ముఖంలో వివిధ చోట్ల ఉండే పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వాన్ని చెబుతాయి

Soya Dosa: టేస్టీ సోయా దోశ రెసిపీ, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

కావలసినవి పదార్థాలు

బాస్మతి రైస్-1 కప్పు, స్వీట్ కార్న్-1 కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి

ముందుగా బియ్యాన్ని నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాడ ఉడికించాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికించాలి. పాన్ వేడి చేసి నూనె వేసి, నూనె వేడయ్యాక ఉల్లిపాయ వేసి 2 నిమిషాలు వేగించాలి. స్వీట్ కార్న్ వేసి హై ఫ్లేమ్ లో వేయించాలి. తర్వాత 2 చెంచాల వెనిగర్, 2 చెంచాల సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసి 30 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉడికిన అన్నం వేసి మిక్స్ చేస్తే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ కలిపితే మరింత రుచిగా ఉంటుంది. తక్కువ గ్యాస్ మంట మీద ఉడికించాలి.

మొక్కజొన్న రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని(Skin and Hair) కాపాడుకోవడంలో స్వీట్ కార్న్(Sweet Corn) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మొక్కజొన్న(Corn) తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పీచు, తక్కువ కొవ్వు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు మాంగనీస్, విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇది మీకు చాలా శక్తిని ఇస్తుంది. ఇది మీ శరీరంలోని కొవ్వును(Body Cholesterol)తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్ సి(Vitamin C), థయామిన్, నియాసిన్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి మీ జుట్టు, చర్మ ఆరోగ్యానికి(Hair and Skin Health) చాలా మేలు చేస్తాయి.

తదుపరి వ్యాసం