తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jowar Khichdi Recipe : జొన్న కిచిడి.. ఇలా తయారు చేయాలి

Jowar Khichdi Recipe : జొన్న కిచిడి.. ఇలా తయారు చేయాలి

HT Telugu Desk HT Telugu

01 March 2023, 6:30 IST

    • Jowar Khichdi Recipe : జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు. ఉదయం పూట తీసుకుంటే.. ఇంకా మంచిది. మార్నింగ్ టైమ్ లో కాస్త వెరైటీగా జొన్న కిచిడి ట్రై చేయండి.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్

జొన్నలను ఆహారంగా తీసుకుంటాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. జొన్నలతో రొట్టె, అన్నం, సంగటి వంటి వాటిని తయారుచేసుకుంటాం. పూర్వకాలం నుంచి చిరుధాన్యాలైన జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బలంగా ఉండేందుకు తీసుకునే ఆహారంలో ఇది ముఖ్యమైనది. అయితే ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా.. కొత్తగా జొన్న కిచిడి తయారు చేయండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి తీసుకోవడం ఎంతో ఆరోగ్యం. జొన్నలతో కిచిడి తయారు చేసుకోవడం కూడా సులభమే. ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? మీ కోసం..

కావాల్సినవి..

నాన‌బెట్టిన జొన్న ర‌వ్వ-ఒక క‌ప్పు, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర-ఒక టీ స్పూన్, ల‌వంగాలు-4, దాల్చిన చెక్క-1, బిర్యానీ ఆకు-2, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి తరిగినవి కొన్ని, అల్లం-ఒక టీ స్పూన్, ప‌చ్చి బ‌ఠాణీ-అర క‌ప్పు, క్యారెట్ ముక్కలు-1, ప‌సుపు-పావు టీ స్పూన్, నాన‌బెట్టిన పెస‌ర్లు-పావు క‌ప్పు, నీళ్లు-3 క‌ప్పులు, ఉప్పు-త‌గినంత‌, కొత్తిమీర కొంచెం.

తయారీ విధానం

మెుదట కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వెయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత అల్లం వేసుకోవాలి. అనంతరం బఠాణీ, క్యారెట్ వేసి మూత పెట్టాలి. కొంత సేపు వేయించుకున్న తర్వాత.. మూత తీసి పసుపు, పెసర్లు వేసి కలపాలి. ఇప్పుడు మళ్లీ మూతపెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగాక నానబెట్టిన రవ్వ వేయాలి.

ఇప్పుడు మూత పెట్టి.. కొంచెం మంట మీద ఓ పది, పదిహేను నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే.. మరికొన్ని నీళ్లు పోసుకోవచ్చు. రవ్వను మంచిగా ఉడికించాక.. కొత్తిమీర వేసి స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. టెస్టీ టెస్టీ జొన్న కిచిడి రెడీ అయినట్టే. అల్పాహారంలోకి జొన్న రవ్వ కిచిడిని తయారు చేసుకుంటే.. హెల్తీ కూడా.

టాపిక్

తదుపరి వ్యాసం