తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bottle Gourd Dosa Recipe। సోరకాయ పెసరిపప్పు దోశ..బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్!

Bottle Gourd Dosa Recipe। సోరకాయ పెసరిపప్పు దోశ..బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్!

HT Telugu Desk HT Telugu

16 August 2023, 6:06 IST

    • Bottle Gourd Dosa Recipe: బరువు తగ్గుతూనే మీరు మీకు ఇష్టమైన దోశలు తినాలనుకుంటే, సోరకాయ దోశ మీకు చక్కని పరిష్కారం. ఇది మీ శరీరానికి కావల్సిన మొత్తంలో ప్రోటీన్లు, పీచుపదార్థాలతో పాటు పిండి పదార్థాలు అందిస్తుంది.
Bottle Gourd Dosa Recipe:
Bottle Gourd Dosa Recipe: (istock)

Bottle Gourd Dosa Recipe:

Healthy Breakfast Recipes: మనమందరం బరువు తగ్గడానికి అనేక ఉపాయాలు ప్రయత్నించినప్పటికీ, రుచికరమైన ఆహార పదార్థాలపై కోరికలను అణిచివేసుకోవడంలో విఫలం అవుతాం. బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కఠినమైన భోజన ప్రణాళికలకు కట్టుబడి ఉండటం ముఖ్యం. కొన్నిసార్లు శారీరక శ్రమ చాలానే చేస్తారు, కానీ రుచికరమైన భోజనం కూడా నిండుగా చేస్తారు. దీంతో బరువు తగ్గకపోగా పెరుగుతారు.

అయితే, మీరు రుచికరమైన ఆహారాలు తినకుండా ఉండలేకపోతే, మీకు ఇష్టమైన ఆహారాలను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవాలి. ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా.. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం కచ్చితంగా తినాలి, అది కూడా మీ బరువును తగ్గించడంలో సహాయపడాలి. ఇక్కడ అలాంటి అల్పాహారం సోరకాయ దోశ రెసిపీని అందిస్తున్నాం. బరువు తగ్గుతూనే మీరు మీకు ఇష్టమైన దోశలు తినాలనుకుంటే, సోరకాయ దోశ మీకు చక్కని పరిష్కారం. ఇది మీ శరీరానికి కావల్సిన మొత్తంలో ప్రోటీన్లు, పీచుపదార్థాలతో పాటు పిండి పదార్థాలు అందిస్తుంది.

Bottle Gourd Dosa Recipe కోసం కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు పెసరిపప్పు
  • 1/2 కప్పు బియ్యం పిండి
  • 1/2 కప్పు సోరకాయ ముక్కలు
  • 2 పచ్చిమిర్చి
  • 1/4 కప్పు కొత్తిమీర
  • 1/2 అంగుళం
  • రుచికి తగినంత ఉప్పు
  • కొద్దిగా నూనె

సోరకాయ పెసరిపప్పు దోశ తయారీ విధానం

  1. ముందుగా పెసరిపప్పు, బియ్యంను కలిపి 4 గంటల పాటు నీటిలో నానబెట్టండి.
  2. అనంతరం ఈ బియ్యం పప్పు మిశ్రమం, సోరకాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఒక మిక్సర్ బ్లెండర్‌లో వేసి కొన్ని నీళ్లను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేయండి.
  3. ఈ పేస్ట్ మెత్తని బ్యాటర్ అయ్యేలాగా ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
  4. ఆ తర్వాత తవాను వేడి చేయండి, దానిపై నూనెను చిలకరించి అది వేడయ్యాక గరిటెతో పిండిని తీసుకొని దోశలను వేసుకోండి.
  5. దోశలు క్రిస్పీగా, ముదురు గోధుమ రంగులోకి మారేంతవరకు కాల్చండి.
  6. అంతే వేడివేడి సోరకాయ పెసరిపప్పు దోశ రెడీ.

మీకు నచ్చిన చట్నీతో కలిపి సర్వ్ చేసుకోండి.

తదుపరి వ్యాసం