తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అదిరిపోయే లగ్జరీ కార్.. Bmw X4 ఇండియాలో విడుదల, స్పెసిఫికేషన్లు ఇవే!

అదిరిపోయే లగ్జరీ కార్.. BMW X4 ఇండియాలో విడుదల, స్పెసిఫికేషన్లు ఇవే!

HT Telugu Desk HT Telugu

11 March 2022, 14:51 IST

    • లగ్జరీ కార్‌మేకర్ బీఎండబ్ల్యూ BMW X4 కారును విడుదల చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 70.5 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
BMW X4 launched in India
BMW X4 launched in India (Stock Photo)

BMW X4 launched in India

Chennai | జర్మన్‌కు చెందిన లగ్జరీ కార్‌మేకర్ బీఎండబ్ల్యూ ఇండియాలో వరుసపెట్టి వివిధ రకాల కార్లను విడుదల చేస్తుంది. ఈ ఏడాది జనవరిలో X3 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది ఆ తర్వాత నెలలో X3 డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు BMW X4 కారును విడుదల చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభ్యంకానుంది. పెట్రోల్ వేరియంట్ X4 xDrive30i కారు ధర రూ. 70.5 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, డీజిల్ వేరియంట్ BMW X4 xDrive30d కారు ధర రూ. 72.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇవి ఎక్స్-షోరూం ధరలుగా ఇక్కడ గుర్తించాలి.

ట్రెండింగ్ వార్తలు

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

Hair Fall Causes: అకస్మాత్తుగా జుట్టు రాలిపోతోందా? అయితే ఇవి కారణాలు కావచ్చు, ఓసారి చెక్ చేసుకోండి

Parenting Tips : ఏడాదిలోపు పిల్లలకు ఆవు పాలు తాగిస్తే మంచిది కాదు.. గుర్తుంచుకోండి

BMW X4 కార్ బ్లాక్ సఫైర్, ఎమ్ బ్రూక్లిన్ గ్రే మెటాలిక్ పెయింట్‌వర్క్స్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభ్యంఅవుతుంది. ఈ కార్ డిజైన్ పరంగా చూస్తే స్వల్ప మార్పులు మినహా దాదాపు అంతకు ముందు వచ్చిన X3 వెర్షన్ కారులాగే కనిపిస్తుంది. కిడ్నీ గ్రిల్, ఫ్లాటర్ అడాప్టివ్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌లు, ఫ్రంట్ ఆప్రాన్‌ సహా ఇంటీరియర్ డిజైన్ లాంటి చాలా డిజైన్ ఎలిమెంట్‌లను BMW X3 నుంచి తీసుకున్నారు. అయితే వాలుగా ఉండే రూఫ్‌లైన్, అల్యూమినియం రాంబికల్‌డార్క్ M ఇంటీరియర్ కొత్తగా ఉన్నాయి.

ఇంటీరియర్ సెటప్

ఇంటీరియర్ లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, మెమరీ ఫంక్షన్‌తో సీట్ల కోసం ఎలక్ట్రికల్ సర్దుబాటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెల్‌కమ్ లైట్ కార్పెట్ వంటి సదుపాయాలతో వస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ వంటి సెటప్స్ ఉన్నాయి.

ఇంజన్ కెపాసిటీ

ఈ కారు కెపాసిటీ విషయానికి వస్తే BMW X4 xDrive30i 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 248 bhp వద్ద 350 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే కేవలం 6.6 సెకన్లలోనే సున్నా నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.

ఇక, X4 xDrive30d 3.0-లీటర్, 6-సిలిండర్, డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 261 bhp వద్ద 620 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 5.8 సెకన్లలో సున్నా నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు.

తదుపరి వ్యాసం