తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఏకాంతాల ఒడిలో స్వేచ్ఛగా..! భారత్‌లో బెస్ట్ వెడ్డింగ్, హనీమూన్ డెస్టినేషన్స్ ఇవే!

ఏకాంతాల ఒడిలో స్వేచ్ఛగా..! భారత్‌లో బెస్ట్ వెడ్డింగ్, హనీమూన్ డెస్టినేషన్స్ ఇవే!

28 February 2022, 16:52 IST

    • కొత్తగా పెళ్ళైన దంపతులు ఏకాంత సమయాన్ని కోరుకోవడం సహజం. ప్రపంచానికి దూరంగా రెక్కలు కట్టుకుని చూట్టుకు రావాలనే కోరిక న్యూ కపుల్స్‌కు ఉంటుంది. అలా హనీమూన్ పేరుతో ఏకాంతంగా గడుపుతుంటారు. పెళ్ళి ,హనీమూన్ దంపతులకు జీవితంలో ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.
నూతన వధూవరులు
నూతన వధూవరులు (REUTERS)

నూతన వధూవరులు

వివాహం అనేది సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల ప్రత్యేక సమ్మేళనం. ఏ వ్యక్తి జీవితానికైనా ఈ ఘట్టం చాలా ముఖ్యం. భిన్న కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన ఇద్దరూ వ్యక్తులకు వివాహా బంధం..  జీవిత ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. మూడు ముళ్లతో ఏడడగులు వేయించి దాంపత్య జీవితానికి నాంది పలుకుతుంది. ఆ తర్వాత ఆలు, మగాల బంధానికి మెుదటి అడుగు ఏకాంతమే. నూతన దంపతుల జీవితంలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఆ సమయం చాలా ముఖ్యం.

కొత్తగా పెళ్ళైన దంపతులు ఏకాంత సమయాన్ని కోరుకోవడం సహజం. ప్రపంచానికి దూరంగా రెక్కలు కట్టుకుని చూట్టుకు రావాలనే కోరిక న్యూ కపుల్స్‌కు ఉంటుంది. అలా హనీమూన్ పేరుతో నూతన జంటలు ఏకాంత సమాయాన్ని గడుపుతుంటాయి. పెళ్ళి ,హనీమూన్ దంపతులకు జీవితంలో ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. అలా దంపతుల కోసం చాలా వెడ్డింగ్, హనీమూన్ డెస్టినేషన్‌లు వేచి చూస్తున్నాయి. అయితే కొవిడ్ కారణంగా విదేశీ స్పాట్‌లకు వెళ్ళడం కొంచెం రిస్క్‌తో కూడుకున్న విషయం. కాబట్టి ఇండియాలోనే  ఒకే ప్రదేశంలో బెస్ట్ వెడ్డింగ్‌,హనీమూన్ డెస్టినేషన్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఉదయపూర్( Udaipur – Venice Of The East)

రాజస్థాన్ లోని అత్యంత అందమైన,అద్భుతమైన ప్రదేశాలలో ఉదయపూర్ ఒకటి. ఇక్కడ కోటలు, కట్టడాలు నాటి రాచరికపు వైభవాన్ని చాటి చెబుతాయి. వివాహా వేడుక వైభోగంగా జరగాలని కలలు కనే వారికి ఉదయపూర్ మంచి ఆప్షన్. ఈ నగరంలోని ప్యాలెస్‌లు ఎంతో అందంగా, విలాసవంతంగా ఉంటాయి. ది లీలా, ది తాజ్ లేక్ ప్యాలెస్, ది ట్రైడెంట్ లాంటి రాజభవనాలు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి. పెళ్ళి తర్వాత హనిమూన్‌ కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న జలపాతాలు, అందమైన పూల వనాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి.

జైపూర్ (Jaipur – Culture At Par)

రాయల్ లుక్ వివాహాల కోసం ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చే పేర్లలో రాజస్థాన్ రాజధాని జైపూర్ ఒకటి. జైపూర్‌ ప్యాలెస్‌లకు పెట్టింది పేరు. వివాహ వేదికలలో రెండు కుటుంబాలు సంతోషంగా గడిపేందుకు ఇది మంచి ఆప్షన్. రాచరిక సంప్రదాయంలో వివాహా వేడుకలను ఇక్కడ జరుపుకోవచ్చు. జై మహల్ ప్యాలెస్,అంబర్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్, హవా మహల్, జంతర్ మంతర్ ఇక్కడ ప్రసిద్ది చెందినవి.

ఆగ్రా: (Agra – City Of Love)

ఉత్తమ వివాహ గమ్యస్థానాల కోసం వెతుకుతున్నవారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని ప్రదేశం ఆగ్రా ఒకటి . ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితాంతం తమ వివాహాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి ఆగ్రా బెస్ట్ ఆప్షన్. ఇటీవల కాలంలో చాలామంది ఆగ్రాను తమ వివాహ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. 

కేరళ( Kerala)

కేరళ అందమైన పకృతి సౌందర్యానికి, బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. భూతల స్వర్గంగా పేరొందిన కేరళ కాబోయే కపుల్స్‌కు ఎప్పటికీ మెుదటి ఆప్షనే. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇష్టపడే దంపతుల కోసం ఇక్కడ ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి . ఇక్కడ బీచ్‌లు కూడా నవ దంపతులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా కేరళ సంప్రదాయంలో వివాహాం చేసుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వివాహాలకే కాకుండా హనిమూన్‌కు కూడా ఇది మంచి ఎంపిక.

అండమాన్ & నికోబార్:

అండమాన్ & నికోబార్ దీవులు ఇండియాలో అత్యుత్తమైన వివాహా, హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి. ఈ ప్రదేశం మిమ్మల్ని ఎప్పటికి నిరాశపరచని డెస్టినేషన్‌. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, బీచ్ రిసార్ట్‌లు ఇక్కడ ప్రత్యేకమైనవి. అక్టోబర్ నుండి జూన్ వరకు ఈ టూర్ అనుకూలంగా ఉంటుంది.

మనాలి(Manali): 

ఇండియా స్విట్జర్లాండ్‌గా పేరొందిన మనాలి కాబోయే నవ దంపతులకు ఎప్పటికీ ఫేవరెట్ స్పాటే. మంచుతో కప్పబడిన పర్వతాలతో పాటు సుందరమైన పకృతి అందాల నడుమ వివాహ వేడుకలు ఘనంగా జరుపుకోవచ్చు. అంతేకాకుండా ఇది కపూల్స్‌కు ఎక్కువగా నచ్చే హనీమూన్ ప్రదేశం కూడా. ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, క్యాంపింగ్ ఇక్కడి ప్రత్యేకతలు. మనాలికి విమాన సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అక్టోబర్ నుండి జూన్ వరకు ఇక్కడ పర్యటించడానికి అనుకూలం. 

తదుపరి వ్యాసం