తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Cooler | సమ్మర్​లో రిఫ్రెష్​మెంట్ డ్రింక్.. కూల్ చేసే కొకొనట్ కూలర్

Coconut Cooler | సమ్మర్​లో రిఫ్రెష్​మెంట్ డ్రింక్.. కూల్ చేసే కొకొనట్ కూలర్

HT Telugu Desk HT Telugu

05 April 2022, 15:05 IST

    • వేసవి వచ్చేసింది. గంటకొకసారి కూల్‌గా ఏదో ఒకటి తాగాలనిపించే కాలం ఇది. మన గొంతులు ఎండిపోయే సమయం కూడా ఇదే. ఈ సమయంలోనే మనం డీహైడ్రేషన్‌కు గురవుతాము. ఈ క్రమంలో రోజంతా సిప్ చేయడానికి మనకు ఏదైనా మనకు కావాల్సిందే. ఈ వేసవి తాపాన్ని తగ్గించి.. ఆరోగ్యాన్ని అందించే పానీయం ఇక్కడ రెడీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి.
సమ్మర్ డ్రింక్
సమ్మర్ డ్రింక్

సమ్మర్ డ్రింక్

వేసవి కాలం మనకు చెమటలు పట్టేలా చేస్తుంది. ఈ సమయంలో శరీరం తనను తాను రీహైడ్రేట్ చేసుకోవాలని చూస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన పోషకాలను మనం శరీరానికి అందిస్తూనే ఉండాలి. ఈ పోషకాలను అందించడానికి, వేడి నుంచి ఉపశమనం ఇవ్వడానికి కొబ్బరి కూలర్ మీకు సహాయంచేస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చుద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

కావాల్సిన పదార్థాలు

* కొబ్బరి నీరు- 2 కప్పులు

* 1/2 నిమ్మకాయ- పై తొక్కతో

* నారింజ - 1

* తేనె - 1 టేబుల్ స్పూన్

* ఐస్ క్యూబ్స్ - 3 లేదా 4

తయారీ విధానం

నారింజ తొక్క తీసి.. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ కలపి బ్లెండర్​లో వేయాలి. దానిలో తేనె, ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేయాలి. ఇది మెత్తగా బ్లెండ్ అయిన తర్వాత వడకట్టాలి. అనంతరం కొబ్బరిలో వేసి దానిని సర్వ్ చేసుకోవాలి.

ఆరోగ్య ప్రయోజనాలు..

నారింజ, దానిపై తొక్క, తేనె, నిమ్మకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, సోడియం కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో కూడా పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుతాయి. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. సమ్మర్​లో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం