తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pre Workout Diet : వర్కౌట్​ చేసేముందు వీటిని అస్సలు తినకండి.. ఎందుకంటే..

Pre Workout Diet : వర్కౌట్​ చేసేముందు వీటిని అస్సలు తినకండి.. ఎందుకంటే..

12 August 2022, 8:57 IST

    • కొన్నిసార్లు వ్యాయామం చేయడానికి ఓపిక సరిపోదు. అలా అని కాకపోయినా మిమ్మల్ని మీరు వ్యాయామానికి సిద్ధం చేసుకోవడానికి ప్రీవర్కౌట్ అల్పాహారం తీసుకోవాలి. అయితే ఫుల్​గా తినేసి వర్కౌట్​ చేయడం కాదు. సరైన ఆహారాన్ని ఓ గంట ముందు తీసుకోవాలి. లేదంటే జిమ్​ అయిన తర్వాత తినాలి. అయితే ప్రీ వర్కౌట్​ అల్పాహారంగా కొన్ని ఆహారాలు తీసుకోవద్దు అంటున్నారు జిమ్ నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
pre workout diet
pre workout diet

pre workout diet

Pre Workout Diet : మీ శరీరానికి ఆజ్యం పోయడానికి, వ్యాయామానికి సిద్ధం చేయడానికి మీ ప్రీ-వర్కౌట్ అల్పాహారం అనేది రోజులోనే ముఖ్యమైన భోజనం. ఏది ఏమైనప్పటికీ మీరు కరెక్ట్​ ఆహారం తీసుకోకపోతే ఉబ్బరం, నీరసంగా అనిపించవచ్చు. అయితే వ్యాయామం ఎప్పుడు చేసినా.. కరెక్ట్ ఆహారాన్ని.. గంట ముందు తీసుకోవాలి అంటున్నారు జిమ్ నిపుణులు. మరి జిమ్​కి వెళ్లే ముందు వేటిని తినకూడదో చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

గుడ్లు

గుడ్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా పూర్తిగా ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. పుష్కలంగా విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇది జిమ్ చేసేవారికి సరైన ఎంపిక కూడా. అయినప్పటికీ.. అవి సమతుల్య శక్తిని అందించడానికి తగినంత పిండి పదార్థాలను కలిగి లేనందున.. అవి సరైన వ్యాయామానికి ముందు తీసుకోవడం కరెక్ట్ కాదు.

వ్యాయామానికి ముందు వాటిని తినడం వల్ల విరేచనాలు లేదా కడుపు తిమ్మిరి ఏర్పడవచ్చు. మీ శరీరం వాటిని నెమ్మదిగా జీర్ణం చేయడం వల్ల మీరు కూడా కాస్త బద్దకంగా ఫీల్ అవుతారు.

అవకాడోలు

సూపర్‌ఫుడ్ అయినప్పటికీ.. మంచి మోనో-శాచురేటెడ్ కొవ్వులతో నిండినప్పటికీ.. అవోకాడోస్‌లో అధిక కొవ్వు పదార్థం ఉన్నందున వ్యాయామానికి ముందు వాటిని తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు. అవకాడోస్‌లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది పూర్తిగా జీర్ణం కావడానికి శరీరానికి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

అందుకే మీరు వ్యాయామం చేసే మూడు గంటల ముందు అవకాడోలు తీసుకోకపోవడమే మంచిది. జిమ్​కి వెళ్లేముందు వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అలసట వస్తుంది. ఎందుకంటే మీ శరీరం జీర్ణక్రియకు తోడ్పడటానికి దాని శక్తిని ఉపయోగిస్తుంది.

ప్రోటీన్ బార్లు

మీరు కొనుగోలు చేసిన ప్రోటీన్ బార్‌లు సాధారణంగా కేలరీలు, చక్కెర, కృత్రిమ స్వీటెనర్‌లతో నిండి ఉంటాయి. ఇవి చెప్పుకునే అధిక మొత్తంలో ప్రోటీన్‌ను కలిగి ఉండవు.

వ్యాయామానికి ముందు ప్రోటీన్ బార్‌లను తినడం వల్ల మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు మీ రక్తంలో చక్కెర కొంత సమయం తర్వాత పడిపోతుంది. అయితే మీరు ప్రోటీన్ కంటెంట్‌ను తీసుకోవాలనుకుంటే.. సహజమైనవి తీసుకోవచ్చు.

స్మూతీస్

స్మూతీలు మీకు సహజమైన ప్రీ-వర్కౌట్ బూస్ట్‌ను అందించగలవని మీరు అనుకుంటే అది తప్పే. కొనుగోలు చేసిన స్మూతీలు అంత ఆరోగ్యకరమైనవి కావు. షుగర్, క్యాలరీలతో నిండి ఉంటాయి.

అవి మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అధిక మొత్తంలో త్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను కూడా కలిగి ఉంటాయి.

కాలీఫ్లవర్, బ్రోకలీ

కూరగాయలు ఆరోగ్యానికి మంచివి. పైగా ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వ్యాయామానికి ముందు మాత్రం ఇవి కచ్చితంగా మంచి ఎంపిక కాదు.

క్యాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్ మొలకలు వంటి క్రూసిఫరస్ కూరగాయలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి వ్యాయామం చేసేప్పుడు అసౌకర్యంగా ఉంటాయి. వర్కవుట్‌కు ముందు వాటిని తినడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. బదులుగా తేలికగా ఉండే బంగాళదుంపలను తీసుకోవచ్చు.

మరి వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వ్యాయామానికి ముందు అవసరమైన, నాణ్యమైన పిండి పదార్థాలు తీసుకోవాలి. ఇవి ప్రోటీన్‌ల కలయికతో ఉంటే ఇంకా మంచిది అంటున్నారు ఫిట్​నెస్ నిపుణులు. వ్యాయామానికి గంట ముందు ఏమైనా తినాలకుంటే.. నాణ్యమైన కార్బోహైడ్రేట్​లు, తక్కువ మొత్తంలో ప్రొటీన్​లను తీసుకోవాలని సూచిస్తున్నారు. జిమ్​కి వెళ్లే గంట ముందు పీనట్​ బటర్​తో యాపిల్ లేదా పండని అరటిపండు వంటివి మంచి ఎంపికని వెల్లడించారు. ్

టాపిక్

తదుపరి వ్యాసం