తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Trendy Designs With Old Saree : అమ్మాయిలు పాతచీరలతో.. కొత్త డ్రెస్​లను ఇలా డిజైన్ చేసేయండి..

Trendy Designs with Old Saree : అమ్మాయిలు పాతచీరలతో.. కొత్త డ్రెస్​లను ఇలా డిజైన్ చేసేయండి..

13 December 2022, 9:50 IST

    • Trendy Designs with Old Saree : చీరలు లేని వార్డ్ రోబ్ ఉండదనే చెప్పాలి. కానీ ఒక్కసారి కట్టేసిన చీరను.. వేరే ఫంక్షన్లకు కట్టుకుని వెళ్లలేమని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్కటే చీరతో వివిధ డిజైన్ల్ చేసుకుని.. వివిధ రకాల ఫంక్షన్లకు, డైలీవేర్​ డ్రెస్​లుగా ఉపయోగించవచ్చు అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
చీరతో ఈ డ్రెస్లు డిజైన్ చేయండి
చీరతో ఈ డ్రెస్లు డిజైన్ చేయండి

చీరతో ఈ డ్రెస్లు డిజైన్ చేయండి

Trendy Designs with Old Saree : అమ్మ చీర అనేది అందరికీ ఎమోషన్. అయితే మీ అమ్మగారు కట్టని పాత చీరలను.. లేదా మీరు కట్టకుండా పక్కన పెట్టేసిన చీరలను.. నేటి ట్రెండ్​కి అనుకూలంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ రిఫ్రెష్ అప్‌సైక్లింగ్ ఆలోచనలతో.. మీ పాత చీరలను అద్భుతంగా మార్చుకోవచ్చు. ట్రెడీషనల్​ నుంచి.. ఫ్యాషన్ దుస్తుల వరకు.. ట్రెండీగా మార్చడంలో చీరలు చాలా అనువైనవి అంటారు. ఇది వస్త్ర వ్యర్థాలను తగ్గించడమే కాకుండా.. మీ బడ్జెట్​ను కాపాడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Milk For Sleeping : నిద్ర మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. పడుకునేముందు ఇవి తాగండి

Duck Egg Benefits : వారానికో బాతు గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

రోజువారీ దుస్తులు

మీరు ఇకపై ధరించకూడదనుకునే పాత చీరను.. లేదా మీ అమ్మగారు వాడని చీరను పడేయకండి. దానితో మీరు రోజువారీ దుస్తులను డిజైన్ చేసుకోవచ్చు తెలుసా? మీరు దగ్గర్లోని దర్జీ దగ్గరకు వెళ్లి.. ఆ చీరతో మీకు ఇష్టమైన డిజైనర్ దుస్తుల మాదిరిగా కుట్టమని అడగండి. మీకు మిషన్ కుట్టడం వస్తే.. మీరే మీ సొంత డ్రెస్​ని చీరతో డిజైన్ చేసుకోవచ్చు. ఈ చీరతో మీరు మ్యాక్సీ డ్రెస్ లేదా అనార్కలి గౌను లేదా ఫ్లేర్డ్ మిడి డ్రెస్‌ డిజైన్ చేసుకోవచ్చు.

కుర్తీ బెస్ట్ ఆప్షన్..

మీరు కుర్తీ స్టైల్‌ని ఎప్పటినుంచో ప్రయత్నించాలనుకుంటే.. ఆ కుర్తీ మీ బడ్జెట్‌లో ఉండి.. ఎక్కువ ఖర్చు చేయకూడదనుకుంటే.. మీ పాత చీరల బెస్ట్ ఎంపిక. దానితో మీరు స్టైలిష్ కస్టమైజ్డ్ కుర్తీలను తయారు చేసుకోవచ్చు.

మీరు కాటన్, జార్జెట్ లేదా షిఫాన్ చీరలను కలిగి ఉంటే.. వాటిని సౌకర్యవంతమైన ఫ్రంట్ స్లిట్ స్టైల్​లో కుర్తీగా మార్చుకోవచ్చు. పాత సిల్క్ లేదా శాటిన్ చీరలను అందమైన వెడ్డింగ్ వేర్ కుర్తీలుగా మార్చుకోవచ్చు.

సౌకర్యవంతమైన కఫ్తాన్

మీ వార్డ్‌రోబ్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన అత్యంత సౌకర్యవంతమైన, వదులుగా ఉండే దుస్తులలో కాఫ్తాన్‌లు ఒకటి. మీరు ఈ తరహా డ్రెస్​ కావాలని అనుకుంటే.. మీ పాత కాటన్ చీరను తేలికైన, రిలాక్స్డ్-ఫిట్ కాఫ్తాన్ డ్రెస్‌గా మార్చుకోవచ్చు.

ప్రింట్లు, ఫన్నీ డిజైన్స్, హాల్ఫ్‌టోన్‌లు లేదా పూల మోటిఫ్‌లను కలిగి ఉన్న చీరలతో కాఫ్తాన్-శైలి కుర్తీలను తయారు చేయవచ్చు. ఇవి మీ లుక్​ మరింత పెంచుతాయి.

లెహంగా లేదా హాఫ్​ శారీ

మీరు మీ పాత కంజీవరం లేదా స్వచ్ఛమైన పట్టు చీరను లెహంగాగా మార్చుకోవచ్చు. కొన్ని సీక్విన్స్, ఎంబ్రాయిడరీ బార్డర్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ చీర బ్లౌజ్‌ని లెహంగాతో పెయిర్ చేయవచ్చు. దానికి మ్యాచింగ్ హాఫ్ శారీ తీసుకోవచ్చు. లేదా మీ క్లోసెట్‌లో లైట్ ఎంబ్రాయిడరీ దుపట్టా ఉంటే.. మీ ఔట్​ ఫిట్ రెడీ.

లేదంటే పాతకాలపు, మృదువైన రంగు లేదా వెల్వెట్ చీరలతో.. మీరు హాఫ్ శారీని డిజైన్ చేసుకోవచ్చు.

చక్కని స్కర్ట్

మీ పాత చీరను కొత్త డ్రెస్​గా మార్చడంలో స్కర్ట్ ముందంజలో ఉంటుంది. చీర నుంచి మీరు అదిరే ట్రెడీషనల్ స్కర్ట్‌ని తయారు చేసుకోవచ్చు. ఇది మీ వార్డ్‌రోబ్‌కి రిఫ్రెష్ టచ్ ఇస్తుంది. ఈ స్కర్ట్​కి మీరు ఫ్యాన్సీ టాప్​ని ఎంచుకోవచ్చు.

ఈ స్కర్ట్‌ను తయారు చేయడానికి మీరు పట్టు లేదా కాటన్ చీరలను ఉపయోగించవచ్చు. మీ జరీ-బోర్డర్ చీరతో పలాజో ప్యాంట్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. చిక్ ఇండో-వెస్ట్రన్ లుక్‌ని పూర్తి చేయడానికి మీకు ఇష్టమైన క్రాప్ టాప్‌ను వీటితో జత చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం