తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Niacinamide For Hair Health: నియాసినమైడ్‌తో జుట్టుకు 5 అద్భుతమైన ప్రయోజనాలు

Niacinamide for hair health: నియాసినమైడ్‌తో జుట్టుకు 5 అద్భుతమైన ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu

22 May 2023, 10:26 IST

    • జుట్టు సంరక్షణలో నియాసినమైడ్ అనే బీ3 విటమిన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు, అది వేటిలో లభిస్తుందో తెలుసుకోండి.
నియాసినమైడ్‌తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు
నియాసినమైడ్‌తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు (Freepik)

నియాసినమైడ్‌తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్న నిపుణులు

జుట్టు రాలడం, పలుచబడడం, జుట్టు డామేజ్ అవడం వంటి సమస్యలతో బాధపడే వారు దాదాపుగా అన్ని రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడి అలసిపోయి ఉంటాయి. ఇవేవీ ఫలించనప్పుడు మీరు తిరిగి సమస్యకు మూల కారణాలు వెతకాలి. ముఖ్యంగా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడే ముఖ్యమైన విటమిన్ బీ 3. దీనినే నియాసినమైడ్ అని కూడా అంటారు. మీ స్కాల్ప్‌పై ఇన్‌ఫ్లమేషన్‌ను నిరోధిస్తూ, రక్త ప్రసరణ పెంచుతూ, కెరటిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండడంలో ముఖ్యమైన ప్రోటీన్ కెరటిన్.

అయితే నియాసిన్ వేరు. నియాసినమైడ్ వేరు. ఇది మరొకరకమైన బీ3 విటమిన్. అయితే మీ శరీరంలో నియాసిన్ అధికంగా ఉన్నప్పుడు అది నియాసినమైడ్‌గా మారిపోతుంది.

నియాసినమైడ్ ఎక్కువగా మాంసం, పాలు, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాల్లో లభిస్తుంది. హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కూడా లభ్యమవుతుంది. అందువల్ల ఈ నియాసినమైడ్ విటమిన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గానీ, జుట్టుకు అప్లై చేసే ఉత్పత్తుల రూపంలో లభించే నియాసినమైడ్‌ రూపంలో గానీ తీసుకోవచ్చు.

‘జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నియాసినమైడ్ (విటమిన్ బీ3) జుట్టు ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని నికోటినమైడ్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. ప్రొటీన్స్, లిపిడ్స్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కణశక్తిని పెంపొందిస్తుంది. శరీరం వినియోగించుకునేలా కార్బోహైడ్రేట్లను సింథసైజ్ చేస్తుంది. సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది…’ అని ఎస్తటిక్ క్లినిక్స్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రింకీ కంపూర్ వివరించారు.

‘నియాసినమైడ్ నీటిలో కరిగే స్వభావం కలిగి ఉన్న విటమిన్. ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిలో యాంటాక్సైడ్ గుణాలు రక్త ప్రసరణను పెంచుతాయి. జుట్టు ఫాలికల్స్‌కు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. జుట్టుకు బలాన్నిస్తుంది. మాడు ఆరోగ్యకరంగా ఉంటుంది. మాడుపై మంటను తగ్గిస్తుంది…’ అని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనూప్ ధీర్ చెప్పారు.

నియాసినమైడ్ ఉపయోగాలు ఇవీ

నియాసినమైడ్‌తో జుట్టకు గల ప్రయోజనాలను డాక్టర్ రింకీ కపూర్ ఇలా వివరించారు.

• ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: విటమిన్ B3 శక్తిని అందించడంలో బాధ్యత వహిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలను అందజేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆకృతిని మెరుగుపరచడం ద్వారా జుట్టుకు మెరుపు, మృదుత్వాన్ని ఇస్తుంది. ఈ విటమిన్ రసాయనికంగా దెబ్బతిన్న జుట్టుకు తిరిగి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.

• కెరాటిన్ సంశ్లేషణ, ఉత్పత్తికి: కెరాటిన్ అనేది సహజమైన ప్రోటీన్. మన జుట్టుకు 90% కెరాటిన్ ఉంటుంది. నియాసినామైడ్ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కెరాటిన్ స్థాయి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది పగుళ్లు, పెళుసుదనం తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టును ఇస్తుంది.

• స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: పురుషులు, స్త్రీలలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో వాపు ఒకటి. నియాసినామైడ్ స్కాల్ప్‌లో ఎరుపు, మంటను తగ్గిస్తుంది. జుట్టు రాలడం మరింత దిగజారకుండా చేస్తుంది. జుట్టు మందంగా, ఒత్తుగా మారుతుంది.

• ఒత్తైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: ఆక్సిడేట్ ఒత్తిడి తగ్గడం కారణంగా నికోటినామైడ్‌తో ఫోలిక్యులర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు ఆకృతిని, మందాన్ని మెరుగుపరుస్తుంది.

• పర్యావరణ నష్టం నుండి జుట్టును రక్షిస్తుంది: నియాసినామైడ్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది యూవీ కిరణాల హానికరమైన ప్రభావాల నుండి జుట్టును రక్షిస్తుంది. కాలుష్యం, వేడి మొదలైన వాటి వల్ల జుట్టు పొడిబారకుండా చేస్తుంది. స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం