తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2023 Kawasaki Z400 | స్పోర్టియర్ లుక్‌తో కవాసకి నుంచి తిరుగులేని స్ట్రీట్ బైక్!

2023 Kawasaki Z400 | స్పోర్టియర్ లుక్‌తో కవాసకి నుంచి తిరుగులేని స్ట్రీట్ బైక్!

HT Telugu Desk HT Telugu

09 June 2022, 22:43 IST

    • 2023 Z400 మోటార్‌సైకిల్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల అయింది. దీని విశేషాలు ఇలా ఉన్నాయి
2023 Kawasaki Z400
2023 Kawasaki Z400

2023 Kawasaki Z400

జపాన్‌కు చెందిన బైక్‌ల తయారీ సంస్థ కవాసకి అంతర్జాతీయ మార్కెట్‌లో సరికొత్త 2023 2023 Kawasaki Z400 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్త దీనితో పాటే నింజా 400 స్పోర్ట్ బైక్‌ను కూడా కవాసకి అప్‌డేట్ చేసింది. ఇది త్వరలో భారతీయ మార్కెట్లోనూ విడుసదలయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

సరికొత్త కవాసకి Z400 మోటార్‌సైకిల్‌ విషయానికి వస్తే దీని పవర్‌ప్లాంట్ (ఇంజన్) అతిపెద్ద అప్‌డేట్‌లలో ఒకటి. కంపెనీ దీనిని నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరించింది. ఇది Euro5 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే ఇంజన్ ఇప్పటికీ అదే 399cc ప్యారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ యూనిట్. ఇది 44bhp శక్తి వద్ద 37Nm టార్క్‌ను అందిస్తుంది. పవర్ అవుట్‌పుట్ అలాగే ఉన్నప్పటికీ, కొత్త మోడల్‌లో టార్క్ ఫిగర్ 1Nm తగ్గింది. ఈ ఇంజన్ ను స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు.

డిజైన్- స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా స్వల్ప మార్పులు మినహా Kawasaki Z400 దాని పాత మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ముఖ్యంగా 2022 కవాసకి నింజా 400 Z H2-ప్రేరేపిత స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇందులో సింగిల్-పాడ్ హెడ్‌లైట్, ష్రౌడ్స్‌ కవచాలతో కూడిన దృఢమైన ఇంధన ట్యాంక్, స్టెప్-అప్ సీటు, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. రోడ్‌స్టర్-సెగ్మెంట్ మోటార్‌సైకిల్ అయినందున Z400 నింజా 400లో క్లిప్-ఆన్-స్టైల్ యూనిట్‌లకు బదులుగా సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్‌ను ఉపయోగిస్తుంది.

Z400 క్యాండీ లైమ్ గ్రీన్ విత్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అలాగే పెరల్ రోబోటిక్ వైట్ విత్ మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.

బైక్ హార్డ్‌వేర్ కిట్ లో ఎలాంటి మార్పులేదు. ఇందులో అదే 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ , ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ కోసంఇది ముందు భాగంలో ఒకే 310 మిమీ డిస్క్ అలాగే వెనుక భాగంలో 220 మిమీ డిస్క్‌లను అమర్చబడి అమర్చారు.

Z400 కొత్త BS-VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ బైక్ ఇండియన్ మార్కెట్లోకి వస్తుందా అనేదానిపై స్పష్టత లేదు అయితే 2023 నింజా 400 మాత్రం ఇండియాలో విడుదల కానుంది. ఈ బైక్ ధరలు సుమారు రూ. 4.60 లక్షల నుంచి రూ. 4.75లక్షల వరకు ఉండనున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం