తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2022 Audi Rs7 Exclusive Edition । ఈ కార్ చాలా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ కూడా !

2022 Audi RS7 Exclusive Edition । ఈ కార్ చాలా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ కూడా !

HT Telugu Desk HT Telugu

12 July 2022, 19:00 IST

    • ఆడి కంపెనీ Audi 2022 RS7 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మోడల్‌ కారును ఆవిష్కరించింది. ఇది మిగతా ఆడి కార్లతో పోలిస్తే చాలా స్పెషల్. మరి ఏంటా స్పెషల్? దీని ఫీచర్లు, ఈ కార్ ధర మొదలగు విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
2022 Audi RS7 Exclusive Edition
2022 Audi RS7 Exclusive Edition

2022 Audi RS7 Exclusive Edition

లగ్జరీ కార్ల తయారీదారు ఆడి సరికొత్త Audi 2022 RS7 కారులో స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను పరిచయం చేసింది. దీనిని "ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్" అని పిలుస్తున్నారు. ఇది కేవలం 23 యూనిట్లలో మాత్రమే లభిస్తుంది. అంటే ఈ 2022 Audi RS7 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ మోడల్ కారు ప్రపంచవ్యాప్తంగా 23 మంది వద్ద మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆడి ఈ కారు మోడల్‌ను కేవలం యూఎస్ మార్కెట్లోనే విడుదల చేయడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

2022 ఆడి RS7 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కారును సొంతం చేసుకోవాలంటే ముందుగా $1,095 డెస్టినేషన్ (రూ. 87,205) ఫీజును చెల్లించాలి. ఆపై ఈ కారు ధర $166,495 (సుమారు రూ. 1.32 కోట్లు) ప్రారంభమవుతుంది.

ఈ కారులో మిగతా ఆడి కార్లతో పోలిస్తే కొన్ని ఫీచర్లను అప్‌గ్రేడ్ చేశారు. ఇది విలాసవంతమైన A7 స్పోర్ట్‌బ్యాక్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ కార్. ఇందులో క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటు కార్బన్-ఫైబర్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. శక్తివంతమైన బ్యాంగ్ & ఓలుఫ్‌సెన్ సౌండ్ సిస్టమ్, నైట్ విజన్, ఎయిర్ సస్పెన్షన్, స్పోర్ట్ ఎగ్జాస్ట్ వంటి ఎన్నో మెరుగైన ఫీచర్లు ఉంటాయి.

ఎందుకంత స్పెషల్

మరి Audi 2022 RS7 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ఎందుకంత స్పెషల్ కార్? ఇందులో ఏముంది అంటే.. దీని స్టైల్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలిమెంట్స్ ప్రత్యేకమైనవి. ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కారు 'మాంబా బ్లాక్' అనే ప్రత్యేకమైన పెయింట్‌ స్ప్రేతో వస్తుంది. అలాగే బ్లూకలర్ లోని టోన్స్ కలిగి ముత్యాల వంటి ముగింపును కలిగి ఉంటుంది. ఇలాంటి పెయింట్ వర్క్ మరేతర ఆడి కార్లలో కనిపించదు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. 2022 RS7 యొక్క ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, ప్రీమియం అల్కాంటారా అప్హోల్స్టరీతో కూడిన సెపాంగ్ బ్లూ స్టిచింగ్‌ను కలిగి ఉంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్-షిఫ్టర్‌లతో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో నాలుగు-సీట్ల క్యాబిన్ ఉంది.

ఇంజన్ కెపాసిటీ

2022 RS7 ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌లో 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ ఉంటుంది. ఇది 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో అనుసంధానం చేసి ఉంటుంది. అలాగే దీనికి 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ ఇంజన్ సెటప్ గరిష్టంగా 591hp శక్తిని, 800Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కార్ గంటకు 305 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం