తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కూతురి కోసం స్మోకింగ్ మానేసిన హీరో.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే

కూతురి కోసం స్మోకింగ్ మానేసిన హీరో.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే

HT Telugu Desk HT Telugu

23 February 2024, 9:40 IST

    • షాహిద్ కపూర్‌కు తన కూతురంటే ప్రాణం. తన కూతురి ప్రేమ కారణంగా షాహిద్ కపూర్ తన చెడు అలవాటు అయిన స్మోకింగ్ వదిలేసి చాలా హ్యాపీగా ఉన్నాడు.
కూతురి కోసం స్మోకింగ్ వదిలేసిన హీరో
కూతురి కోసం స్మోకింగ్ వదిలేసిన హీరో

కూతురి కోసం స్మోకింగ్ వదిలేసిన హీరో

కొడుకుగా, భర్తగా, తండ్రిగా మంచి మార్కులే సాధించిన షాహిద్ కపూర్ నటుడిగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. షాహిద్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు. తన పిల్లలిద్దరినీ అమితంగా ప్రేమిస్తాడు. ఇన్నేళ్లుగా స్మోకింగ్ అలవాటు ఉన్న షాహిత్ తన కూతురిపై ఉన్న ప్రేమ కారణంగా దానిని వదిలేశాడు. తన కూతురు కారణంగా ధూమపానం ఎందుకు మానేశాడో షాహిద్ ఇటీవలే చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

స్మోకింగ్ ఎందుకు మానేశాడు?

నేహా ధూపియా చాట్ షో నో ఫిల్టర్ నేహాలో షాహిద్ తాను ధూమపానం ఎందుకు మానేశానో చెప్పాడు. ‘నేను స్మోక్ చేసే సమయంలో నా కూతురికి తెలియకుండా స్మోక్ చేసేవాన్ని. అందుకే మానేశాను. ధూమపానం కారణంగా నేను నా కుమార్తెకు దూరంగా దాక్కోవాల్సి వస్తోందని ఒక రోజు అనుకున్నాను. ఆ రోజు స్మోకింగ్ మానేస్తానని నాకు నేను చెప్పుకున్నాను..' అని చెప్పుకొచ్చాడు.

ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో తండ్రి అయ్యాక ఎలాంటి మార్పులు కనిపించాయని ప్రశ్నించగా, గతంలో తాను సినిమా చూసినప్పుడు పిల్లల కోణంలో చూసేవాడినని, కానీ తాను పితృత్వ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు తండ్రి కోణంలో సినిమా చూస్తున్నానని షాహిద్ చెప్పాడు.

ప్రొఫెషనల్ లైఫ్

ఇక షాహిద్ ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల ఆయన నటించిన తేరీ బాత్ మే ఐసా టాంగ్ జియా చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కృతి సనన్ నటించింది. ఈ సినిమాలో షాహిద్ ప్రేమలో పడే రోబో పాత్ర కృతిది. ఈ సినిమాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు దేవా అనే సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో షాహిద్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం