తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Waat Laga Denge Song: ఊపు తెప్పిస్తున్న లైగర్‌ "వాట్‌ లగా దేంగే" సాంగ్

Liger Waat Laga Denge Song: ఊపు తెప్పిస్తున్న లైగర్‌ "వాట్‌ లగా దేంగే" సాంగ్

HT Telugu Desk HT Telugu

29 July 2022, 11:05 IST

    • Liger Waat Laga Denge Song: లైగర్‌పై రోజురోజుకూ అంచనాలు పెంచేస్తున్నారు ఈ మూవీ మేకర్స్‌. లిరికల్ సాంగ్‌, ట్రైలర్‌తో అదరగొట్టిన టీమ్‌.. ఇప్పుడు వాట్‌ లగా దేంగే అనే సాంగ్‌ రిలీజ్‌ చేసింది.
వాట్ లగా దేంగే సాంగ్ లో విజయ్ దేవరకొండ
వాట్ లగా దేంగే సాంగ్ లో విజయ్ దేవరకొండ

వాట్ లగా దేంగే సాంగ్ లో విజయ్ దేవరకొండ

ఇప్పుడు టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌కు కూడా లైగర్‌ మానియా పట్టుకుంది. ఈ స్పోర్ట్స్‌ డ్రామాలో ఓ బాక్సర్‌గా కనిపిస్తున్న విజయ్‌ దేవరకొండ తన లుక్స్‌, మాస్‌ యాక్షన్‌తో కట్టిపడేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వాట్‌ లగా దేంగే అనే సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ వీడియోను విజయ్ శుక్రవారం (జులై 29) ఉదయం తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

వి ఆర్‌ ఇండియన్స్‌.. హమ్‌ కిసీసే కమ్‌ నహీ (మేము ఇండియన్స్‌.. మేము ఎవ్వరి కంటే తక్కువ కాదు).. నాతో రండి.. పోదాం కొట్లాడదాం.. అనే విజయ్‌ డైలాగ్‌తో ఈ సాంగ్‌ మొదలవుతుంది. ఆ తర్వాత వాట్‌ లాగా దేంగే అంటూ సాగుతుంది. ఈ సాంగ్‌లో రమ్యకృష్ణ కూడా కనిపిస్తుంది. పక్కా మాస్ బీట్స్‌తో సాగే ఈ పాట ఫ్యాన్స్‌ను అలరించడం పక్కా.

మూవీలో విజయ్‌ దేవరకొండ క్యారెక్టర్‌కు అద్దం పట్టేలా ఈ వాట్‌ లగా దేంగే సాంగ్‌ సాగింది. ఓ చాయ్‌ అమ్ముకునే కుర్రాడు.. ఆ తర్వాత గొప్ప మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) అథ్లెట్‌గా ఎలా మారతాడన్నదే ఈ సినిమా స్టోరీ. వందకు వంద శాతం పూరి జగన్నాథ్ మార్క్‌ ఈ మూవీ ట్రైలర్‌, సాంగ్స్‌లో కనిపిస్తోంది. వీటితో సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లారు.

ఈ లేటెస్ట్‌ సాంగ్‌ లిరిక్స్‌ను డైరెక్టర్‌ పూరి జగన్నాథే రాయడం విశేషం. సునీల్‌ కశ్యప్‌ ఈ సాంగ్‌ కంపోజ్ చేశాడు. ఈ పాట విన్న తర్వాత మూవీ కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అంటూ కొందరు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే నెల 25న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్లలో విజయ్, అనన్యా పాండే బిజీగా ఉన్నారు. ఈ మధ్యే వాళ్లు వాళ్లు ముంబై వీధుల్లో స్టెప్పులేసిన ఫొటోలు కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7 ఎపిసోడ్‌లోనూ కనిపించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం